Suryaa.co.in

Telangana

బిజెపి సభ్యత్వాలు 35 లక్షలు

– 5 లక్షల వరకు సభ్యత్వాలు మిస్డ్ కాల్
– నవంబర్ 25వ తేదీ వరకు 45 లక్షల నుంచి 50 లక్షల సభ్యత్వాలు
– నవంబర్ 25 తేదీ తర్వాత సంస్థాగత ఎన్నికల పర్వం
భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 35 లక్షల మేరకు బిజెపి సభ్యత్వాలు నమోదు జరిగింది. మిగతా 5 లక్షల వరకు సభ్యత్వాలు మిస్డ్ కాల్ ద్వారా వచ్చాయి. నవంబర్ 25వ తేదీ వరకు 45 లక్షల నుంచి 50 లక్షల సభ్యత్వాలు స్వీకరిస్తాం. టార్గెట్ ను చేరుకుంటాం. ఆ తర్వాత కూడా మెంబర్ షిప్ స్వీకరిస్తాం.

బీజేపీ సంస్థాగత ఎన్నికల దృష్ట్యా సభ్యత్వ నమోదు స్వీకరణ వేగవంతంగా జరుగుతున్నది. సంస్థాగత ఎన్నికల కమిటీల ఏర్పాటు, నామినేషన్ల స్వీకరణ, తదితర అంశాల దృష్ట్యా యాక్టివ్ మెంబర్ షిప్ టీమ్, రిటర్నింగ్ ఆఫీసర్స్ టీమ్ ఏర్పాటు జరిగింది. రాష్ట్రంలో రిటర్నింగ్ ఆఫీసర్ గా యెండల లక్ష్మీనారాయణ ఉన్నారు. యాక్టివ్ మెంబర్ షిప్ టీమ్ లో ధర్మారావు, వీరేందర్ గౌడ్ ఉన్నారు.బీజేపీ కి చెందిన వివిధ మోర్చాల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నవంబర్ 25 తేదీ తర్వాత సంస్థాగత ఎన్నికల పర్వం మొదలవుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా, మూసీ, భూసేకరణ, రైతుల ధాన్యం కొనుగోలు వంటి విషయాల్లో వైఫల్యం చెందింది. రైతులకు రైతుబంధు ఇచ్చింది లేదు.. రూ. 500 బోనస్ ఇవ్వడం లేదు. కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. కాంగ్రెస్ పాలనలో రైస్ మిల్లర్లకు లాభం చేకూర్చేందుకు రైతులకు అన్యాయం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం.

సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి , బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బసవ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE