– పనులను పరిశీలించిన మంత్రి తలసాని
27 వ తేదీన TRS పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ పతాకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, IT శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉదయం 9.00 గంటలకు ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్ లో 40 అడుగుల TRS పార్టీ జెండా నిర్మాణ పనులను మంగళవారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TRS
పార్టీ 21 వ విర్బావ దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆవిర్బావ దినోత్సవ వేడుకల సందర్బంగా నగరంలోని పలు బస్తీలు, కాలనీ లలో పార్టీ పతాకాలను ఎగురవేసేందుకు ఆయా డివిజన్ ల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాలు గులాబి జెండాలు, తోరణాలతో గులాభిమయంగా మారాయని వివరించారు. అదేవిధంగా పార్టీ ప్లీనరీ నిర్వహించే HICC కి వెళ్ళే రహదారుల వెంట, పరిసరాలు పూర్తిగా స్వాగత తోరణాలు, కటౌట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంత్రి వెంట TRS పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సామా ప్రభాకర్ రెడ్డి, నాంపల్లి నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్, కృష్ణ గౌడ్, శైలేందర్, బాలరాజ్ యాదవ్, సునీల్, జగదీశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.