Suryaa.co.in

Andhra Pradesh

కనిగిరిలో జనప్రభంజనంగా మారిన యువగళం

-అడుగడుగునా యువనేతకు జనం బ్రహ్మరథం
-బహిరంగసభకు పోటెత్తిన ప్రజలు… కిటకిటలాడిన రోడ్లు
-జోరువర్షంలోనూ యువనేత లోకేష్ పాదయాత్ర

కనిగిరి: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కనిగిరిలో జనసంద్రంగా మారింది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణ ప్రజలు రోడ్ల వెంట నిలబడి అపూర్వ స్వాగతం పలికారు. 160వరోజు పాదయాత్ర కనిగిరి శివారు శంకవరం నుంచి ప్రారంభం కాగా, అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. మహిళలు హారతులు, గుమ్మడికాయలతో దిష్టితీస్తూ యువనేతను స్వాగతించారు. యువనేత రాకతో కనిగిరి రహదార్లు జాతరను తలపించాయి. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. రహదారులు, భవనాలపై నిలబడి జనం లోకేష్ కు అభివాదం చేశారు. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతను కలిసేందుకు పెద్దఎత్తున రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. యువనేతను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు వింటూ యువనేత ముందుకు సాగారు. కనిగిరి పామూరు బస్టాండులో బహిరంగసభజనప్రంభజనాన్ని తలపించింది. బహిరంగసభ వేదికకు కిలోమీటరు దూరం వరకు రోడ్లు జనమయమయ్యాయి. లోకేష్ ను కలిసి వివిధవర్గాల ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. శంకవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర… కనిగిరి పామూరు బస్టాండు, ఒంగోలు బస్టాండు, చెక్ పోస్టు, టకారిపాలెం, దేవాంగనగర్, కాశిరెడ్డినగర్, చల్లగరిగల, నందనమారెళ్ల మీదుగా ఎర్రఓబునపల్లి విడిది కేంద్రానికి చేరుకుంది. 160వరోజు యువనేత లోకేష్ 14.4 కి.మీ. ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2120.3 కి.మీ. మేర కొనసాగింది. శుక్రవారం మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్ర అక్కడ మూడురోజులపాటు కొనసాగనుంది.

యువగళాన్ని అడ్డుకునేందుకు ఐప్యాక్ తో డ్రామాలు!

యువగళాన్ని అడ్డుకునేందుకు జగన్ అన్ని ప్రయత్నాలుచేసి ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు, నా యాత్ర కి ఐప్యాక్ టీంని పంపిస్తే మన వాళ్లు పట్టేసారు, యువగళం మొత్తం లైవ్ లో వస్తుంది సైకో జగన్, ఐప్యాక్ ఇక్కడికొచ్చి ఏం  పీకుతుందని యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనిగిరిలో నిర్వహించిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ… ఐప్యాక్ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. వెంటనే ప్యాలస్ బ్రోకర్ సజ్జలను పిలిచి చితకబాదాడు. ప్రకాశం జిల్లాలో యువగళం ప్రభంజనంలా సాగుతుంది. అడ్డుకోవడానికి ఎదో ఒకటి చెయ్యి అని చెప్పాడు. వెంటనే ప్యాలస్ బ్రోకర్ వైసిపి నేతల్ని, వాలంటీర్లను రంగంలోకి దింపాడు. అర్ధరాత్రి దొంగల్లా ఫ్లెక్సీలు పెడితే మన వాళ్లు పట్టేసారు. వాళ్లకి ఫ్లెక్సీలు వెయ్యడం కూడా రాదు. అందుకే అనేది వైసిపి ఒక చిల్లర పార్టీ. ఫ్లెక్సీలు మేము పెట్టలేమా? మేము పెడితే నువ్వు గుండె ఆగి చస్తావ్. జగన్ ఒక దొంగ..షర్మిలే వైఎస్ నిజమైన వారసురాలు..ఇట్లు షర్మిల ఫ్యాన్స్ అని ఫ్లెక్సీ వేయించమంటావా? అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు కొంటాడా? ఇట్లు విజయలక్ష్మి ఫ్యాన్స్ అని ఫ్లెక్సీ వేయించమంటావా? మిస్టర్ జగన్…మమ్మల్ని కెలకొద్దు నీకు నిద్ర లేకుండా చేస్తాం. నీకు ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర. కానీ ఇప్పుడు స్లోగన్ మార్చా సాగనిస్తే పాదయాత్ర..కెలికితే వైసిపి కి అంతిమయాత్ర.

