– మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోదిదే
– సికింద్రాబాద్ సఖి నివాస్ మహిళా వసతి గృహం ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మహేంద్ర హిల్స్ లో అయిదు కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ తో పాటు క్రీడా ప్రాంగణాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సంక్షేమం సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు..సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సఖి నివాస్ పేరుతో నిర్మించిన నూతన మహిళా వసతి గృహాన్ని, మహేంద్ర హిల్స్ లో అయిదు కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ తో పాటు క్రీడా ప్రాంగణాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి బహుమతిగా ఈ భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. 50 పడకల వసతి గృహాన్ని అన్ని రకాల వసతులతో నిర్మించామని తెలిపారు. ఆర్థికంగా వెనుక బడిన మహిళలకు ఇదో సదవకాశంగా నిలుస్తుందని, ఉపాధి కోసం వచ్చిన వారు,దేశ రక్షణ లో అమరులైన కుటుంబ సభ్యులకు అందులో స్థానం కల్పించడం శుభ పరిణామమని అన్నారు.
వసతి కల్పించడంతో పాటు భోజనం,ఆరోగ్యం,జిమ్,యోగ వంటి సదుపాయాలను కల్పిస్తున్నామ్మన్నారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని మోది దే నని,పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా దేశంలో 11 కోట్ల టాయిలెట్లు నిర్మించామన్నారు. భేటి బచావో భేటి పడావో కార్యక్రమం ద్వారా ఆడపిల్లలను విద్య లో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.