Suryaa.co.in

Editorial

సీరియళ్లూ సిగ్గుపడుతున్నాయ్‌!

( మార్తి సుబ్రహ్మణ్యం)

గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టమేమిటి?
అవినాష్‌రెడ్డి అరెస్టుకు అడ్డంకుల్లేవు కదా? మరి ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదు?
అవినాష్‌ తల్లి ఆసుపత్రిలో ఉన్నందున ఆయన విచారణకు హాజరుకావడం కుదరదన్న అవినాష్‌ న్యాయవాది
వచ్చే బుధవారం వరకూ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశం
* * *
తమ తాత ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ప్రకటన కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ మనవడు
పెద్దాయన అవినాష్ బెడ్ మీద వయో భారంతో మాట్లాడలేని స్థితిలో వున్నాడని కోర్టుకు తెలిపిన సీబీఐ.
కేసు పరిశోధన తీరుపై సోషల్‌మీడియాలో వెల్లువెత్తిన వ్యంగ్యాస్త్రాలివి! ఇది కూడా చదవండి: సీబీఐ…నత్తలూ నవ్వుతున్నాయ్!

-ఇవన్నీ చూసిన తర్వాత ‘దేశంలో వ్యవస్థలన్నీ చక్కగా సహకరిస్తున్నాయి. భారత్‌ జిందాబాద్‌’ అని సోషల్‌ మీడియాలో, ఓ ‘దేశభక్తుడు’ చేసిన వ్యాఖ్య గుర్తుకొచ్చింది.
అవినాష్‌రెడ్డి కేసు చూసి బహుశా, తెలుగు టీవీ సీరియళ్లు కూడా సిగ్గుపడవచ్చు. కార్తీకదీపం నిర్మాత ఈ కేసు నడుస్తున్న తీరు చూసి ఉంటే.. ఆ సీరియల్‌ను ఇంకో పది, పదిహేనేళ్లు లాగించేయవచ్చన్న ఐడియా వచ్చేది. బ్యాడ్‌లక్‌. ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. టీవీ సీరియళ్లు తీయాలనుకునే ఔత్సాహికులకు, వివేకా కేసు ఆదర్శంగా నిలిచిపోతుంది.

అమాయకుడైన అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడానికి, సీబీఐ చేస్తున్న కుట్రలపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. చంద్రబాబునాయుడు-ఎల్లోమీడియా అంతాకలసి, సీబీఐతో చేతులు కలిపి, పెద్ద కుట్ర చేస్తుందన్న సర్కారు సలహాదారు సజ్జల మాటే నిజం. తల్లిని చూసయినా బిడ్డను కొద్దిరోజులు వదిలేయమంటూ, పులివెందుల ముద్దుబిడ్డలంతా కర్నూలుకు తరలివెళ్లి, అక్కడ ఆసుపత్రిలో వేసిన కార్పెట్‌ ముందు ధర్నా చేసి, ప్లకార్డులు పట్టుకుని సీబీఐని వేడుకోవడం చూడముచ్చట.

తండ్రి చంచల్‌గూడ జైల్లో, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే.. బయట ఉండే ఆ బిడ్డమనసు ఎంత తల్లడిల్లుతుందో తెలుసుకున్న సీబీఐ అధికారులు వచ్చిన పని చేయకుండా వెనక్కి వెళ్లడం మానవతా వాదమే. అందుకు వారి పెద్ద మనసుకు సలాము కొట్టాల్సిందే. అందుకే ఫలానా వ్యక్తిని అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని, కర్నూలు నుంచి వెనుదిరిగిన సీబీఐ విశాల హృదయం మెచ్చదగిందే.

ఇంతకూ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ చెప్పిందా అంటే లేదు. మీ పని మీరు చేసుకోండి. మీపనికి మేం అడ్డుపడం. అరెస్టు చేయవద్దని మిమ్మల్ని ఆదేశించలేమని చక్కగా అరటిపండు వలిచినట్లు కోర్టులు చెప్పి చాలాకాలమయింది. గంగిరెడ్డిని ఫలానా రోజున స్వేచ్ఛ ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పుపై పైకోర్టు నోరెళ్లబెట్టి, తర్వాత దానిపై స్టే కూడా ఇచ్చింది. అది వేరే విషయం! సరే ఈలోగా కర్నాటక ఎన్నికలొచ్చాయి. కర్నాటక ఎన్నికల తర్వాత అవినాష్‌ వ్యవహారం చూస్తారని, అప్పటికిఅన్ని ‘ లెక్కలు తేలతాయన్న’ అంచనా పండితులే కాదు. పామరులలో కూడా ఉంది. పైగా కర్నాటక ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ఇద్దరు అగ్రనేతలు, బీజేపీ కోసం శ్రమదానం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.

