Suryaa.co.in

Telangana

అశ్లీల నృత్యాలు చేస్తున్న 10 మంది అమ్మాయిలు అరెస్ట్

హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని హంటర్ రెస్ట్రో బార్ అండ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహంచారు. ఎలాంటి అనుమతులు లేకుండా పబ్ నిర్వహించడంతో పాటు అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ, లిక్కర్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దాడుల్లో మెుత్తం 30 మందిని అరెస్టు చేశారు. హంటర్ రెస్ట్రో బార్ అండ్ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడంచారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఖలీల్ బాషా ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

LEAVE A RESPONSE