సిగరెట్ మానండి మహా ప్రభో..

సిగరెట్ తాగకు రా..
ధూమపానం మానరా..! కాళీ గా.. అని ఎన్ని సార్లు ప్రాధేయ పడి ఉంటానో లెక్క లేదు.నేను ఇంటర్ చదివే రోజుల్లో. నా ఆప్త మిత్రుడు ఎస్ కాళీ వర ప్రసాద్ ను ఆత్మీయంగా అడుక్కునే వాణ్ణి. ఇంటర్ అయ్యాక కాళీ కానిస్టేబుల్ ఆయ్యాడు. ఓ పదేళ్ళ తర్వాత, సికింద్రాబాద్ తిరుమల్ గిరి చౌరస్తా మీదుగా మా ఊరు మేడ్చల్ జిల్లా కేశవరం వెళ్తున్నాను అక్కడ, ఎడమ పక్క ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఉంది.దానికి సమీపం లో ఉన్న పాన్ డబ్బా లో మా అమ్మకు ఇష్టం అని క్రేన్ వక్క పొడి కొంటున్న. ఇంతలో వీపుపై దెబ్బ పడింది.
ఎవడ్రా.. అని వెను తిరిగి చూస్తే..

కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇంకెవరు ఇంటర్ దోస్తు దీక్షితులు.. ఏరా ఎలా ఉన్నావన్నా.. ఏముంది , రాంగ్ రూట్లో వచ్చే వాళ్లకు నేను చలానా వేస్తే.. దేవుడు నాకు చలానా వేశాడు రా అన్నాడు. అంటే…అర్థం కాలేదు రా అన్నా.

అదేరా.. నువ్వు ఊకే నస పెట్టేవాడిని కదా దమ్ము కొట్టకు రా అని, నేను వినలేదు ఇపుడు కూడా సిగరెట్ ల కోసమే వస్తె నువ్వు కలిశావన్నాడు. కానీ అపుడు నేను బాగానే ఉన్నాను ఇపుడు టికెట్ తీసుకుని “వెళ్ళడానికి” రెడీ గా ఉన్నా క్యాన్సర్ అనే వీసా, అనారోగ్యం అనే పాస్ పోర్తు తో అన్నాడు అంతే సరదాగా.

నాకు నమ్మ బుద్ది కాలేదు. ఏ నిజం కాదు కదు నువ్వు అబద్దం చేప్తున్నావు అని సందేహించా. సరే మళ్లీ కలుద్దాం ఆని చెప్పి నాకు ఇష్టం అని ఓ మీనాక్షి పాన్ కట్టించి నోట్లో పెట్టీ మరీ ఆలింగనం చేసుకున్నాడు.

ఏడుపును ఆపుకోలేక దుఃఖాన్ని దిగ మింగుకోని కేశవరం వచ్చేశా. మరో ఏడాది ఇట్టే గడచి పోయింది. ఓ రోజు మాతో పాటే ఇంటర్ బాగ్ లింగం పల్లి అంబేడ్కర్ కాలేజీ లో చదివిన స్నేహితుడు, బంధువు గద్దె వెంకట నరసింహ వద్దకు వెళ్ళా.. “మాచన” కాళి గాన్ని చూసొచ్చావా.? అన్నాడు.

వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, చికిత్స పేరిట వైద్యానికి అంత సులువుగా లొంగని క్యాన్సర్ తో పోరాటం చేసి చేసి అలసి సొలసి ఊపిరాడక పొగాకు బలి కాబోతున్న ఆప్త మిత్రుడు అంపశయ్యపై కనబడ్డాడు పొగకు చిక్కి శల్యమై.. రఘు జీతం నుంచి రిటైర్ మెంట్ కాక ముందే.. జీవితం నుంచి రన్ అవుట్ అవుతున్నా..రా.అన్నాడు. నీకేం కాదురా అన్నా వినడే.

