Suryaa.co.in

Features

ఇంకొన్నాళ్లు భద్రం బాసూ!

ప్రస్తుతం డెన్మార్క్ లో విస్తృత వ్యాప్తిలో ఉన్న ఓమిక్రాన్ బిఎ 2 వేరియంట్
రేపు మన దేశానికి కూడా విస్తరిస్తే .. భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇందుకు కారణం ఇప్పటికే మన దేశాన్ని చుట్టేసిన ఓమిక్రాన్ బిఎ 1 రకమే..అది మంచే చేసింది..దేశంలో చాలా మందికి ఓమిక్రాన్ 1 సోకడంతో జనాభాలో చాలావరకు ఇమ్యూన్ అయిపోయారు.అదే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసినంత సాయం చేసింది.ప్రస్తుతం నడుస్తున్న
వేవ్ లోని ఓమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాకపోవడం.. అది దేశంలో చాలా మందికి సోకడంతో జనాభాలో అత్యధిక శాతం మంది ఇమ్యూనిటీ సాధించి ఉన్నారు.
రేపటి రోజుల్లో ఓమిక్రాన్ బిఎ 2 వేరియంట్ గనక విస్తరిస్తే దాని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం ఉండదు.మూడో వేవులో ఓమిక్రాన్ సోకిన వారికి ఓమిక్రాన్ బిఎ 2 తో ప్రమాదం ఉండదు.
వాస్తవానికి ఈ వేరియంట్ డెన్మార్క్ లో ఈ ఏడాది ఆరంభం నుంచే వ్యాప్తిలో ఉండి ఆ దేశంలో కోవిడ్ బారిన పడిన వారిలో 84 శాతానికి పైగా జనాభాను
కమ్మేసింది..అది భారత్ కు వచ్చినా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు.కొత్త వేరియంట్ వచ్చినా రాకపోయినా..
నాలుగో వేవ్ బెడద ఉన్నా లేకపోయినా ప్రస్తుతం మన దేశంలో మొదలైన నిర్లక్ష్య ధోరణి మాని ఇంకొన్నాళ్ళు..
కనీసం ఈ ఏడాది చివరి వరకు గతంలో వలె జాగ్రత్తలు కట్టుదిట్టంగా తీసుకుంటే కొత్త వేరియంట్ బెడద నుంచే గాక
నాలుగో వేవ్ గండాన్ని కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది.

– ఇ.సురేష్ కుమార్

LEAVE A RESPONSE