కనిగిరి గడ్డపై పాదయాత్ర చేయడం అదృష్టం

కందుకూరు అదిరిపోయింది, కొండపి దద్దరిల్లింది, కనిగిరి కదం తొక్కింది. కాటమరాజు పాలించిన బంగారుకొండ కనిగిరి. పోరాటాల గడ్డ కనిగిరి. ఎంతో ఘన చరిత్ర ఉన్న కనిగిరి గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం..మనగళం..ప్రజాబలం. యువగళం అంటే జగన్ కి భయం, ఎందుకో చెబుతా. నన్ను అడ్డుకోమని పోలీసుల్ని పంపాడు…అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా? నా మైక్ లాక్కున్నారు…విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి గొంతు ఆపే సత్తా ఎవడికైనా ఉందా? నా స్టూల్ లాక్కున్నారు…ఇది చంద్రబాబు గారి గుండె…తగ్గుతామా? తగ్గేదేలేదు.

టెన్త్ ఫెయిల్ జగన్…కేంబ్రిడ్జి డైలాగులు!

చంచల్ గూడా జైల్ స్టూడెంట్ నంబర్ 6093 ఈ మధ్య జబర్దస్త్‌ కామిడీ చేస్తున్నాడు. మన యూనివర్సిటీలు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తో పోటీపడాలి అంటున్నాడు. అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? అరకులోయ డిగ్రీ కాలేజ్ లో పైకప్పు కూలింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిగెత్తి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పులిరాముడిగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ లో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ ని హత్య చేసారు. స్కూళ్ల‌లో టీచ‌ర్లు లేరు…చాక్ పీసుల‌కి దిక్కులేదు. యూనివర్సిటీలను వైసిపి కార్యాలయాలుగా మార్చేసాడు.  యూనివర్సిటీలకు చెందిన రూ.150 కోట్ల నిధులు పక్కదారి పట్టించాడు. కొత్తగా ఒక ప్రొఫెసర్ ని నియమించలేదు. టెన్త్ ఫెయిల్ జగన్ నీకు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి భారీ డైలాగులు అవసరమా?

ఊరికో ప్యాలెస్ ఉన్నడు పేదవాడా?

జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు.  బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.

జగన్ డిల్లీ ఎందుకు వెళ్లాడు?

జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ ఎందుకు వెళ్లాడు? మొదటి ఆప్షన్ బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 అవినాష్ కి కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి. మూడో ఆప్షన్. భార్య భారతీ రెడ్డి గారిని కేసు నుండి తప్పించాడనికి. నాలుగో ఆప్షన్. ఆల్ ది ఎబోవ్.  ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? పిన్ని తాళి తెంచింది ఎవరు? చెల్లిపై నిందలు వేసింది ఎవరు?  బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర.

కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్

జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.  అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.

దమ్ముంటే బిల్లులపై స్టిక్కర్లు వేయండి

జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు.

కన్నీళ్లు తుడిచేందుకే మహాశక్తి

2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడిచేందుకే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం

జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

రైతులకు ఉరితాడు బిగించాలని చూస్తున్నారు!

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.  జగన్  పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం

జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది.

జగన్ పాలనలో బిసిలపై వేధింపులు

బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు.  అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డిని అడ్డుకున్నాడు.  బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. టిడిపి అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంది. మేం వచ్చాక అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.

దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్సులిచ్చారు

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. తాడిపత్రి లో వైసిపి నేతల ఒత్తిడి తట్టుకోలేక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. టిడిపి నేత జేసి ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తల పై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి చెయ్యడంతోనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయారు. జగన్ ఆ కుటుంబానికి అన్యాయం చేసాడు. ఆనందరావు కుటుంబాన్ని టిడిపి ఆదుకుంటుంది. ఆనందరావు ఆత్మహత్యకు కారణం అయిన వారిని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం.

ప్రకాశం జిల్లాకు జగన్ పీకిందేమిటి?

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు.2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం.2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి.  కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు.  నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది.

గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశాడు!

రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు.  దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. వైసిపి నాయకులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఉన్న 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు చర్చకు రండి. ఎవరి హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందిందో చర్చకు నేను సిద్ధం.

