₹7 లక్షల కోట్లు తన అకౌంట్లో ఉన్నాయని, అవి డ్రా చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు కావాలని చెప్పి సుమారు ₹3 కోట్లు వసూలు చేసిన ఈ ‘ట్రిలియనీర్’ బాగోతాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది.
కేవలం మీడియా వార్తలు మాత్రమే కాదు, సదరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎర్రిస్వామి ఆట ముగిసింది.
తన అకౌంట్లో చిల్లి గవ్వ లేకపోయినా.. లక్షల కోట్లు ఉన్నాయని నకిలీ డాక్యుమెంట్లు చూపించి జనాన్ని బురిడీ కొట్టించినందుకు పోలీసులు మనోడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అరెస్ట్, విచారణలో ఎర్రిస్వామి సాగించిన ఈ హైటెక్ నెట్వర్క్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
“నేను డబ్బులు డ్రా చేశాక మీకు వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తాను” అని అమాయకులను, కొందరు వ్యాపారులను నమ్మించి మూడు కోట్లు గుంజేశాడు.
ఏడు పక్కన సున్నాలు చూసి ఆశపడ్డ వాళ్ళందరినీ ఇప్పుడు పోలీసులు, “ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి ఫిర్యాదు చేయండి” అని కోరుతున్నారు.
మనోడిని వెనకేసుకొచ్చిన వారికి, “వీడు మన నాయకుల బినామీ” అని నమ్మిన వారికి ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. వైకాపా అండ ఉంది కదా అని సాగించిన ఈ గ్రాఫిక్స్ రాజకీయం.. చివరకి కటకటాల వెనుక ముగిసింది.
₹7 లక్షల కోట్ల ఫోటోషాప్తో ‘అంతరాయం’ లేకుండా దోచుకొని, చివరకి అరెస్టుతో ‘మంగళం’ పాడాడన్నమాట మన ఎర్రిస్వామి.
అకౌంట్లో లక్షల కోట్లు ఉన్నాయని అబద్ధం చెప్పవచ్చు కానీ.. పోలీసుల లాఠీకి మాత్రం ఫోటోషాప్ అద్దలేం! వైకాపా నేత ఎర్రిస్వామి హైటెక్ మోసాల సినిమా.. శుభం! (కానీ బాధితులకి మాత్రం కష్టం).