– 5000 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించి, కడప కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?
– 5 వేల ఎకరాల భూమి అప్పనంగా కట్టబెట్టడం అంటే ఇది భూ యజ్ఞం కిందే లెక్క
– దీనిపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే, చర్చకు సిద్ధం
– ప్రభంజనంలా రెండు పార్టీల కలయిక
– మూడవ పార్టీ కూడా కలవడం ఖాయం
– సంక్షోభానికి దారి తీయనున్న అభివృద్ధి లేని సంక్షేమం
– టిడిపి ఉనికినే లేదంటూనే ఈ తత్తర పాటు ఎందుకు?
– టీడీపీ ఓ క్యాడర్ బెస్డ్ పార్టీ…
– విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో మన విప్లవాత్మక మార్పులేమిటో ప్రజలకు తెలుసు??
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ గురించి నిజాలు మాట్లాడి తే, సాక్షి దినపత్రికకు పొడుచుకు వచ్చిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు మండి పడ్డారు. ఈ కంపెనీ టర్నోవర్ గత మూడేళ్లుగా పెరిగింది. ఆర్డర్స్ బుక్ లో ఆర్డర్లు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు, బీహార్ లోను ఈ కంపెనీకి ఒక ఆర్డర్ ఉంది. తమిళనాడులో ప్రవేశించాలని చూస్తోంది. గత ఏడాది ఈ కంపెనీకి 80 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 80 కోట్ల లాభం అంటే, అదేమంతా పెద్దది కాదు. ఇంకా రెండేళ్ల పాటు ఇదేవిధంగా ఆదాయం వచ్చినప్పటికీ, కంపెనీ మొత్తం ఆదాయం కూడా 300 కోట్ల లోపే ఉంటుంది. శిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ప్రధాన ప్రమోటర్ గా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ కంపెనీకి రామాయపట్నం పోర్టు వద్ద నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. స్థానికంగా ఎకరం ఇరవై ఒక్క లక్షల రూపాయల రేటు పలుకుతుంది.
80 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే వారికి, 5 వేల ఎకరాల భూమి అప్పనంగా కట్టబెట్టడం అంటే ఇది భూ యజ్ఞం కిందే లెక్క. స్థానికులకు కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలము దొరకని పరిస్థితి నెలకొంటుంది. 5000 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించి, కడప కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?. ఐదు వేల ఎకరాల స్థలం కొనుగోలు చేయాలంటే 1000 కోట్ల రూపాయలు కావాలి. భూమి కొనుగోలుకు ఎవరు అప్పు ఇవ్వరు. సొంత డబ్బులతోనే భూమిని కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత ప్రమోటర్ 25% నిధులను వెచ్చిస్తే, 75 శాతం డబ్బును బ్యాంకులు రుణంగా ఇస్తాయి. స్థానికంగా ఇండోసోల్ కంపెనీ భూమిని కొనుగోలు చేస్తామంటే, ఈనాడు దినపత్రిక యాజమాన్యం కు వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ సాక్షి దినపత్రిక ప్రశ్నించడం హాస్యాస్పదం. సాక్షి దినపత్రిక కథనం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్న, రాసిన వారి కైనా తాను ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నాను. దీనిపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే, చర్చకు తాను సిద్ధం. గతంలో ఇదే ఇండోసోల్ కంపెనీ నెడ్ క్యాప్ అనే సంస్థకు 13 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు చెల్లించడానికి సమయాన్ని కోరిందని గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ, జనసేనల కలయిక ఓ ప్రభంజనం.. ఈ రెండు పార్టీలకు మూడవ పార్టీ జత కలుస్తుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ మూడు పార్టీల కలయికతో మనం అగ్ని సలభాలు లాగా మాడిపోవడం ఖాయమని అన్నారు. మన నోటి వాచాలతను, ఉత్తరకుమార ప్రగల్బాలను తగ్గించుకుంటే మంచిదన్నారు . రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభావమే లేకపోతే, సొంత పేపర్లో అంతలా అక్కసు వెళ్ళగక్కవలసిన అవసరం ఏమిటి? ప్రశ్నించారు. మనకున్న పాఠకులు జారిపోకుండా, నాలుగు అబద్ధాలను రాసుకుంటే, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. టిడిపి నాయకులు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లినా , ఆ పార్టీ బూతు స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తల బలగం కలిగి ఉందని అన్నారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు కార్డైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. టిడిపిలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు ఉంటుందని పేర్కొన్నారు. మన పార్టీలో ఎంపీలకే సభ్యత్వం లేదని ఎద్దేవా చేశారు.
