– ఎంపీ విజయసాయి రెడ్డి
డిశంబర్ 27: రిలయన్స్ సంస్థ 6500 కోట్ల భారీ పెట్టుబడి తో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుమల ప్రాంతాల్లో జియో నెట్ వర్క్ 5జీ సేవలు ప్రారంభించడం రాష్ట్రం పై ఆ సంస్థకున్న నిబద్దతను తెలియజేస్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. 5జీ సేవలు రాష్ట్ర నలుమూలలా విస్తరింప జేయాలని రిలయన్స్ సంస్థను కోరుతున్నానని, అలాగే ఇతర టెలికాం ఆపరేటర్లు ఏపీలో ప్రారంభమైన 5జీ విప్లవంలో భాగస్వాములు కావాలని కోరారు.
పరవాడ ఫార్మా సిటీ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. అస్వస్థతకు గురై న్యూఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు.