Suryaa.co.in

Andhra Pradesh

దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి

– జగన్ పరిపాలనలో ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చారు
– మరో 30 ఏళ్ళు జగన్ పరిపాలన రాష్ట్రానికి అవసరం
– జగన్ గొప్ప మానవతావాది… ప్రజల కోసమే పుట్టిన ప్రజా నాయకుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా వాడవాడలా పండుగ వాతావరణంలో పార్టీ శ్రేణులు కేకులు కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. కొన్నిచోట్ల నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. పలు చోట్ల పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
sajjala2మొక్కలు నాటారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణా సంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ లు సామినేని ఉదయభాను, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంఎల్ ఏలు మేరుగు నాగార్జున, మొండితోక జగన్మోహన్ రావు, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, పండుల రవీంద్రబాబు, కల్పలతారెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంతో పోటీ పడేలా జగన్ పరిపాలన:సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజల ప్రియతమ నేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులందరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజలందర్నీ తన కుటుంబసభ్యులుగా భావిస్తూ పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో చిరునవ్వులే ఇందుకు సాక్ష్యం అన్నారు.

ప్రతి కుటుంబం కూడా భవిష్యత్తుపై దీమాతో జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వైయస్ జగన్ పరిపాలనే అన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పథకాలను తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రతి విద్యార్ధిలో తమ మేనమామ జగనన్న చదివిస్తున్నాడు అన్న భావన నెలకొందన్నారు. యూనిఫాం నుంచి స్కూల్ బ్యాగ్, షూస్, పుస్తకాలు.. అన్నీ ఉచితంగా అందిస్తూ వారి తల్లులకు ఖాతాలలో డబ్బు వేస్తూ పేద విద్యార్థులకు భరోసా ఇస్తున్నారన్నారు. సమాజాన్ని అభివృధ్ది దిశగా తీసుకువెళ్తున్నారన్నారు.

2019 సాధారణ ఎన్నికలలో 50 శాతం మంది ప్రజలు ఎన్నుకుంటే నిన్న మొన్న స్థానిక ఎన్నికలలో 70 శాతం మందికి పైగా ప్రజలు, సీట్ల పరంగా మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపిటీసిలు, మండలాలు, పంచాయితీలు 80 నుంచి 90 శాతం వరకు గెలిపించి, మేమంతా నీ వెంటే జగనన్న.. అని ఓట్లేసి మరీ చెప్పారన్నారు. ఇంత నిర్విఘ్నంగా జరుగుతున్న మహాయజ్ఞాన్ని ఎలాగైనా ఆపేయాలని, అందుకోసం ఎంతకైనా తెగించాలనేలా కొన్ని దుష్టశక్తులు అడ్డగోలుగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అత్యంత పరమ కిరాతంగా, నీచంగా పనిచేస్తున్నాయో ప్రజలంతా చూస్తున్నారన్నారు.

జగన్ కి ఆదరణ పెరిగే కొద్దీ ఆ దుష్టశక్తులు చేసే కుట్రలు, దుష్ప్రచారం కూడా పెరిగిపోతోంది. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కాబట్టే వారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. కాని ఖచ్చితంగా ఈ శక్తులన్నీ ఏకమై మరో రెండున్నరేళ్లలో జరిగే ఎన్నికలలో ముందుకు వస్తాయి. ఆ రోజున ప్రజలంతా కలిసికట్టుగా ఆ దుష్టశక్తులకు మరింత గట్టిగా బుధ్ది చెప్పేలా వ్యవహరించాలి, సమాయత్తం కావాలన్నారు.  వైయస్ జగన్ కు దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని సజ్జల అన్నారు.

దేశంలోనే ఆదర్శముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు పొందిన నాయకుడు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని శాసనమండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ గారి 49 వ జన్మదినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బడుగు , బలహీన వర్గాల అభివద్ధే లక్ష్యంగా జగన్అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వారి కనీస అవసరాలు తీరుస్తున్నారు. ప్రపంచంలోనే ఆదరణ పొందుతున్న ముఖ్యమంత్రిగా పేరుపొందారు. కనీసం మరో 30, 40 సంవత్సరాలపాటు ఆయన పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, రైతులకు రైతుభరోసా కేంద్రాలు, పక్కాగృహాల నిర్మాణం, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంత పెద్దఎత్తున జరగడంలేదు. 31 లక్షల నూతన గృహాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం- ఓటిఎస్ కింద మరో 51 లక్షలమందికి లబ్ది చేకూరుస్తున్నారు. తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారు.

శాసనమండలి సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, జననేత జగన్ జన్మదినం అంటే జనులందరికీ అది పర్వదినం వంటిదని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ, ప్రజల కోసమే పుట్టిన ప్రజా నాయకుడు జగన్ అని తెలిపారు. శాసనమండలి సభ్యురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాల ఆరాధ్య నేత పుట్టినరోజు వేడుకల్లో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
శాసనమండలి సభ్యుడు పండుల రవీంద్రబాబు జగన్ కి హ్యాపీ బర్త్ డే చెబుతూ గీతాన్ని ఆలపించారు. వైయస్ జగన్ తండ్రికి తగ్గ తనయుడుగా పేరుపొంది, ప్రజలకు అంకితమైన ఏకైక లీడర్ వైయస్ జగన్ అని అన్నారు.

శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ గొప్పమానవతావాది అని అన్నారు. నేడు రాష్ర్టవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి అంతా జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. వైయస్ జగన్ ప్రజలకోసం నిరంతరం తపించే వ్యక్తి అని అన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆదరాభిమానాలు సంపాదించిన నాయకుడు అని అన్నారు. వైయస్ జగన్ గారికి ప్రజలందరూ అశీస్సులు అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చల్లామధుసూధన్ రెడ్డి, ఎస్ ఎం జియాఉధ్ధీన్, ఏపి ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతం రెడ్డి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, నవరత్నాల ఎగ్జిక్యూటివ్ కమిటి వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు ,తిరుపతి స్మార్ట్ సిటీ ఛైర్మన్నా రమల్లి పద్మజ,ఎ స్సీ కార్పోరేషన్ ఛైర్మన్ లు కనకారావు మాదిగ,అమ్మాజీ, పలు కార్పోరేషన్ ల ఛైర్మన్ లు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE