– డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి శిలాఫలకం
– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కి.మీ. మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. దీనివల్ల ఈ ప్రాంత చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.