Suryaa.co.in

Telangana

బైక్‌పై 117 చలాన్లు..అవాక్కయిన పోలీసులు

హైదరాబాద్‌: ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 117 చలాన్లు ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారుడు మహ్మద్‌ ఫరీద్‌ఖాన్‌ చివరికి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా అబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఫరీద్‌ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. 117 చలాన్లకు సంబంధించి రూ.30వేలు చెల్లించకుండా ఉండటాన్ని గుర్తించారు. చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పరీద్‌ బైక్‌ను సీజ్‌ చేశారు.

LEAVE A RESPONSE