– రైల్వే బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్, డీజిల్ లోకో షెడ్ మౌలాళి ఆధ్వర్యంలో నిర్వహించిన బీపీ మండల్ 107వ జయంతి వేడుక లో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్
హైదరాబాద్: అంబేద్కర్ ఒత్తిడి మేరకు 1952లో కాకా కాలేకర్ కమీషన్ ఓబీసీలకు విద్యా, ఉద్యోగ, సంక్షేమంలో న్యాయం జరగాలంటే జాతీయ స్థాయిలో కుల గణన జరగాలి, ఓబీసీ వివరాలను చేర్చాలని రిపోర్టు అందించింది. కానీ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు కమీషన్ సిఫార్సును పార్లమెంట్లో చర్చకు రానీయకుండా బుట్ట దాఖలు చేశారు.
అప్పటి కాంగ్రెస్ ప్రధానులు, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ సిఫార్సులను పక్కన పెట్టారు. “మేము బీసీల హక్కులను కాపాడుతాం, బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం” అని రాహుల్ గాంధీ ఊరంతా తిరుగుతున్నారు.
కానీ అదే రాహుల్ గాంధీ కుటుంబం సుమారు 50 ఏళ్లుగా ముగ్గురు ప్రధానులుగా పనిచేసినా, బీసీ వర్గానికి ప్రధాని స్థానం ఇవ్వలేకపోయింది. బీజేపీ పార్టీ వలన, బీసీ వర్గం నుండి వచ్చిన నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కమీషన్ కోరల్లేని కమిషన్ గా ఉంది. బీసీ కమిషన్ కు రాజ్యాంగహోదాను యూపీఏ ప్రభుత్వం వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వం బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
గతంలో, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీసీలకు 15–16% మాత్రమే రిజర్వేషన్లు అమలు అయ్యేవి. బీసీ కమీషన్‌కు చట్టబద్దత ఇవ్వడం వల్ల, ఈరోజు కేంద్ర శాఖల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవకపోతే, బీసీ కమీషన్ చైర్మన్ హన్స్ రాజ్ కి చర్యలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి, బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగడం లేదు. కేంద్ర విద్యా సంస్థలు, సైనిక్, న్యాయ, వైద్య కళాశాలల్లో 27% రిజర్వేషన్లు అమలుతో, అనేక మంది ఓబీసీ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు 4 లక్షల ఓబీసీ విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్య పొందుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికి 27% రిజర్వేషన్లు పూర్తిగా అమలవడం లేదు. బీసీల హక్కుల పునరుద్ధరణ, రిజర్వేషన్ల పరంగా న్యాయం జరగాలని ఈ అసోసియేషన్ తరపున కోరారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే ప్రాజెక్టులను చేపట్టింది. ఉదాహరణకు, చీనాబ్ నదిపై ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది.
రైల్వే స్టేషన్లను ఏయిర్‌పోర్టుల కంటే అద్భుతంగా రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మణిపూర్‌లో తొలిసారిగా రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభం చేయబడింది.గత యూపీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 880 కోట్లు కేటాయించింది.
కానీ నేడు బీజేపీ ప్రభుత్వం 9,500 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు, 6,500 కోట్లు తెలంగాణకు కేటాయించింది. మొత్తం, నరేంద్ర మోది ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు సుమారు 17,000 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ. 750 కోట్లతో, హైదరాబాదు రైల్వే స్టేషన్‌ను రూ. 350 కోట్లతో ప్రపంచ స్థాయి స్టేషన్లుగా ఆధునీకరిస్తున్నారు.
మెదక్ ప్రజలు గెలిపించినప్పటికీ, గతంలో మెదక్‌కు రైల్వే లైన్ తీసుకురాలేదు. ఇప్పుడు మెదక్, సిద్దిపేట్లో కొత్త రైల్వే స్టేషన్లు ప్రారంభం అయ్యాయి. బీసీలు, యాదవులు, మరియు ఇతర వంచిత వర్గాల కోసం రైల్వే స్టేషన్లను తీసుకురావడంలో ఘనత మోదీ ఉంది.
ఈ కార్యక్రమానికి NCBC చైర్పర్సన్ హన్స్ రాజ్ గంగారామ్ అహిర్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు యూనియన్ నాయకులు: ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బండారి రాజు యాదవ్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మీనాక్షి , కార్యకర్తలు హాజరయ్యారు.