దేశ రాజకీయ చరిత్రలోనే సంస్థాగతంగా బలమైన పార్టీ…టీడీపీ
దేశ రాజకీయ చరిత్రలోనే సంస్థాగతంగా బలమైన వ్యవస్థ కలిగిన పార్టీ తెలుగుదేశం అని రఘురామకృష్ణంరాజు అభివర్ణించారు. సాక్షి దినపత్రికలో వేర్ ఇస్ ది పార్టీ అని ఆంగ్ల పదాలతో ఒక వార్తా కథనం తెలుగుదేశం పార్టీ గురించి రాశారు. ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పట్టించుకోవడం లేదన్నారు. 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురిని మనమే లాగేశాం. జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకోడని అందరూ అనుకున్నారు. కానీ రాజీనామా చేస్తే, ఆ నలుగురు మళ్ళీ పోటీ చేసి గెలిచే అవకాశం లేదని భావించి… స్పీకర్ కు చెప్పి అసెంబ్లీలో వారికి ప్రత్యేక స్థానాలను కేటాయించాం. ఆ నలుగురు ఎమ్మెల్యేల పార్టీలో చేర్చుకున్నాం. మరో ఇద్దరిని పార్టీలో చేరుతారా?, చస్తారా?? అంటున్నాం. పార్టీలో చేరిన వారిని కలుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. వాళ్లు టిడిపికి దూరమయ్యారని మనమే పేర్కొనడం హాస్యాస్పదం. గతంలో మంత్రులుగా పని చేసిన వారు టిడిపికి అంటి, ముట్టనట్లు ఉంటున్నారనేది నిజం. చురుకుగా ఉండే అచ్చె నాయుడు వంటి నాయకుడిని , ఆపరేషన్ చేయించుకున్నాడని తెలిసి కూడా ఆ మూల నుంచి ఈ మూలకు వాహనంలో తిప్పి వేధించారు. మరొక మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏమి చేశారో అందరికీ తెలుసు. ఇక దేవినేని ఉమా ను రకరకాల కేసులు పెట్టి వేధించారు. 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతారని భావించి, నాలుగు మంచి మాటలు చెబితే నన్ను కూడా పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వేధించిన విషయం ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు.
జగనన్న తోడు అనే పథకం… ప్రధానమంత్రి స్వనిధిలో భాగమే
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జగనన్న తోడు అనే పథకం కొత్తదేమీ కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ ( స్వ నిధి ) పథకాన్ని కరోనాకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు. 50 లక్షల చిరు వ్యాపారాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కరోనా కాలం తర్వాత కూడా స్వనిధి పథకాన్ని పొడిగించారు. రాష్ట్రంలో 3.95 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న తోడు పథకంలో భాగంగా 16 కోట్ల రూపాయల నిధులను చిరు వ్యాపారులకు విడుదల చేయనున్నారు. అయితే ఈ పథకం ప్రచారం కోసం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం విడ్డూరం. ఈ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు లబ్ధిదారులకే ఖర్చు చేసి ఉంటే బాగుండేది. చిరు వ్యాపారుల కోసం, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం ఇది. ఈ పథకానికి తన పేరును జోడించిన జగన్, అద్వర్టైజ్మెంట్లలో ప్రధాని మోడీ ఫోటోను కూడా వేసి ఉంటే బాగుండేది. ప్రధానమంత్రి అంటే ఆరాధన భావం ఉన్న వ్యక్తిగా కోరుతున్నామని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
టిడిపి యే లేనప్పుడు ఈ తత్తర పాటు ఎందుకు?