అనుకున్నట్లుగానే కర్నాటక ఎన్నికల తర్వాత, సీబీఐ కేసు వేగం పెంచింది. అవినాష్‌రెడ్డి కేసులో ఆయన అన్న, ఏపీ సీఎం జగన్‌ ప్రస్తావన చేసి, అందరికీ షాక్‌ ఇచ్చింది. వివేకా హత్య విషయం జగన్‌కు, ముందే తెలుసన్నది సీబీఐ అభియోగం. ఇప్పటికే జగన్‌ ఓఎస్డీ, భారతీ పీఏలను విచారించిన సీబీఐ, ఇప్పుడు ఏకంగా తాడేపల్లినే టచ్‌ చేసిందన్నమాట. ఈ కేసులో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో, హంతకులకు శిక్ష ఎన్నేళ్లకు పడుతుందో కూడా చెప్పలేం.

అవినాష్‌ ముందస్తు బెయిల్‌ కేసు విచారిస్తున్న జడ్జిగారు, విచారణ సందర్భంగా వేసిన ఒక చక్కటి ప్రశ్న న్యాయవ్యవస్థ గౌరవం పెంచింది. ‘అది హత్య అని ఎవరికైనా అర్ధమవుతుంది. గదిలో రక్తం తుడిస్తే సాక్ష్యాలకు నష్టమేమిటి’అని వేసిన ప్రశ్న న్యాయవాద వర్గాలను సైతం మెప్పించింది. అప్రెంటీస్‌ సమయంలో తమకు ఇలాంటి ప్రశ్నలు వేయవచ్చన్న విషయం, సీనియర్లు నేర్పనందుకు బహుశా వారికి బోలెడంత కోపం వచ్చి తీరాలి.

ఎందుకంటే.. సహజంగా ఒక హత్య జరిగితే దానిపై కేసు నమోదు చేయకుండా.. పోలీసులు అక్కడ లేకుండా.. కనీసం పంచనామా పూర్తి కాకుండా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండానే.. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం వచ్చి, అక్కడ వేలిముద్రలు తీసుకోకుండానే.. అక్కడ ఆధారాలుగా ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేయడం నేరం! అని మాత్రమే లాయర్లు తమ కోర్సులో నేర్చుకుని ఉంటారు. హత్యకేసులో హంతకులు, హత్య తర్వాత నేరుగా ఒకరి ఇంటికి వచ్చినా, ఎవరైనా హంతకులకు ఆశ్రయం ఇచ్చినా అది నేరమే అని లాయర్లు పుస్తకాల్లో చదివి ఉంటారు.

‘‘దేశంలో ఏ కోర్టుకీ దర్యాప్తు సంస్థలను అడ్డుకునే అధికారం లేదు. కేసు దర్యాప్తులో ఉండగనే ఏ కోర్టు కూడా, దర్యాప్తు అధికారిని కేసులో రహస్యాలను బహిర్గతం చేయాలని అడిగే హక్కు లేదు’’ అని మాత్రమే సెక్షన్లతో సహా, లా పుస్తకాల్లో చదివిన లాయర్లకు.. తాజా విచారణలో వ్యాఖ్యలు కొత్త అనుభవమే.

Section 201 in The Indian Penal Code:
Sec.201 IPC, Causing disappearance of evidence of offence, or giving false information to screen offender.—Whoever, knowing or having reason to believe that an offence has been committed, causes any evidence of the commission of that offence to disappear, with the intention of screening the offend­er from legal punishment, or with that intention gives any infor­mation respecting the offence which he knows or believes to be false; if a capital offence.—shall, if the offence which he knows or believes to have been committed is punishable with death, be punished with imprisonment of either description for a term which may extend to seven years, and shall also be liable to fine; if punishable with imprisonment for life.—and if the offence is punishable with 1[imprisonment for life], or with imprisonment which may extend to ten years, shall be punished with imprison­ment of either description for a term which may extend to three years, and shall also be liable to fine; if punishable with less than ten years’ imprisonment.—and if the offence is punishable with imprisonment for any term not extend­ing to ten years, shall be punished with imprisonment of the description provided for the offence, for a term which may extend to one-fourth part of the longest term of the imprisonment pro­vided for the offence, or with fine, or with both. Illustration A, knowing that B has murdered Z, assists B to hide the body with the intention of screening B from punishment. A is liable to imprisonment of either description for seven years, and also to fine.

