అమరావతి : జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్‌గా మారిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. ఫ్యాన్‌కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరమని ఆయన తెలిపారు. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాడి ఉద్యోగాలు సాధిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.
Devotional
శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు
ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్‌లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…