ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పించడంతోపాటు భరోసా ఇవ్వగలిగే పార్టీ వైయస్సార్ సిపి మాత్రమే
-ముస్లిం మైనారిటీలు వైయస్ రాజశేఖరరెడ్డి,వైయస్ జగన్ లతో ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నారు
-ముస్లిం మైనారిటీలు డాక్టర్లు,ఇంజనీర్లు,ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి 4 శాతం రిజర్వేషన్లే
-వైయస్సార్ కల్పించిన రిజర్వేషన్లు ముస్లింల కుటుంబాలలో విప్లవాత్మకమార్పులు తెచ్చాయి
-వైయస్సార్ సిపి డిఎన్ఎ లోనే ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీలున్నారు.
– సిఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ యజ్ఞం ఆగిపోవాలని ప్రతీ పక్షాలన్నీ ఏకమై కుట్రలు చేస్తున్నాయి
-వారికి ప్రజలే బుధ్ది చెబుతారు
-చంద్రబాబు లాంటి నేతల మాయమాటలు నమ్మవద్దు
-ముస్లింమైనార్టీల పేటెంట్ వైయస్సార్ కాంగ్రెస్
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సదస్సులో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి,డిప్యూటి సిఎం అంజాద్ భాషా
– సదస్సుకు పెద్ద ఎత్తున హాజరైన వైయస్సార్ సిపి ముస్లిం మైనారిటీల ప్రజాప్రతినిధులు,నేతలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ముస్లిం నేత వైయస్ జగన్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు చేస్తున్న మేలును వివరించే పనిని వెంటనే ప్రారంభించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు.ముస్లింమైనారిటీలు నివసించే ప్రాంతాలలోను,విద్యాసంస్ధలలోను,యూనివర్శిటిలలోను ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.ముస్లింలందరూ ప్రభావశీలురైన ముస్లింల వద్దకు వెళ్లి డిస్కషన్స్ ,డిబేట్సు పెట్టడం వెంటనే ప్రారంభించాలన్నారు. వైయస్సార్ సిపి ప్రభుత్వం చేస్తున్న మేలును,ప్రయోజనాలను చెప్పగలగాలన్నారు. వైయస్ జగన్ కల్పిస్తున్న బెనిఫిట్స్ గురించి కూడా విడమరచి చెప్పాలని కోరారు. తాడేపల్లిలోని శుభమస్తు కన్వెన్షన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సదస్సు పార్టీ రాష్ర్ట మైనారిటీ విభాగం అద్యక్షులు,రాష్ర్ట వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాదర్ భాషా అధ్యక్షతన గురువారం జరిగింది.సదస్సుకు పార్టీ ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఎంఎల్ఏలు,ఎంఎల్సిలు,ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు,పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు,డైరక్టర్లు హాజరయ్యారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇన్నిదశాభ్దాలలలో ఏ ప్రభుత్వం చేయనంతగా ముస్లిం మైనారిటీలకు మన ప్రభుత్వం ఇన్ని పధకాలు అమలు చేయగలిగిందని దీనిని ఆయా పధకాల తాలూకూ అంకెలే చెబుతున్నాయన్నారు. ఈ సహాయం కూడా అవసరానికి ఉపయోగపడటంతోపాటు వారి భవిష్యత్తు వారే నిర్ణయించుకునేవిధంగా వారి కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దేవని అన్నారు. వైయస్ జగన్ అమలు చేస్తున్న పధకాలన్నీ కూడా రాష్ర్ట స్వరూపాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ పధకాల వల్ల అత్యధిక శాతం లబ్దిపొందుతున్నవారిలో ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలతోపాటు పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబం ఉందన్నారు. ముస్లింమైనారిటీలకు సంబంధించి దేశంలోనే కాదు హైద్రాబాద్ లో చూసినా రోజంతా కష్టపడుతూ వారికోసమే ఒక వృత్తి అంటూ లేనిది ఎవరంటే అది ముస్లిం మైనారిటీలే. సైకిల్ షాపులు,మెకానిక్ లు కావచ్చు మిగిలిన వారందరికి ఏదో ఒక వృత్తి ఉంటుంది. ముస్లింలను ఓటు బ్యాంకుగా భావించడం వల్ల,వారలా ఉంటేనే ఓట్లు వస్తాయని గతంలోని రాజకీయపార్టీలు భావించడం వల్ల ముస్లింల జీవితాలు పెద్దగా మారలేదన్నారు.
