Suryaa.co.in

Telangana

2000 కిలోమీటర్ల మైలురాయి దాటిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం

-కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించిన వైఎస్ షర్మిల
-గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం అయిన ప్రజా ప్రస్థానం
-148 రోజుల్లో 2000 కిలోమీటర్ల పూర్తి చేసిన వైఎస్ షర్మిల
-ఉమ్మడి ఖమ్మం,నల్గొండ జిల్లాలను ముగించుకొని మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల
-పాలమూరు జిల్లాలో ఇప్పటికే 11 నియోజక వర్గాల్లో -పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల

తెలంగాణ‌లో వైఎస్సార్ సంక్షేమ పాల‌న తీసుకురావాల‌నే ల‌క్ష్యంతో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల చేవెళ్ల నుంచి ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలు రాయి కి చేరుకుంది. ఇందుకు గుర్తుగా కొత్తకోట నేషనల్ హైవే వద్ద విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ వైఎస్ఆర్ పైలాన్ ను వైఎస్ షర్మిల ఆవిష్కరించారు.

ఈ మహా పాదయాత్రలో వైయస్ షర్మిల అనేక పోరాటాలు చేసి, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై నిలిచారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. గజగజ వణికే చలిలోనూ, మండుటెండలోనూ, జడివానలోనూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన పాదయాత్ర కొనసాగించారు. ప్రజలకు మేలు జరిగే హామీలు ఇచ్చి, ధైర్యం కల్పించారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా…. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ముందడుగు వేస్తున్నారు.

2000 కి.మీ. ప్రజాప్రస్థానం సాగిన విధానం..
మొత్తం రోజులు: 148
జిల్లాలు: 13
నియోజకవర్గాలు: 34
మండలాలు: 104
మున్సిపాలిటీలు: 31
గ్రామాలు: 987
బహిరంగ సభలు: 34
మాట-ముచ్చట కార్యక్రమాలు: 91
నిరుద్యోగ నిరాహార దీక్షలు: 19
రైతు గోస ధర్నాలు: 26
వడ్ల కొనుగోళ్లపై ధర్నాలు: 7
చేనేత ఆత్మీయ సదస్సు: 01
పాలమూరు – నీళ్ల పోరు: 01

వైయస్ షర్మిల హామీలు:
– వైయస్ఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తాం
– ఉద్యోగ నోటిఫికేషన్లపైనే తొలి సంతకం. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి.
– ఇంట్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది అర్హులుగా ఉన్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు పెన్షన్లు.
– ఆసుపత్రుల్లో కట్టిన కరోనా బిల్లులు తిరిగి చెల్లింపు. బాధితులకు అండగా YSR తెలంగాణ పార్టీ.
– ప్రజలందరికీ ఉచిత విద్య
– పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు.
– అర్హులైన రైతులకు పోడు పట్టాల పంపిణీ చేసి
– ఆదివాసీ, గిరిజనులకు న్యాయం జరిగేలా తోడ్పాటు.
– ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణం. ఆ ఇంటి
– మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్.
– ప్రజలకు ఉచిత వైద్యం.. ఆరోగ్యశ్రీ పథకాన్ని
బలోపేతం చేసి, 108, 104 సర్వీసుల పునరుద్ధరణ.
– పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర. కౌలు రైతులు,
– రైతు కూలీల సంక్షేమానికి కృషి.
– రాయితీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ.
– ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర ల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు.
– నేతన్నలకు ఆరోగ్య బీమాతో జీవిత బీమా స‌దుపాయం.నూలు యంత్రాలకు ఉచిత కరెంట్.
– నూలు యంత్రాల కొనుగోళ్ల‌పై రాయితీ.
– పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
– చేనేత కార్మికులకు వృద్ధ్యాప్య పెన్ష‌న్ తో సంబంధం లేకుండా అదనపు పెన్ష‌న్ . చేనేతలకు
– హ్యాండ్లూమ్ క్ల‌స్ట‌ర్, హ్యాండ్యూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు
– ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న పేదల భూములు తిరిగి పేదలకు పంపిణీ.
– ఎస్టీలకు జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాటం.
– ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు నిర్ణయాధికారం. స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేలా చేసి, వారి రక్ష‌ణ‌కు పూర్తి బాధ్య‌త.
– బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు.
– అభయహస్తం డబ్బులు తిరిగి పంపిణీ.
– మ‌హిళ‌ల‌కు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు.
– జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు
– సాగునీటి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన బాధితుల‌కు ప‌రిహారం పంపిణీ
– ఉద్య‌మ‌కారులను స్వ‌రాష్ట్ర యోధులుగా గుర్తించి, వారి సంక్షేమానికి పెద్ద‌పీట.
– వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన జ‌ల‌య‌జ్ఞం ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం.
– చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌లకు 50 శాతం ప్రాతినిధ్యానికి పెద్దపీట
– ఇంట్లో అర్హులందరికీ రూ.3వేల పెన్షన్
– బెల్ట్ షాపులు ఎత్తివేస్తాం
– ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు విడిచిన ప్రతీ ఉద్యమకారుని కుటుంబానికి సొంత ఇల్లు, ఉద్యోగం. ఉద్యమకారులకు స్వతంత్ర యోధులుగా గుర్తింపు…సంక్షేమ నిధులు కేటాయింపు

LEAVE A RESPONSE