-వైఎస్ మనుషుల చేతిలో 2004లో తగరకుంట ప్రభాకర్ దారుణహత్య
– ప్రభాకర్ పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసిన తెలుగుదేశం పార్టీ
– ఎన్టీఆర్ మోడల్ స్కూలులో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు
– నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన తగరకుంట ప్రభాకర్ కుమార్తె శ్రావణి
ఫ్యాక్షన్ కక్షలకు పచ్చని చెట్లను నరికిన మాదిరిగానే, వైఎస్ కుటుంబం కత్తులతో ఎన్నో జీవితాలని కడతేర్చారు. తుపాకులతో తుదముట్టించారు. వైఎస్సాసుర రక్తచరిత్రలో టిడిపి నేత తగరకుంట ప్రభాకర్ హత్య కూడా ఒకటి. 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ తన చేతికి మట్టి అంటకుండా ఎక్కడికక్కడే ప్రత్యర్థుల్ని నిర్ధాక్షిణ్యంగా చంపించేశారు.
వైఎస్ కక్షల కాటుకి తగరకుంట ప్రభాకర్ బలైపోయారు. అనాథలైన పిల్లల బాధ్యత తెలుగుదేశం తీసుకుంది. ప్రభాకర్ కుటుంబంలో ఆరుగురు పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఎన్టీఆర్ మోడల్ స్కూలులో చేర్పించారు. అందరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. వీరిలో నలుగురు సాఫ్ట్ వేర్ జాబ్స్ చేస్తున్నారు. అందరి కంటే చిన్న అమ్మాయి శ్రావణి బెంగళూరులో జాబ్ సంపాదించి, వర్క్ ఫ్రం హోం చేస్తోంది.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ని కలిసి తమ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి, విద్యాబుద్ధులు నేర్పించిన ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌కి రుణ పడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేసింది. వైఎస్ మనుషులు చేసిన దారుణానికి ప్రతీకారంగా కత్తి పట్టాల్సిన ప్రభాకర్ పిల్లలతో కలం పట్టించింది తెలుగుదేశం పార్టీ. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ అయి ఉండీ ప్రాణాలు తీస్తూ వెళ్లారు వైఎస్. తమ తండ్రుల్ని, ఇంటి పెద్దల్ని కోల్పోయిన పిల్లలు మళ్లీ ఆ ఫ్యాక్షన్ విషపు సంస్కృతి వైపు వెళ్లకుండా విద్య వైపు మరలించి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేసింది చంద్రబాబు.