Suryaa.co.in

Andhra Pradesh

మాజీ సైనికుల భూములను కూడా వైసిపి నేతలు కబ్జా చేశారు

– యువనేతను కలిసిన అనంతపురం జిల్లా మాజీ సైనికులు
– లోకేష్ కు టోపీ బహుకరించి సంఘీభావం

• అనంతపురం జిల్లా ఎక్స్-సర్వీస్ మెన్స్ అసోసియేషన్ కు చెందిన ప్రతినిధులు యువనేత లోకేష్ కు సంఘీభావం తెలియజేసి, టోపీ బహుకరించారు.
• అనంతరం మాజీ సైనికులు తమ సమస్యలను యువనేతకు విన్నవించారు.
• ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు భద్రతాసిబ్బందిగా మాజీ సైనికులను కాకుండా పొరుగుసేవల పేరుతో అన్ స్కిల్డ్ యువతను రిక్రూట్ చేసుకొని శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి.
• ఆవిధంగా ఉద్యోగాల్లోకి తీసుకున్నవారికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదు.
• ప్రైవేటు సంస్థలు జిల్లాల్లో సైనికసంక్షేమ కార్యాలయాలను నోడల్ ఏజన్సీగా పరిగణించి సీనియారిటీ ప్రాతిపదికను సెక్యూరిటీ సిబ్బందిని తీసుకోవాలి.• మహారాష్ట్ర, తమిళనాడుల్లో మాదిరిగా జీతాలు కూడా ప్రభుత్వం ద్వారా అందేలా చూడాలి.
• టిడిపి ప్రభుత్వ హయాంలో కూడేరులో 416మంది మాజీ సైనికులకు ఇళ్లపట్టాలు ఇచ్చారు.
• అందులో 100 పూర్తయ్యాయి. మిగిలినవాటికి ఆర్థిక స్థోమతలేక ముందుకు వెళ్లలేక పోతున్నాం.
• మిగిలిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సహకారం అందించాలి.
• మాజీ సైనికులకు ప్రభుత్వోద్యోగాల్లో 2శాతం ఉన్న రిజర్వేషన్ ను 4శాతానికి పెంచాలి.
• ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా వేకెన్సీలను నోటిఫై చేయాలి.
• సైన్యంలో 15ఏళ్లకు పైగా సేవలందించిన సుశిక్షితులైన వారికి పోలీసుశాఖలో ప్రాధాన్యత కల్పించాలి.
• మాజీ సైనికులకు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి.
• ప్రతి మాజీ సైనికుడికి స్థానికంగా 5సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి.
• మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన భూమి 5సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా పట్టాభూమిగా మారేలా జిఓ విడుదలచేయాలి.
• రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైనందున యువకులు వలసలు వెళ్తున్నారు. అటువంటి వారికి రిక్రూటింగ్ ఆఫీసు ఒకటి అనంతపురంలో ఏర్పాటుచేయాలి.
• పేద యువకులకు సైన్యంలో చేరే అవకాశం కోసం ప్రభుత్వమే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుచేయాలి.
యువనేత లోకేష్ మాట్లాడుతూ….
• దేశరక్షణకు సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.
• రాష్ట్రవ్యాప్తంగా విశాఖతోపాటు పలు ప్రాంతాల్లో మాజీ సైనికుల భూములను కూడా వైసిపి నేతలు కబ్జా చేశారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బందిగా నియమించే అంశాన్ని పరిశీలిస్తాం.
• మాజీ సైనికుల ఇళ్లనిర్మాణానికి సహాయం అందజేస్తాం.

LEAVE A RESPONSE