– డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అనంతపురం: రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్… పార్టీలు వేరైనా, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించాం.. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ 25 లక్షల ఆరోగ్య బీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాం. 1005 కోట్లతో పీఎం జన్ మన్ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం.
రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశాం. ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయి