రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
మగువల ఆర్థిక ప్రగతికి చిహ్నం వైయస్ఆర్ ఆసరా పథకం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్కూల్ ప్రాంగణాన ఆసరా పథక లబ్ధిదారులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు గొంటి వీధి,ఇప్పిలి వీధి,పెద్దరెల్లి వీధి,పుణ్యపు వీధి,రైతు బజార్,సెవెన్ రోడ్ జంక్షన్,డీసీసీబీ కాలనీ,బాకర్ సాహెబ్ పేట,సానా వీధి సచివాలయాల పరిధిలో ఉన్న లబ్ధిదారులంతా విచ్చేశారు. 1535 సంఘాలకు, అందులో ఉన్న 15397 సభ్యులకు రూ.12.08 కోట్ల మేర ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలు చెల్లింపునకు వెచ్చించాం అని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యెల్లో మీడియా ఎంతగా ప్రయత్నించినా నా ప్రతిష్టను శ్రీకాకుళం జిల్లాలో ఏ కుటుంబంలోనూ తగ్గించలేరు. నేను కొన్ని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాను. వైయస్ఆర్‌సీపీ చేసిన అధ్యయనంలో ఓ కుటుంబం గౌరవం పెరిగేందుకు కారణం స్త్రీ అని తేలింది. అందుకే మహిళల పేరున వివిధ పథకాలు అమలు చేస్తున్నాం. వారికి అండగా నిలుస్తున్నాం. కుటుంబంను నడిపే క్రమంలో పురుషులతో సమానంగా పనిచేసే స్త్రీ గౌరవం మరింత పెంచేందుకు, అదేవిధంగా మరింత సమర్థంగా ఇంటినీ ఇంకా ఇతర ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఓ మహిళ ఎంతగానో శ్రమిస్తుంది. ఆమె కారణంగానే ఆ ఇల్లు చక్కదిద్దుకుంటుంది. అందుకే మహిళల ఔన్నత్యాన్ని పెంపుదల చేసేందుకు పథకాలను ఆమె పేరిట వర్తింప జేస్తుంది ఈ ప్రభుత్వం.
ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మీకు మేలు చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. మీ వైపు ఆలోచన చేసే ప్రభుత్వానికి మీ అండాదండా ఎంతో అవసరం. గతంలో ఇంత సమర్థనీయ స్థాయిలో పథకాలు అమలు చేసిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆ రోజు మధ్యవర్తుల ప్రమేయం ఉండేది కానీ ఇవాళ ఆ తరహా పనులేవీ లేవు. అర్హత ఉంటే చాలు నేరుగా పథకాలు అందుతాయి. ఇందులో ఏ సందేహానికీ తావే లేదు అని మూడున్నరేళ్ల మా పాలన నిరూపించింది. లంచావతారులకు అవకాశం లేని విధంగా పాలన సాగించి నేరుగా పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి ఖాతాలకు చేర్చింది. ఆ విధంగా ఈ రోజు లంచాలు, కమీషన్లు ఆగిపోయాయి. అ అందుకే టీడీపి వాళ్ళు కొత్త ఎత్తు గడలతో మీ వీదుల్లో వస్తారు.జాగ్రత్త. పార్టీలు చూడం..మతం చూడం..కులం చూడం.గతంలో మాదిరిగా ఇంటి పై మా పార్టీ జెండా ఎగిరిందా లేదా అన్నది కూడా చూడం అని ఆ రోజు వైయస్ జగన్ చెప్పారు. అదే మాటకు కట్టుబడి పార్టీలకు అతీతంగానే పథకాల వర్తింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. పసుపు చొక్కా వేసుకుంటే చాలు ఆ రోజుల్లో పథకాలు వచ్చేవి.