వారిలో మహా అయితే ఐదు శాతం అభివృద్ది చెంది ఉండవచ్చు. ఏ ప్రభుత్వ సహాయంచేసినా వాటికి సంబంధించి ఎక్కువ అవసరం ముస్లింమైనార్టీలకే ఉందన్నారు. అయితే వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీల అభివృధ్ధికి అంకురార్పణ జరిగితే నేడు వైయస్ జగన్ హయాంలో దేశం మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ముస్లింమైనార్టీల సంక్షేమం అనేది టాప్ గేర్ లో ఉందన్నారు. వైయస్ జగన్ అదికారం చేపట్టిన ఈ మూడున్నర ఏళ్లలోనే ఫలితాలు కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయని అన్నారు. 4.5 లక్షల మంది అమ్మ ఒడి ద్వారా స్కూల్ కు వెళ్తున్నారు. 2.5 లక్షలమంది ఉన్నత విద్యలో ఉన్నారు. ఆరు లక్షల మందికి పైగా పెన్సన్ వస్తోంది. దాదాపు నాలుగు లక్షల మందికి ఇంటి స్ధలాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మూడున్నరేళ్లలోనే వచ్చాయి. మూడున్నరేళ్ళలోనే 21 వేల కోట్ల రూపాయలకి పైబడి ముస్లింమైనార్టీలకి అందాయి. అందులో నగదు రూపంలోనే డిబిటి ద్వారానే 10 వేల కోట్ల పైబడి మైనార్టీలకి ఇవ్వడం జరిగింది. ఇవిగాక పదివేల కోట్లకు పైగా ఇతర పధకాల కింద అందాయి.
మౌళికసదుపాయాల ద్వారా ఆస్పత్రుల అభివృధ్ది అనేది వాటికి అదనం. వాటి జోలికి తాను వెళ్లడం లేదన్నారు .ఇప్పుడు విద్యనభ్యసిస్తున్న ముస్లిం మైనారిటీ విద్యార్దులు ఎవరైతే ఉన్నారో వారు ఐదారేళ్ల తర్వాత చూస్తే ఖచ్చితంగా ఉద్యోగాలలో సెటిల్ అవడం,వ్యాపారాలు పెట్టుకోవడం,మరింత ఉన్నత విద్యలోకి వెళ్లడమో,మహిళల విషయంలో చూసినా వారి వారి వ్యాపారాలలో ఉపాధి కల్పించుకుంటారు.8 7 శాతం మంది ముస్లింమైనారిటీ కుటుంబాలు ఏదో ఒక స్కీమ్ కింద ఈ ప్రభుత్వంలో ప్రయోజనం పొందాయి.ఏ కుటుంబాన్ని టచ్ చేసినా కూడా మాకు జగనన్న ఈ లబ్ది చేకూర్చారని చెప్పే కుటుంబాలు కనిపిస్తాయి. ఎన్నికలకు ఉపయోగపడతారనో,వారి ఓట్లు ఎలా కొల్ల గొట్టాలనో భావనతో ఇవన్నీ చేయడం లేదు. వైయస్ రాజశేఖరరెడ్డిగారు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లతో ముస్లింలకు వెలుగుబాట చూపారు. ఆయన కుమారుడుగా వైయస్ జగన్ కి ముస్లిం మైనారిటీల ఆశీస్సులు అందుతున్నాయి. చంద్రబాబు ముస్లింల అభివృధ్దిలో నిర్లక్ష్యం చూపారు. రాజకీయంగా సైతం వారిని తీవ్రమైన నిర్లక్ష్య బావనతో చూశారు.