కనిగిరిలో అభివృద్ధి నిల్లు… అవినీతి ఫుల్లు

కనిగిరిని కనకగిరి గా మార్చేస్తారని మీరు మధుసూదన్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించారు. మధుసూదన్ పాలనలో కనిగిరి లో అభివృద్ధి నిల్లు..అవినీతి ఫుల్లు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా కి కనిగిరి ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసారు. ఆయన అవినీతి గురించి తెలుసుకున్న తరువాత ఆయనకి మనీసూధన్ అని పేరు పెట్టాను. నియోజకవర్గం లో ఏ పని జరగాలి అన్నా మనీసూధన్ గారికి 20 శాతం కప్పం కట్టాల్సిందే. మనీసూధన్ సెంటు స్థలాల పేరుతో భారీ స్కాం కి పాల్పడ్డాడు.45 ఎకరాలు, ఎకరం రూ.3 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.15 లక్షలకు అమ్మేసి రూ.6 కోట్లు కొట్టేసాడు.  కనిగిరి నియోజకవర్గంలో సెంటు స్థలాలు, మట్టి పనుల పేరుతో మనీసూధన్, ఆయన అనుచరులు రూ.100 కోట్లు లేపేసారు. మనీసూధన్ భూకబ్జాలకు సహకరించలేదని ఎమ్మార్వో సుధాకర్ గారిని సస్పెండ్ చేయించాడు.

ఉపాధి హామీ నిధులను కొట్టేశాడు!

అవినీతి లో పిహెచ్డి చేసాడు మనీసూధన్. ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్లు వెయ్యకుండానే రూ.5 కోట్లు కొట్టేసాడు. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్రను కొట్టేస్తున్నాడు మనీసూధన్. వెలిగండ్ల మండలం తహసీల్ధార్ కార్యాలయం సమీపంలో సర్వే నంబర్ 349/2 లో ఉన్న భూమిని మనీసూధన్ అనుచరుడు మురళి కబ్జా చేసి లేఔట్ వేసారు. కనిగిరి నియోజకవర్గంలో వందల ఎకరాల అసైన్డ్ భూములు, ఇసుక, మట్టి కొట్టేస్తున్నారు మనీసూధన్, ఆయన అనుచరులు. పామూరు మండలం నర్రమారెళ్ల లో 70 ఎకరాల భూమి కొట్టేయడానికి స్కెచ్ వేసారు. బాధితులు కోర్టులో పోరాడుతున్నారు. రేషన్ బియ్యం మాఫియా కి మనీసూధన్ డాన్. పేదల బియ్యాన్ని ఎక్స్ పోర్ట్ చేస్తున్నాడు.

వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక

కనిగిరిని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసింది టిడిపి. కనిగిరికి జగన్ అనేక హామీలు ఇచ్చాడు.  వెలిగొండ పూర్తిచేసి సాగు,తాగునీరు అందిస్తాం అని చెప్పాడు. నీళ్లు ఇచ్చాడా? కనిగిరిలో డయాలసిస్ సెంటర్లలో వైద్యులను నియమిస్తామని హామీ ఇచ్చాడు. షార్ట్ సర్క్యూట్ అయితే కనీసం జనరేటర్ పెట్టి నడిపించే దిక్కు లేదు. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు? ఒక్క కంపెనీ తెచ్చాడా? కనిగిరి నియోజకవర్గం లో వలసలు ఎక్కువుగా ఉన్నాయి.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలు ఆపేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.  వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందిస్తాం.

ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరిస్తాం!

ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు పడుతున్న బాధలు నేను చూసాను. ఫ్లోరైడ్ సమస్య కు శాశ్వత పరిష్కారంగా టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం అన్ని వసతులతో కూడిన డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన మేర డాక్టర్లను నియమిస్తాం.  నిమ్మ, బత్తాయి, పొగాకు రైతుల కష్టాలు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.  టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తాం.

ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఉగ్రనరసింహ!

కనిగిరి ప్రజల కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి డాక్టర్. ఉగ్ర నరసింహ రెడ్డి. ప్రజలు కష్టాల్లో ఉంటే పలకరించేది మన ఉగ్ర నరసింహ రెడ్డి గారు.. ప్రతిపక్షంలో ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేషెంట్ కి ఏ మందు వేస్తే జబ్బు తగ్గుతుందో మన డాక్టర్ గారికి బాగా తెలుసు.  అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఎలా పరిష్కారం చెయ్యాలో కూడా ఆయనకే బాగా తెలుసు. వైసిపి నాయకులకు హెచ్చరిక జారీచేస్తున్నా మా ఉగ్ర నరసింహం జోలికి రావొద్దు, పొరపాటున వస్తే వేటాడేస్తాడు. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తా. పసుపు జెండాని మోస్తున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా.రెడ్ బుక్ మా వద్ద ఉంది చట్టాలు అతిక్రమించి అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటాం.భయం నా బయోడేటా లో లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. జగన్ కి భయం పరిచయం చేసే బాధ్యత నాది.

