యర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఇంకా పాత సిలబస్‌లోనే ఉండి, హైదరాబాద్‌లో పోలీసులను దుర్భాషలాడి అభాసుపాలయ్యారు.
ఎమ్మెల్యే ప్రిపేర్ అవ్వని ‘కొత్త సిలబస్’ ఇదీ:
హైదరాబాద్ ఇప్పుడు మన ఉమ్మడి రాజధాని కాదు.
వైకాపా ఆంధ్రాలో అధికారంలో లేదు.
జగన్ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు.
మనకు రాజముద్ర వేసిన అధికారిక రాజధాని అమరావతి.
పొరుగు రాష్ట్ర రాజధానిలో ఒక మీడియా సంస్థపైకి గూండాల మాదిరిగా వెళ్లి, అక్కడ అడ్డుకున్న హైదరాబాద్ పోలీసులను బూతులు తిడితే వారు ఊరుకుంటారా? అందుకే చెంపకు పట్టి పీకి పంపించారు.
పొద్దున లేస్తే ‘సాక్షి’ చేసే విష ప్రచారానికి ఎన్ని పీకాలి? ఏబీఎన్ (ABN)లో చెప్పిన దాంట్లో తప్పేముంది? పందిని కూడా నంది అన్నా నమ్మే రకం వైకాపా కార్యకర్తలు. “పెళ్లాం కాదు చెల్లి అన్నా నమ్మి పెళ్లి సంబంధాలు చూసే నమ్మకస్తులు” అని ఆర్కే ఎద్దేవా చేశారు కదా.. దానికి దాడి చేయడానికి వెళ్లాలా? ‘నారాసుర రక్త చరిత్ర’ నుండి రోజూ రాసి అచ్చేసే రోతలకు, బూతులకు వీరిని ఏమనాలి?
కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం, న్యాయం అనే వ్యవస్థలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌లో అచ్చోసిన ఆంబోతుల్లా ప్రవర్తిస్తే అక్కడి ప్రభుత్వం ఊరుకుంటుందా? మీడియా స్వేచ్ఛను అది కాపాడదా?