Suryaa.co.in

Telangana

ఆడపిల్లలు తలిదండ్రులకు భారం కావద్దనే కల్యాణలక్ష్మి పథకం

– డిప్యూటీ స్పీకర్ పద్మారావు

బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.15 లక్షలకు పైగా విలువ చేసే 15 కళ్యాణ లక్ష్మి, షాదిముబారాక్, CMRF చెక్కులను పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ అందచేశారు. కార్పొరేటర్ కంది శైలజ , తెరాస యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నేతలు కంది నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ చెక్కులను అందించే విధానాన్ని గత ఎనిమిది

సంవత్సరాలుగా పాటిస్తున్నామని, తద్వారా ప్రభుత్వ పధకాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

బౌద్దనగర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్, పార్సీ గుట్ట, సంజీవ పురం, వరసిగూడ, అంబర్ నగర్, బౌద్దనగర్, తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈ సందర్భంగా విస్తృతంగా పర్యటించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A RESPONSE