Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర భవిష్యత్తుకు మీ తొలి ఓటే అతి కీలకం

– తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వచించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్క యువతి,యువకులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క యువత కూడా తమ భవిష్యత్ నీ కాపాడే నాయకుడు నీ ఎన్నుకోవలసిన బాధ్యత మీపైనే ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో యువత ఉపాధి లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవం ఆడుతుంది

నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగలరు. కాబట్టి యువత మొత్తం కూడా తమ బాధ్యతను గుర్తు పెట్టుకొని తమ తల రాతను తామే మార్చుకోవాలి.పరిశ్రమలు కంపెనీలు రావాలన్న మన యువత జీవితాలలో వెలుగులు కావాలన్నా మన చంద్రన్న రావాలి. మీ తొలి ఓటుతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.

LEAVE A RESPONSE