– మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్లో అనాధ పిల్లలతో ముచ్చటించిన ముఖ్యమంత్రి దంపతులు
– విజయవాడలో సీఎం జగన్ సతీసమేత పర్యటన
విజయవాడ : జగన్ సతీసమేతంగా పాల్గొనే కార్యక్రమాలు బహు అరుదు. దేవాలయ సందర్శనలు కూడా జగన్ మాత్రమే పాల్గొంటారు. తిరుమలలో పట్టు వస్త్రాలు కూడా సీఎం ఒక్కరే సమర్పిస్తుంటారు. కానీ ఈసారి.. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని క్రైస్తవ మిషనరీ సంస్థ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను , జగన్ తన భార్య భారతితో కలసి సందర్శించడం విశేషం. ఇద్దరూ అనాధాశ్రమం తిరిగి, అక్కడి పిల్లలతో గడిపారు.