1917 సంవత్సరం నవంబర్ 30రోజున – తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది. డిసెంబర్ 1న చెలామణి అందుబాటులోకి తెచ్చారు.
ఆధునిక కాలంలో, మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం.
19 వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికా లోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. దాంతో, బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది.
హఠాత్తుగా రూపాయి కొనుగోలుశక్తిని కోల్పోయింది. ఈ ఘటనను “రూపాయి పతనం”గా పిలుస్తారు.
బ్రిటీషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు.
ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు.
1815 వరకు, 1957 అంతకు ముందు రూపాయకు 16 అణాలు.
రూపాయకు 8 బేడలు. రూపాయకు 4 పావలా లు. ఆణాకు 2 అర్దనాలు ,4 కానులు.
మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది.12 ఫానాలు ఒక రూపాయికి సమానం.
స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.
1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో “కొత్త”) పైసలుగా పిలిచారు.
తరువాతి కాలంలో నయా అనేది మరుగున పడిపోయింది. “డేనిష్ ఇండియన్ రూపాయి”ని 1845 లోను,
1954 లో “ఫ్రెంచి ఇండియన్ రూపాయి”ని, 1961లో “పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో”ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.
– పులగం సురేష్, జర్నలిస్టు