నారా లోకేష్ ను కలిసిన కనిగిరి శివారు శంకవరం ప్రజలు

కనిగిరి శివారు శంకవరం ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.దాదాపు 1600 ఓట్లు ఉన్న మా గ్రామాన్ని కనిగిరి మున్సిపాలిటీలో కలిపారు.మా ప్రాంతంలో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.గత నాలుగేళ్లుగా ఆర్ అండ్ బి రోడ్డు సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు.పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది.మావార్డులో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఫ్లోరైడ్ నీటితో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి.మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ కు పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేదు.గత నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై తట్టిమట్టి పోసిన పాపాన పోలేదు.టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు నిర్మించాం.మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాడైపోయిన రోడ్లన్నింటినీ పునర్ నిర్మిస్తాం.వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కనిగిరి పట్టణ ముస్లింలు

కనిగిరి ఒంగోలు బస్టాండు వద్ద 10వవార్డు ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.మైనారిటీలకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలి.మైనారిటీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన పదవులు కేటాయించాలి.ఇస్లామిక బ్యాంకు ఏర్పాటు చేసి ముస్లిములకు ఆర్థిక తోడ్పాటునందించాలి.హజ్ హౌస్ లోని నిధులను కేవలం దాని అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలి.మా వార్డులో డ్రైనేజీ సమస్య అత్యధికంగా ఉంది. బీసీలకు శ్మశానవాటికను అభివృద్ధి చేయాలి.నిత్యావసరాల ధరలు, బస్సు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు. మైనారిటీ సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.5400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు.గత నాలుగేళ్లలో వేలకోట్ల మైనారిటీ ఆస్తులను వైసిపినేతలు కబ్జాచేశారు.నర్సరావుపేటలో మసీదు ఆస్తుల కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికిచంపారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి, పేద ముస్లింల స్వయం ఉపాధికి రుణాలు అందజేస్తాం.హజ్ హౌస్ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం.గత ప్రభుత్వంలో మైనారిటీలకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.కనిగిరి పట్టణంలో డ్రైనేజి, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తెస్తాం.

నారా లోకేష్ ను కలిసిన కనిగిరి దళితులు

కనిగిరి చెక్ పోస్టు వద్ద 12వవార్డు దళితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.మా వార్డులు 250 దళిత కుటుంబాలు ఉన్నాయి.అందరం చేతివృత్తి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం.మాకు జగనన్న కాలనీల్లో కేటాయించిన ప్లాట్లు రద్దు చేశారు.మా కాలనీకి సరైన రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.మా కాలనీలో చనిపోయిన వారికి వాగులో అంత్యక్రియలు చేయాల్సివస్తోంది. వాగుమొత్తం ముళ్లచెట్లతో నిండి ఉంది.మీరు అధికారంలోకి వచ్చాక మాకు శ్మశానాన్ని అభివృద్ధి చేయాలి.మా కాలనీలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డికి దళితుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు.దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలు రద్దు చేశాడు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లు దారిమళ్లించి, తీరని అన్యాయం చేశారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. అంబేద్కర్ పేరిట కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు చేపడతాం.

లోకేష్ ను కలిసిన టకారిపాలెం, దేవాంగనగర్ ప్రజలు

కనిగిరి పట్టణంలోని టకారిపాలెం, దేవాంగనగర్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా ప్రాంతంలో 300కుటుంబాలు నివాసముంటున్నాం.మాకు వ్యవసాయ భూములు లేవు.రాళ్లకొట్టే పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాం.రాళ్ల పనుల్లో వాయుకాలుష్యం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.మీరు అధికారంలోకి వచ్చాక మా కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలి.భూమి లేనివారికి వ్యవసాయ భూములు ఇప్పించాలి.మా ప్రాంతంలో 60కుటుంబాలు చేనేత వృత్తి చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి.మా ప్రాంతంలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు సమస్యలు అధికంగా ఉన్నాయి.మీరు అధికారంలోకి వచ్చాక మా ప్రాంత సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదివరకెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున వలసలు పెరిగాయి.గతనాలుగేళ్ల పాలనలో చేతివృత్తి పనివారు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు.టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ద్వారా వలసలు నివారిస్తాం.రాళ్లు కొట్టే కార్మికులకు, చేనేతలకు సబ్సిడీరుణాలతోపాటు ఆరోగ్య బీమా కల్పిస్తాం.వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.తిరిగి చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