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికియే లేనప్పుడు మనకు ఈ తత్తర పాటు ఎందుకని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. టిడిపి నిర్వహించిన సభలకు జనం రావడం లేదు, ఇరుకు రోడ్లపై ప్లాన్ చేసి సభలను నిర్వహిస్తున్నారని సాక్షి దినపత్రికలో పనికిమాలిన కథనం రాశారు. తమ సభలకు జనాలు రప్పించడానికి అవి ఇవి ఉచితంగా ఇస్తామని ఆశ పెడుతున్నారని, అయినా జనం రావడం లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. కర్నూలు, విజయనగరంలో నిర్వహించిన సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కర్నూలు, విజయనగరం కూడళ్లు ఇరుకు సందులా?. కర్నూలు, విజయనగరం కూడల్ల లో 40 వేల మంది ప్రజలు పడతారని అన్నారు . గతంలో ఒంగోలులో టిడిపి మహానాడు నిర్వహించడానికి ఒక చిన్న స్టేడియంలో అనుమతిని కోరగా, తమ ప్రభుత్వం నిరాకరించింది. ఊరు బయట నిర్వహించుకోవాలని ఆంక్షలు పెట్టింది. తొలత 25వేల మందితో మహానాడుని నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావించగా , అనూహ్యంగా ఆ మీటింగ్ కు 5 లక్షల మంది హాజరయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బేటి అనంతరం తమ పార్టీ నాయకులు ఎంతగా ఉలిక్కిపడ్డారో, అలాగే గతంలోనూ తమ పార్టీ నేతల ప్యాంట్లు తడిసిపోయాయని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
విద్యారంగాన్ని బ్రష్టు పట్టించడమే విప్లవమా?
విద్యారంగాన్ని బ్రష్టు పట్టించడమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విప్లవమా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మూడేళ్లలో 6000 స్కూళ్లను ఎత్తివేశారు , ఒక్క నూతన ఉపాధ్యాయుని నియమించలేదు. 20 నుంచి 25 రోజులపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాల కోసం వేచి చూస్తున్నారు. స్కూళ్లను ఎత్తివేయడంతో, విద్యార్థులు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఉపాధ్యాయులను పాఠ్యాంశాల బోధన కే కాకుండా, బాత్రూముల ఫోటోలను తీయించి అప్లోడ్ చేయించారు. మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి వారిచేత సారాయిని అమ్మిపించారు. అయినా విద్యా, వైద్య రంగాలలో విప్లవాన్ని తీసుకువచ్చామంటే వీన్ని ఎవరికైనా చూపించండి రా బాబు అని అంటారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
ఆసుపత్రులలో డాక్టర్ల కొరత… అయినా ఫ్యామిలీ డాక్టర్ అంటూ బిల్డప్
ఆస్పత్రులలో వైద్యుల కొరత ఉండగా, ఫామిలీ డాక్టర్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం బిల్డప్ ఇస్తోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. నూతన ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి, చేసినదానికే మూడుసార్లు శంకుస్థాపన చేశారు. మంత్రులు చిన్న జబ్బుకు కూడా హైదరాబాదుకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. అయినా పేపర్ పై ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ను రాసుకొని, అమెరికా నుంచి ఒకరికి తీసుకువచ్చి అద్భుతమని తమకు తామే కితాబును ఇచ్చుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అద్భుతమే కానీ అమలు చేయాలి కదా అంటూ రఘురామ కృష్ణంరాజు అపహస్యం చేశారు.
ఆక్వారైతులు సైతం హాలిడే ప్రకటించారు
ఆక్వా రైతులు సైతం హాలిడే ప్రకటించే దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు 13 శాతం నుంచి 29 శాతానికి అభివృద్ధి చెందిందని, ఈ మూడేళ్లలో 29 నుంచి 30 శాతానికి అభివృద్ధి చెందిందని మీరే ప్రకటించారు. ఆక్వా రంగంలో విప్లవాత్మక మార్పులు అంటే ఇదేనా?. సీడ్, ఫీడ్ తామే విక్రయిస్తామని, దానికి తోడు జే టాక్స్ , మార్కెటింగ్ ట్యాక్స్ నాలుగు శాతం పెంపు, వాటర్ 100 పెంపు వంటివి ఆక్వా రంగాన్ని సర్వనాశనం చేశాయి. ఇక రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు.