– జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి లతో పాటు బండి సంజయ్ లు లబ్ధి పొందిన వారే
– జిల్లా ఎడారిగా మార్చిన పాపం కాంగ్రెస్ దే
– బి అర్ యస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో ధాన్యం దిగుబడలో రికార్డు
– ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఅర్ దే
-ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఅర్ వెంటే
– 12నియోజక వర్గాల్లోనూ ఎగిరేది గులాబీ జెండానే
– మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు సృష్టించెందే కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆ సమస్యలు కాస్తా తెలంగాణాకు శాపంగా పరిణమించయన్నారు. ఆ గోస నుండి బయటపడేందుకే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఅర్ దశాబ్ద కాలంగా పడుతున్న శ్రమ ఫలాలు అనుభవిస్తున్నాంమని ఆయన పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజక పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో జరిగిన బి అర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో సహచర మంత్రి హరీష్ రావు తో కలసి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. స్ధానిక శాససభ్యులు శానంపుడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2014 కు పూర్వం కాంగ్రెస్ పార్టీ సమస్యలు సృష్టిస్తే 2014 తరువాత ముఖ్యమంత్రి కేసీఅర్ ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని ఆయన తెలిపారు.
గులాబీ నీడన ప్రయోజనం పొందిన వారిలో విపక్ష కాంగ్రెస్, బిజెపి నేతలు ఉన్నారని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి జానారెడ్డి మొదలు కొని ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, బిజెపి నేత బండి సంజయ్ లు బి అర్ యస్ ప్రభుత్వంలో లబ్దిదారులే నన్నారు.2014 కు పూర్వం పైన పేర్కొన్న నేతలు కరెంట్ లేక ఉక్క పోత భరించ లేక జెనరేటర్లను వినియోగించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. బి ఆర్ యస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఅర్ 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో వారికి డీజిల్ ఖర్చు మిగిలింది అన్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
అయితే 2014 కు పూర్వం కాంగ్రెస్ నాయకులు కేవలం నిద్రకు ఉపక్రమించెందుకు మాత్రమే జెనరేటర్లు వినియోగిస్తే మఠంపల్లి, మెళ్లచేర్వు మండాలలా రైతాంగం వేసిన పత్తి పంటను కాపాడుకోవడానికి జెనారెటర్లు వినియోగించారని ఆయన పేర్కొన్నారు. అటువంటి దుస్తితిని నుండి బయట పడేసి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ను అందించి వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రికార్డ్ సృష్టించింది అంటే అది ముఖ్యమంత్రి కేసీఅర్ మహిమ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎడారిగా మార్చిన పాపం ముప్పై ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ నేతలది కాదా అని ఆయన ప్రశ్నించారు. అటువంటి దుర్బర పాలన నుండి విముక్తి చేసినందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. అందుకే జిల్లాలోని 12 కు 12 స్థానాల్లో బి అర్ యస్ విజయ దుందుభి మోగించిందన్నారు.
ఇప్పటికీ, ఎప్పటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే పయనిస్థారని ఆయన స్పష్టం చేశారు. రేపటి ఎన్నికల్లోనూ 12 కు 12స్థానాల్లో బి అర్ యస్ విజయఢంకా మోగించ బోతుందన్నారు.