– నిమ్స్ రికార్డు
హైదరాబాద్: నిమ్స్‌లోని యూరాలజిస్టులు ఆరు నెలల్లో 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యాధునిక శస్త్రచికిత్స నైపుణ్యానికి పేరుగాంచిన నిమ్స్… 1989లో ప్రారంభమైనప్పటి నుండి మూత్రపిండ మార్పిడికి ప్రసిద్ధిగాంచింది. సీనియర్ ప్రొఫెసర్, హెచ్‌వోడీ డాక్టర్ సి.రామ్ రెడ్డి 2015లో ఈ విభాగానికి నాయకత్వం వహించిన తర్వాత గత దశాబ్దంలో శస్త్రచికిత్సల సంఖ్య విపరీతంగా పెరిగింది.