నారా లోకేష్ ను కలిసిన యానాది సామాజికవర్గీయులు

కనిగిరి పట్టణ యానాది సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.యానాది సామాజికవర్గానికి చెందిన మేం పేదరికంలో మగ్గుతున్నాం.మేము చేపలు పట్టడం,కూలిపనులు,చెత్తకాగితాలు ఏరుకునే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.మా పూర్వీకులకు కాశిరెడ్డినగర్ వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చారు.మా జనాభా పెరగడంతో ప్రస్తుతం ఇళ్లు మాకు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం.మాకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి.మాకు చేపల సొసైటీ ఉంది. అందులో 97మంది మెంబర్లు ఉన్నారు.నీళ్లు నిల్వ ఉండే చెరువు ఒక్కటి కూడా లేదు.పాలేటిపల్లి రిజర్వాయర్ ను మా సొసైటీకి ఇప్పించి మాకు జీవనోపాధి కల్పించాలి.మా కుటుంబాలకు కేటాయించిన భూముల పట్టాలు నేటికీ ఇవ్వలేదు.దీంతో వ్యవసాయ సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు కావడం లేదు.మా పిల్లల చదువుకు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేవు.మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్న వైసిపి నేతలు… సొంతపార్టీ వారికి తప్ప పేదలకు స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు ఇళ్లస్థలాలతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.పాలేటిపల్లి రిజర్వాయర్ లో యానాదులకు చేపలవేట హక్కు కల్పిస్తాం.యానాదులకు కేటాయించిన భూములకు పట్టాలిచ్చి, వ్యవసాయ సబ్సిడీలను అందజేస్తాం.యానాదుల పిల్లలకు బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన చల్లగరిగల గ్రామస్తులు

కనిగిరి నియోజకవర్గం చలగరిగల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.కనిగిరి కాటంరాజు ఏలిన కొండను పర్యాటక కేంద్రంగా మార్చాలి.పొగాకు బోర్డు నుండి ఎస్టీ కాలనీకి రోడ్డు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.మా గ్రామంలోని ఎస్టీలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.పావురాల చెరువు, ఎగువకుంట, కొత్తకుంట చెరువులు అభివృద్ధి చేసి భూగర్భజలాలు పెంచాలి.మా గ్రామ రైతులు పొలాలు వెళ్లే ప్రాంతాల్లో మెటల్ రోడ్లు నిర్మించి సమస్యలు పరిష్కరించాలి.ఆర్ అండ్ బి రోడ్డు నుండి చల్లగిరిగల గ్రామంలోకి సీసీరోడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ అధికారంలోకి వచ్చాక చారిత్రక ప్రదేశాలను విధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు.రుషికొండను గుండుకొట్టించాడు, బ్రహ్మంగారు కాలజ్ఞానం చేసిన రవ్వలకొండను గ్రావెల్ కోసం ధ్వంసం చేశారు.టిడిపి అధికారంలోకి వచ్చాక కాటంరాజు కొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.ఎస్టీకాలనీకి రోడ్డు నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం.ఇళ్లు లేని వారికి స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.చిన్ననీటి వనరుల అభివృద్ధి, పుంతరోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

నారా లోకేష్ ను కలిసిన నందనమారెళ్ల గ్రామస్తులు

కనిగిరి నియోజకవర్గం నందనమారెళ్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.1956 నుండి మా పూర్వీకులు, ప్రస్తుతం మేము వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం.మా సాగుభూములను వైసీపీ నాయకులు ఆక్రమించారు.దీనిపై మేం నిలదీస్తే మమ్మల్ని కొట్టి, మాపై తప్పుడు కేసులు బనాయించారు.మా భూములను సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాం.మాకు సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు.మీరు అధికారంలోకి వచ్చాక మా భూములు మాకు ఇప్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యాన తాలిబాన్ తరహా పాలన సాగిస్తున్నారు.వైసిపి సైకోల కన్ను పడితే భూములు వదిలేసి వెళ్లాల్సిన భయానక పరిస్థితులు కల్పిస్తున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలనుంచి వైసిపి నేతలు లాక్కున్న భూములను తిరిగి రైతులకు అప్పగిస్తాం.చల్లగరిగల రైతులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాం. భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం.

LEAVE A RESPONSE