ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్ఛాపురానికి చెందిన ఏడేళ్ల పార్థివ్ శ్రీవత్సల్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో రెండు సార్లు స్థానం సాధించారు.
తండ్రి అప్పల నాయుడు గణిత టీచర్ పని చేస్తుండగా తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మూడో తరగతికే టెన్త్ స్థాయి లెక్కల్లో ప్రావీణ్యం చూపుతున్నాడు.. రెండు నిమిషాల్లో 197 జాతీయ జెండాలను గుర్తించడంతో పాటు ఈ బాలుడు ఒక నిమిషంలో క్యూబ్ చేయగలడు.