వాస్తవానికి చెప్పాలంటే ఎస్సి ఎస్టి బిసి మైనారిటీలు వైయస్సార్ సిపి డిఎన్ ఏలోనే ఉన్నారు. అది లేకుండా వైయస్సార్ సిపి లేదు. రాష్ర్టంలోని బడుగుబలహీన వర్గాలలోనే అత్యధికంగా పేదరికం అనుభవిస్తోంది ముస్లిం మైనారిటీలేనన్నారు. వారికి కోవిడ్ వంటి సంక్షోభం,చంద్రబాబు వదలి వెళ్లిన అప్పుల కుప్పల నేపధ్యంలో సైతం 21 వేల కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూర్చిన ఘనత శ్రీ వైయస్ జగన్ గారిదన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా శ్రీ వైయస్ జగన్ గారు చేపట్టిన సంక్షేమ యజ్ఞం ఆగిపోవాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. అప్పులు రాకూడదని ఫిర్యాదులు చేస్తుంటారు. అప్పుల లిమిట్స్ దాటారని రాస్తుంటారు. ఎక్కడ ఆదాయం తగ్గాలా….అప్పులు పుట్టకుండా ఎలా చేయాలా….పధకాలు అందరికి ఇస్తున్నా కూడా పలానా వారికి ఎందుకు ఇవ్వడం లేదంటూ దుష్ప్రచారం చేస్తుంటారు. లక్షలాది పేద కుటుంబాలు ప్రతి నెలా జీతం ఎలా వస్తుందో అదే విధంగా క్యాలెండర్ పెట్టుకుని మరీ ఏ నెలలో ఏ పధకం వస్తుందో తెలియచేసేలా వారికి నేరుగా అకౌంట్లలోకి మొత్తాలను వేస్తున్న ఘనత వైయస్ జగన్ గారిదన్నారు. ఇవన్నీ చేయడంతోపాటు కుటుంబం ఏ విధంగా అబివృద్ది చెందాలో వారే ఆలోచన చేసుకునే విధంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. వాటి ఫలితాలు కూడా మనకు త్వరలోే కనిపిస్తాయన్నారు. వారు బతుకులు వారే నిర్ణయించుకునే స్దితి వస్తుందన్నారు. రిజర్వేషన్లు ఉన్నా కూడా వెనకబడిన వర్గాలు అభివృధ్ది చెందడానికి దశాభ్దాలు పడుతోందన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను ప్రతి పేద ముస్లిం కుటుంబం అందిపుచ్చుకోవాలన్నారు.
ఇదే సమయంలో సామాజికంగా,రాజకీయంగా ముస్లిం మైనారిటీలకు సాధికారిత కల్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలకు సాధికారిత దిశగా అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వేలాది మంది నేతలు తయారవుతున్నారన్నారు. ప్రస్తుతం ముస్లిం మైనారిటీ సదస్సులో ఇన్ని వందలమంది నేతలు హాజరయ్యారంటనే వారిలో నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. ముస్లింలు ఎలాంటి అభధ్రత లేకుండా మనగలిగే విధంగా భరోసా ఇచ్చే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. సున్నితమైన అంశాలలో రాజకీయంగా విభేదాలు సృష్టించేందుకు కొన్నిపార్టీలు ప్రయత్నిస్తిుంటాయి. ముఖ్యంగా ఎన్నికలు ముందు అలా చేస్తుంటాయి. వాటిని తిప్పికొట్టాలంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ముస్లిం మైనారిటీలలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. రంగులు మార్చే చంద్రబాబు లాంటి వారిని వారు చెప్పే మాయమాటలను నమ్మద్దని అన్నారు. ఇంకా భ్రమలను క్రియేట్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నారన్నారు. వాటిని ముస్లింలందరూ తిప్పికొట్టాలన్నారు. ముస్లిం మైనారిటీల పేటెంట్ వైయస్సార్ సిపి అన్నారు.
డిప్యూటీ సిఎం అంజద్ భాషా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయింది…చాలా ప్రభుత్వాలు చూశాం..ముస్లిం మైనార్టీలని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన ప్రభుత్వాలని చూశామని అయితే దేశంలో ముస్లిం మైనార్టీలకి భరోసా ఇచ్చి పూర్తి న్యాయం చేసిన ఏకైకనేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ప్రతి ముస్లిం సోదరుని హృదయంలో ఆయన ఉన్నారని అన్నారు. విశ్వాసానికి మారుపేరు ముస్లిం మైనార్టీలని…ఒక్క మేలు చేసినా గుర్తు పెట్టుకుంటారని తెలియచేశారు.
