Suryaa.co.in

Andhra Pradesh

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

-చంద్రబాబుకు ఆత్మ గౌరవ సమితి బాలకోటయ్య లేఖ

రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు సభల సందర్భంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయాలని లేఖ రాశారు. ఈమేరకు శనివారం ఆయన లేఖను ఇమెయిల్ ద్వారా పంపారు. ఇటీవల ఒంగోలు లో జరిగిన దళిత గర్జన సభ లో ఒంగోలు డిక్లరేషన్ ను అన్ని రాజకీయ పార్టీల ముందు ఉంచామని తెలియ జేశారు. ఈ సందర్భంగా డిక్లరేషన్ లోని 10 అంశాలను లేఖలో వివరించారు.

ఒంగోలు డిక్లరేషన్
1.దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 రకాల సంక్షేమ పథకాలకు చట్టబద్ధ కల్పించాలి.
2.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్ళించకుండా వారి సంక్షేమానికి, వారి నివాస ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే తప్పనిసరిగా ఖర్చు చేయాలి. పెరుగుతున్న జనాభా కారణంగా ఏటా 10% నిధులు పెంచాలి. సబ్ ప్లాన్ కు కాలపరిమితి రద్ధు చేసి చట్ట బద్ధత కల్పించాలి.
3.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై హత్యలు,అత్యాచారాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. దోషులను చట్టబద్ధంగా శిక్షించాలి.ఒక్కొక్క బాదిత కుటుంబానికి రూ.కోటి పరిహారంలో ఇవ్వాలి.
4.భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు అత్యాచారాలు జరగకుండా నిర్దిష్ట కార్యాచరణ చర్యలు ప్రకటించాలి.
5.రాజ్యాంగబద్ధ పదవులు ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాలి. అవసరమైన చోట రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలి.
6.దళిత గిరిజనుల ఆత్మగౌరవ ఆర్థిక స్వలంబన కొరకు ఒక్క కుటుంబానికి ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ రుణాలు కింద 10 లక్షలు ఇవ్వాలి చిన్న పరిశ్రమంలో చేతివృత్తులకు ఉపాధి రంగాన్ని ప్రోత్సహించాలి
7.అన్ని కులాల కార్పొరేషన్లకు జనాభా నిష్పత్తి ప్రాతిపదిక నిధులు కేటాయించాలి.వారి నిధులను వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి
8.ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు కల్పించాలి.
9.1986 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. ఎట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి.
10. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఉద్యమ కారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.విశాఖ ఉక్కు, అమరావతి ఆందోళనకారులపై పెట్టిన అన్ని కేసులనుఉపసంహరించుకోవాలి అని బాలకోటయ్య వివరించారు.

LEAVE A RESPONSE