పథకాల వర్తింపులో వారి హవా తీవ్ర స్థాయిలో నడిచేది. లంచం ఇస్తే తప్పా పథకాలు వచ్చేవి, కానీ ఇప్పుడు అలా లేదు. మీ అర్హత చూసి ఇంటికి వద్దకే పథకాలను చేరవేస్తున్నాం. మీ ఆత్మాభిమానం పెంచే ప్రభుత్వం ఇది. ఈ విషయాన్ని మీరంతా గుర్తించాలి. విపక్షాల ప్రచారం విని మోసపోకండి. గతంలో ఇదే విధంగా రైతు రుణాలకు సంబంధించి, మహిళా రుణాలకు సంబంధించి మాట ఇచ్చి మోసం చేసిన వైనం నెలకొంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు విపక్ష నేత హోదాలో 2014 ఎన్నికల సమయాన చెప్పిన మాటేదీ అమలు చేయలేదు. కానీ వైయస్ జగన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాటకు కట్టుబడి పాదయాత్రలో భాగంగా తనను కలిసిన స్వయంశక్తి సంఘాల గోడు విని, రుణాలను తిరిగి చెల్లింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగు విడతలలో డ్వాక్రా రుణాలను చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మూడు విడతల్లో రుణాల చెల్లింపునకు సంబంధించి చెల్లించేశారు. ఇంకా ఒక్క విడతే మిగిలి ఉంది. అది కూడా చెల్లించేస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు మీపైనే ఆశలు ఉన్నాయి. మీపైనే నమ్మకం ఉంది. నా అక్కచెల్లెళ్లు నన్ను మళ్లీ ఆదరిస్తారు. మళ్లీ అధికారం ఇస్తారు. అని ఆయన విశ్వాసాన్ని నిలిపేందుకు అంతా ఏకతాటిపై నిలిచి రానున్న ఎన్నికల్లో మీకు మేలు చేసిన ప్రభుత్వానికి మళ్లీ అండగా ఉండి, అధికారం దక్కేందుకు మీరు అంతా మీ మనసు చెప్పిన విధంగా మీకు చేయూతనిచ్చిన వారికి అధికారం ఇవ్వండి. ఆ విధంగా అధికారం ఇచ్చే అధికారం మీ చేతుల్లోనే ఉంది.
మీకు సాయంచేసే ప్రభుత్వాన్ని దూరం చేసుకోకండి.అలా చేసుకుంటే మీరు మళ్లీ ప్రమాదంలో పడిపోతారు. విపక్షాలనూ, సంబంధిత మీడియానూ నమ్మి మోసపోవద్దు. ఇవాళ పథకాల అమలులో భాగంగా ఆకలి,కన్నీరు, అర్హత అన్నవి మాత్రమే చూస్తున్నాం. వివిధ పథకాల అమలుతో జగన్ మీ హోదాను పెంచారు. ముంజేది కంకణానికి అద్దం ఎందుకు. ? మీ పిల్లల చదువులకు అమ్మ ఒడి, విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక లాంటి పథకాలు అందిస్తున్నారు. స్త్రీని శక్తిమంతులుగా మార్చారు. నేను గెలిచినా, గెలవకపోయినా,ఇక్కడే ఉంటాను. గెలిస్తే మీకు చాకిరీ చేస్తాను, ఓడిపోతే స్నేహితుడుగా ఉంటాను. ఇక ధరల విషయానికే వస్తే దేశమంతా ధరలు పెరిగే ఉన్నాయి. ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ మినహాయింపు ఏమీ కాదు. మీరు పక్క రాష్ట్రాలతో ధరల విషయమై పోల్చి చూడండి. ఎక్కడైనా తక్కువ ధరకు సరకులు లభిస్తున్నాయంటే మనం అక్కడికే వెళ్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విషయం కాదు. పెట్రో ఉత్పత్తుల ధరలు, వంట గ్యాస్ ధరలు కేంద్రం పరిధిలోనే ఉంటాయి. వీటి విషయమై అన్నీ తెలిసి కూడా విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ చల్లా ఒబులేషు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ మెంటాడ పద్మావతి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ చల్లా అలివేలు మంగా, బొడ్డేపల్లి పద్మజ, సుగుణ రెడ్డి, సాగి రమాదేవి, పట్టణ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠ రావు, కోణార్క్ శ్రీనివాస్ రావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, రఫీ, సుంకరి కృష్ణ, తెలుగు రమేష్, వరుదు విజయ్, వానపల్లి రమేష్, బి.గంగాధర్, జలగడుగుల శ్రీనివాస్, టి. బాలకృష్ణ, లావేటి శ్యామ్, బలగ పండరి నాథ్, తదితరులు పాల్గొన్నారు.