Section 212 in The Indian Penal Code:
Sec.212 IPC, Harbouring offender.—Whenever an offence has been committed, whoever harbours or conceals a person whom he knows or has reason to believe to be the offender, with the intention of screening him from legal punishment; if a capital offence.—shall, if the offence is punishable with death, be punished with imprisonment of either description for a term which may extend to five years, and shall also be liable to fine; if punishable with imprisonment for life, or with imprisonment.—and if the offence is punishable with 1[imprisonment for life], or with imprisonment which may extend to ten years, shall be punished with imprisonment of either description for a term which may extend to three years, and shall also be liable to fine; and if the offence is punishable with imprisonment which may extend to one year, and not to ten years, shall be punished with imprisonment of the description provided for the offence for a term which may extend to one-fourth part of the longest term of imprisonment provided for the offence, or with fine, or with both. 2[“Offence” in this section includes any act committed at any place out of 3[India], which, if committed in 3[India], would be punishable under any of the following sections, namely, 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459 and 460; and every such act shall, for the purposes of this section, be deemed to be punishable as if the accused person had been guilty of it in 3[India].]
(Exception) —This provision shall not extend to any case in which the harbour or concealment is by the husband or wife of the offender. Illustration A, knowing that B has committed dacoity, knowingly conceals B in order to screen him from legal punishment. Here, as B is liable to 1[imprisonment for life], A is liable to imprisonment of either description for a term not exceeding three years, and is also liable to fine.

విచారణ సమయంలో అవినాష్‌ తరఫు న్యాయవాది అడగాల్సిన ప్రశ్నలన్నీ.. గౌరవ న్యాయమూర్తి గారే సీబీఐపై సంధించడం చూస్తే, కేసును జడ్జి గారు ‘ఎంత నిశితంగా పరిశీలిస్తున్నార’న్నది అర్ధమవుతుంది. అవినాష్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారా? ఆయన తెల్లవారుఝామున ఎవరితో వాట్సాప్‌కాల్‌లో మాట్లాడారు? కేసు ఇంత నత్తనడక ఎందుకు నడుస్తోంది? సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? అన్న జడ్జిగారి ప్రశ్నలను అభినందించకుండా ఉండలేం.

సీల్డ్‌కవర్‌లో సీబీఐ ఇచ్చే కీలక సాక్షుల వాంగ్మూలాన్ని పిటిషన్‌కూ ఇస్తారా? అన్న జడ్జిగారి ప్రశ్నకు .. సాక్షుల ప్రాణాలకు ఉన్న ఆపద దృష్ట్యా, ఈ దశలో ఇవ్వలేమని సీబీఐ చెప్పింది. నిజమే. ఎవరి భయం వారిది, ఎవరి ఇరకాటం వారిది! మరి ఆ వాంగ్మూలంపై అవినాష్‌ వాదనలు వినకుండా, ఎలా పరిగణనలోకి తీసుకుంటామన్న జడ్జిగారి ప్రశ్న సీబీఐకి ఇబ్బందికరమే. ఇరువైపు వాదనలు వినాలన్న సహజ న్యాయసూత్రాలకు ఇది విరుద్ధం కాదా? అన్న జడ్జి గారి ప్రశ్నలో ఎంతో లోతైన అర్ధం ఉంది.

ఏదేమైనా వివేకా కేసు వ్యవహారంలో , బయట ప్రపంచం అంతా అనుకున్నట్లే జరుగుతోంది. బుధవారంవరకూ అరెస్టు చేయవద్దన్న జడ్జిగారి తీర్పును సవాల్‌ చేస్తూ, హతుడి కుమార్తె సునీత, మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారేమో చూడాలి. ఇన్ని సంవత్సరాలు కేసు పురోగతిని పరిశీలించిన వారికి, బుధవారం తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి పెద్ద మేధావులు, పండితులే కానవసరం లేదు.బుర్రలో కొద్దిగా గుజ్జు వాడాలంతే! ఏతావతా.. వ్యవస్థలో ఎవరి పని వారు చేసుకుంటారంతే! !

LEAVE A RESPONSE