– ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరురాలు!
– కాల్పుల కలకలం
– గంజాయి మాఫియా దాడి
నెల్లూరులో చోటుచేసుకున్న పెంచలయ్య హత్య కేసు, దానికి సంబంధించిన పోలీసు కాల్పుల ఘటన – ఇదంతా వైకాపా సిద్ధాంతాలకు అద్దం పడుతోంది! మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరురాలిగా ఉన్న ‘అరవ కామాక్షి’ నేతృత్వంలో జరిగిన ఈ వ్యవహారంపై ప్రత్యేక విశ్లేషణ.
నేరాలు ఆపమంటే.. నిన్నే లేపేస్తా (రఫ్ఫా రఫ్ఫా స్టైల్)!
పెంచలయ్య చేసిన ‘తప్పు’: దొంగతనాలు, గంజాయి, నేరాలను ప్రోత్సహించడం ఆపాలి అని చెప్పాడట.
వైకాపా కామాక్షి ‘సమాధానం’: “నేరాలు ఆపమంటే, నిన్నే లేపేస్తా!” అంటూ రఫ్ఫా రఫ్ఫా చేసి చూపించింది. తన గంజాయి గ్యాంగ్‌తో ఏకంగా హత్యకే స్కెచ్ వేయించి చంపేయించింది.
పోలీసుల వెల్లడి: అరవ కామాక్షిపై ‘నేరచరిత్ర’ ఉందని పోలీసులు చెబుతున్నారే తప్ప, వైకాపా పీఆర్ టీమ్ చెబుతోంది: “అది సర్వీస్ హిస్టరీ, ఆమెకు నిరంతరాయంగా నేరాలు చేయడంలో అనుభవం ఉంది!” అని. గంజాయి గ్యాంగ్ – వైకాపా యూత్ వింగ్! నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా గంజాయి మాఫియాను నడుపుతున్నదట ఈ అరవ కామాక్షి. ఇది మా స్వయం-ఉపాధి పథకం! యువతకు ఉపాధి కల్పించడంలో ఇదొక వినూత్న మార్గం అనేలా ఉంది రఫ్ఫా రఫ్ఫా వైకాపా.
తెనాలిలో చూశాం కదా.. ఏకంగా గంజాయి టీంను ఓదార్చడానికి జగనే వచ్చాడు. పెంచలయ్య హత్యకు 9 మందిని(నవరత్నాలు) పంపింది కామాక్షమ్మ. వైకాపా ఫోకస్ ఇప్పుడు గ్యాంగ్స్టరిజంపైనే పెట్టి, రఫ్ఫా రఫ్ఫా ఫ్లకార్డులు పట్టుకుని వచ్చేలా ప్రోత్సహిస్తోంది. పెంచలయ్య హత్య నిందితులను పట్టుకునే క్రమంలో రూరల్ పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఓ నిందితుడు జరిపిన దాడిలో ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరవ కామాక్షి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి అనుచరురాలిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వైకాపాలో మెంటార్షిప్/ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం!
* Step 1: దొంగతనాలు/నేరాలు నేర్చుకో.
* Step 2: గంజాయి గ్యాంగ్ నడుపు.
* Step 3: హత్యలు ఆర్గనైజ్ చెయ్యి.
* Step 4: “ఫలానా మాజీ అనుచరురాలు” అని సర్టిఫికేట్ పొందు.
నెల్లూరులో గంజాయి గ్యాంగ్‌కి వైకాపా బ్రేవ్ అవార్డ్! కామాక్షి నేరచరిత్ర = వైకాపా సక్సెస్ స్టోరీ! దొంగతనాల నుంచి హత్యల వరకు వైకాపాలో ఆల్ ఇన్ వన్ ట్రైనింగ్! ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ తో బలిసిన ఈ వైకాపా బరితెగింపు భూతాన్ని సమాజం భరించాలా? ఐదేళ్ల పాటు గల్లీ గల్లీలోనూ గుప్పుమన్న గంజా అంత సులభంగా సమసిపోదు. అలవాటైన దొంగతనాల నుండి మర్డర్ల వరకు దేనికైనా తెగిస్తారు. రఫ్ఫా రఫ్ఫా ప్లకార్డులు పట్టుకోవడం ఫ్యాషన్ లెక్కన మారిపోయింది. ఈ భూతాన్ని టెర్రరిజం లెక్కన భావించి పాతకపోతే ముందు ముందు ఇలా చాలా చాలా చూడాల్సి వస్తుంది. ఈగల్ టీమ్ బీ అవేర్.
– చాకిరేవు