ముస్లిం మైనారిటీలు డాక్టర్లు, ఇంజనీర్లుగా అవడంతోపాటు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారంటే దానికి దివంగత వైయస్సార్ ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్లతో పాటు ఫీజు రీయంబర్స్ మెంట్ పధకం అని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా సిఎం శ్రీ వైఎస్ జగన్ మైనార్టీలకి రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించారని తనకు డిప్యూటి సిఎంగా అవకాశం కల్పించారన్నారు. 75 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు.తన మేనమామ కడప స్ధానం కోరుకున్నా ఆయనను కాదని ముస్లిం మైనారిటీనైన తనకు ఇవ్వడమే కాక ఏకంగా డిప్యూటి సిఎంగా చేశారన్నారు.అదే చంద్రబాబు హిందూపూర్ లో ముస్లిం ఎంఎల్ఏ గా గని ఉన్నప్పటికి ఆ సీటును తన బావమరిది బాలకృష్ణకు ఇచ్చారన్నారు.ఈ సంఘటన చూస్తే ముస్లింలకు అండగా ఎవరుంటారేది తెలిసిపోతుందన్నారు.
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బిసిలు, నా మైనార్టీలు అని పేదలను ఓన్ చేసుకుని చెప్పే ఏకైకనాయకుడు సిఎం వైయస్ జగన్ అని అన్నారు. పార్టీ రహితంగా శాచ్యురేషన్ పై అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పధకాలని అందిస్తున్నారని వివరించారు.వైయస్సార్ సిపి ప్రభుత్వంలో ప్రతీ సంక్షేమ పధకంలో మైనార్టీలకి ప్రాదాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలోనే అత్యంత పేదరికంతో దుర్బలమైన జీవితాన్ని గడుపుతోంది ముస్లిం మైనార్టీలని ఇచ్చిన గత నివేదికలని అప్పటి ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని అన్నారు. దివంగత సిఎం వైయస్సార్ మాత్రమే ఆ నివెదికలకి న్యాయం చేస్తే…సిఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకువేసి రాజకీయంగా కూడా అవకాశాలు ఇచ్చారన్నారు.
అదే టీడిపి వైపు చూస్తే 2014 లో టిడిపి ముస్లిం మైనార్టీలకి ఇచ్చింది ఒక్క సీటు మాత్రమేనని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి మాత్రమే మీరు ఆ ఒక్క సీటు ఇచ్చింది వాస్తవం కాదాఅని ప్రశ్ని్ంచారు. ఓడిపోతారని తెలిసి ఆ సీటు ముస్లింలకు ఇచ్చారన్నారు.లోకేష్ కు పాదయాత్ర చేయాడానికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. లోకేష్..నువ్వు ఓడిపోయిన తర్వాత దొడ్డిదారిన మంత్రి అయ్యావు.అదే సమయంలో మరి మైనార్టీలకి ఎందుకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదు అని ప్రశ్నించారు. విద్యపరంగా,సామాజిక, ఆర్ధిక, రాజకీయంగా వెనుకబడిన ముస్లింమైనార్టీలకి అండగా నిలిచింది సిఎం వైఎస్ జగన్ అని మనకు పెద్ద పీట వేసిన ఘనత ఆయనదే అన్నారు.
చంద్రబాబు ఇచ్చిన రంజాన్ తోఫాతో మైనార్టీలు జీవితాలలో మార్పు వస్తుందా….చంద్రబాబుని 14 ఏళ్ల సిఎంగా చూశాం..చంద్రబాబును ముస్లిం మైనారీటిలు ఎప్పటికి నమ్మరని స్పష్టం చేశారు. వైయస్ జగన్ పై,ప్రభుత్వంపై చంద్రబాబు అబద్దపు ప్రచారాలని తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ద్వారానే ముస్లిం మైనార్టీలకి ఆత్మగౌరవం దక్కుతుందన్నారు.మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని కోరిన దమ్మున్న నాయకుడు సిఎం వైయస్ జగన్ అని తెలిపారు. త్వరలోనే లక్షమంది ముస్లిం మైనార్టీలతో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.