విజయవాడ: అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల దాడి, నామఫలకం విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు వైయస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ అపాయింట్‌మెంట్ కోరారు.
ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్రంలో నిరాటంకంగా దాడులు, విధ్వంసాల పర్వం కొనసాగుతోందని, తాజాగా ఏకంగా విజయవాడలో అంబేడ్కర్ సామాజిక మహాశిల్పంపైనే దాడి చేసి, విధ్వంసానికి ప్రయత్నించారని, ఈ ఘటనపై పూర్తి వివరాలతో తన దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.