మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు మువ్వవెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పార్టీ కార్యాలయంలో జరుపుకోవం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రపంచంలోని తెలుగువారికి తెలుగుదేశం పార్టీ తరపున, చంద్రబాబునాయుడు తరపున, నా తరపున, మా యువనాయకుడు లోకేష్ బాబు తరపున శుభాకాంక్షలు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ స్వాతంత్యం రావడానికి అనేకమంది నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. వారిని, స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నవారిని గుర్తు చేసుకుందాం. దేశం పురోభివృద్ధి చెందడానికి మనమందరం భాగస్వామ్యులమవుదాం. కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ కార్యక్రమం నిర్వహించడం హర్షదాయకం. ఈ కార్యక్రమం ద్వారా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారిని, ప్రాణత్యాగం చేసినవారిని మననం చేసుకుందాం.

తెలుగుదేశం పార్టీ సమాజ హితం కోసం స్వాతంత్ర్య ఫలాలను ప్రతిఒక్కరికి అందించడానికి కృషి చేస్తోంది. స్వాతంత్ర్యం సాధించడానికి త్యాగాలు చేసినవారందరిని తెలుగుదేశం పార్టీ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పర్చూరి అశోక్ బాబు, టీడీ జనార్ధన్, బురగడ్డ వేదవ్యాస్, చప్పిడి రాజాశేఖర్, దారపనేని నరేంద్ర బాబు, కరీముల్లా, పీరయ్య, భానుతేజ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply