Suryaa.co.in

Andhra Pradesh

2023 స్కోచ్ అవార్డు అందుకున్న వ్యవసాయ శాఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖ ప్రత్యేక చొరవ తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తు రైతులకు పలువిధాల ప్రయోజనాన్ని కలుగచేస్తున్న ఈ క్రాప్ విధానానికి జాతీయ స్థాయిలో 2023 స్కోచ్ అవార్డ్ లభించిందని ,ఈ అవార్డును శనివారం ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో తీసుకోవటం జరిగిందని వ్యవసాయ స్పెషల్ కమిషనర్ చేకూరు హరికిరణ్ తెలిపారు.

సాంకేతికతను వినియోగించి ప్రజలకు మరింత దగ్గరగా సేవ చేస్తూ వున్న వివిధ ప్రభుత్వ విభాగాలు , సంస్థలను జాతీయ స్థాయిలో గుర్తించి ,వారికి ఈ స్కోచ్ అవార్డ్ ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారు డిజిటల్ ఆండ్రాయిడ్ సాంకేతిక ఈ క్రాప్ విధానం ద్వారా వాస్తవ సాగు రైతులను గుర్తించి పంట వివరములను నమోదు చేయటం ,జియో కోఆర్డినేట్స్ ఉపయోగించి ఖచ్చితమైన సమాచారాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు.

పంటసాగు నమోదును క్షేత్ర స్థాయిలో రైతుల భూమి,పంటసాగు వివరములను గ్రామ రెవెన్యూ మరియు గ్రామ వ్యవసాయ సహాయకుడు నమోదు చేసి ,ఆ సమాచారం సరి అయినదే అని వేలిముద్రల ద్వారా ధృవీకరించటం జరుగుతుందని తదుపరి వాస్తవ సాగు రైతు ఈ క్రాప్ లో నమోదయిన సమాచారం వాస్తవము,సరియినదే అని వేలిముద్రల ద్వారా లేదా OTP ద్వారా అంగీకరిస్తూ తన సమ్మతిని తెలుపుతూ ధృవీకరించడం అనే అంశం ఈ విధానములో అత్యంత పారదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

ఆ విధముగా నమోదు చేసిన సమాచారమును ఆమోదం కొరకు ప్రజా ప్రతినిధులు ,వ్యవసాయ మరియు సాగునీటి సలహా మండళ్లు ,రైతులు తో గ్రామసభ ను నిర్వహించటం ,సామాజిక తనిఖీ నిమిత్తం ఆ ఈ క్రాప్ ముసాయిదా డేటా సమాచారాన్ని నోటీస్ బోర్డ్ లలో బహిరంగ ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు .సామాజిక తనిఖీ నిర్ణీత సమయం లోపు వచ్చిన విజ్ఞప్తులు ,మార్పులు ,చేర్పులు ,తొలగింపులు అనే కూర్పుకు (ఎడిట్) సంబంధించి మార్పులు అయ్యిన తర్వాత ఫైనల్ జాబితాను ప్రదర్శించడం జరుగుతున్నది అని తెలిపారు.

దేశములో ఎక్కడ లేని విధముగా మన రాష్ట్రంలో నూటికి నూరు శాతం పంటల సాగు వివరములను ఈ క్రాప్ విధానములో నమోదు చేయటం వల్ల ,ఈ డేటా సమాచారం వివిధ రైతు సంక్షేమ పథకాలు అయిన Dr. వైఎస్సార్ ఉచిత పంటల భీమా పధకం ,Dr వైఎస్సార్ సున్న వడ్డీ పంట ఋణాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్ట పరిహార పెట్టుబడి రాయితీ మరియు పంట కోసిన తరవాత పంట ఉత్పత్తిని కనీస మద్దతు ధరకు వివిధ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతు సాగు సంబంధించిన డేటా సమాచారాన్ని బదలా ఇంచటానికి ,అనుసంధాన ము చేయటానికి ఈ క్రాప్ పంట సాగు డేటా సమాచారం ఒక కేంద్రీకృత సమాచార ప్లాట్ ఫామ్ (కేంద్రం) గా దోహదపడుతుందని తెలిపారు.

వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఈ క్రాప్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు, రైతులకు ప్రయోజనంగా వుండే ఈ విధానం మిగిలిన రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నది అని తెలిపారు.

LEAVE A RESPONSE