– రెండు రోజుల పాటు తనిఖీ లు చేపట్టనున్న ప్రత్యేక అధికారులు
– చేపట్టాల్సిన తనిఖీల పై దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్
– మంగళవారం సాయంత్రంలోగా జిల్లా కలెక్టర్ కు తనిఖీ నివేదిక
రాష్ట్ర మంత్రి కే తారక రామారావు మార్గదర్శనం , ఆదేశాలు జిల్లా కలెక్టర్ సూచన మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను జిల్లా అధికారులైనా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివో లు, తహశీల్దార్ లు, హాస్టళ్లకు నియమించిన హాస్టల్ ప్రత్యేక అధికారులు తనిఖీ చేశారు.
మండల ప్రత్యేక అధికారులు సంబంధిత మండలంలోని గురుకులాలు, తహశీల్దార్లు సంబంధిత మండలంలోని KGBV లు, మోడల్ స్కూల్ లను తనిఖీ చేశారు. రేపు మంగళవారం కూడ తనిఖీ లు చేపట్టనున్నారు.
హాస్టల్ వంట గది, స్టోర్ రూములను, టాయిలెట్లను తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రతను పరిశీలించారు. వార్డెన్ ప్రతి రోజూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారా లేదా అని పరిశీలించారు. వంట చేసే సమయంలో ఉపయోగిస్తున్న నీటిని పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు గురుకులాలు, వసతి గృహాల నిర్వాహకులను ఆదేశించారు. రేపు ( మంగళవారం) సాయంత్రం తనిఖీ రిపోర్ట్ ను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నారు.