నీతో పాటు డిగ్రీ చదివి ఉంటే నీ నస భరించ లేక సిగరెట్. మానేసే వాణ్ణి అన్నాడు.
నాదో చివరి కోరిక తీర్చరా అన్నాడు..
చెప్పరా..నా కాలేయం ఇవ్వనా అన్నా..
చచ్చే వానికి నీ కాలేయం ఎందుకు గానీ .నీకు చదువుకు సాయం చేశా అన్నవే..
అందుకు బదులుగా నా కోసం
సమాజానికి సాయ పడు.
నాకు పదె పదే చెప్పావు కదా..
సిగరెట్ మాను అని ,అదే మాట రోజూ ఒక్కరికో ముగ్గురికో చెప్పు .. చెప్తా అని మాట ఇస్తే.. చాలు తృప్తి గా “వెళ్ళి పో..తా” అన్నాడు. సరే అని చేతిలో చెయ్యి వేసి ..
మనసా వాచా కర్మణా ప్రమాణం చేస్తున్నా ఇక పై మరే మిత్రుడు స్మోకింగ్ మూలంగా తన స్నేహితున్ని కోల్పోకుండా నాకు చేత నైన మేరకు.

చెప్తూనే ఉంటా ఆని ప్రతిజ్ఞ చేశా.ఆ ఆన ను మిత్రుని ఆత్మకు ఆత్మీయంగా సమర్పించి.వచ్చేశా ఓ రెండు వారాలు నిద్ర పట్టలేదు, అన్నం తిందాం అంటే ఆకలి కాదే..వాణ్ణి తలచుకుంటే గుండె తరుక్కు పోయేది.కాలేజీ కి వెళ్తే లాక్కెళ్లి టిఫిన్ పెట్టించే వాడు.ఆకలి గా లేదురా అంటే ఇడ్లీ చట్నీ తో అమ్మ లా తినిపించే ఒకే ఒక్క మిత్రున్ని పొగాకు పొట్టన పెట్టుకుంది.ఆన్న వాస్తవం కలచి వేసింది. కుళ్ల బోడిచింది.మైత్రి అనేదే తెలియని నాకు స్నేహా మాధుర్యం ఇలా ఉంటుంది అని ,చెప్పిన నేస్తం పోయాక ఓ ఆర్నెళ్లు మతి పోయింది.ఎవరైనా సిగరెట్ , పొగ,తాగుతూ కనిపిస్తే అతనే కనిపించి , చెప్పరా అతనికి దమ్ము కొట్టొద్దు అని ప్రాధేయ పడ్డట్టు అనిపించేది.వెంటనే వెళ్ళి సార్..దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా దమ్ము కొట్టకండి ప్లీజ్ అని ప్రార్థించే వాణ్ణి.

ఈ కృషి ఇలా ఉండగా..కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళు నా సమాజ సేవా తపన గమనించి ఒపీనియన్ లీడర్ గా 2009 లో ప్రోత్సహించారు.ఈశాన్య భారతం చూసి వచ్చే అరుదైన అవకాశం దక్కింది. ఆ టూర్ నుంచి వచ్చాక సాక్షి పాత్రికేయుడు నా ఇంటర్వూ రాశాడు..
ధూమపాణం , గుట్కా నిషేధం అతని లక్ష్యం అని. ఆ వార్త కథనం .పొగాకు పై పోరు ప్రస్థానం మరింత బాట వేసింది.

నేను ఎక్కడ కనిపించినా అడిగే వాళ్ళు… బాబూ ఎన్నో జీవితాల్లో వెలుగు నిoపుతున్నావు.నువ్వు కారణ జన్ముడివి అని ఆశీర్వదించే వాళ్ళు. జర్నలిస్టు మరోకరు 2018 లో ఓ ప్రత్యేక వార్త రాశారు నో..స్మోకింగ్ ప్లీజ్ అని ఓ వ్యక్తి ఒకే ఒక్కడిగా పరిమాణం కన్నా పరిణామం మిన్నగా ఓ వ్యక్తి అటు ఉద్యోగం చేస్తూనే ఉద్యమ స్ఫూర్తితో పొగాకు నియంత్రణ కు పాటు పడుతున్నాడు అని.

ఆ వార్త చదివిన నా డిగ్రీ స్నేహితుడు బీ వీ ప్రవీణ్ కుమార్ నాకు ఫోన్ చేశాడు. రఘు నేను నిన్ను కలవాలి అని అడిగాడు.అతను నేను గవర్నమెంట్ సిటీ కాలేజీ లో బీ ఎస్సీ బీ జడ్ సీ చదివాం. అప్పట్లోనే అతనికి గుట్కా అలవాటు ఉండేది .అందుకే గుట్కా ప్రవీణ్ ఆని పిలిచే వాళ్ళం. మంచిర్యాల జిల్లా లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనచేస్తున్నాడు.

ఏంది సంగతి అంతా బాగేనా అన్నా.. లేదురా పాణం బాగాలేదు. అన్నాడు.వెంటనే హైదరాబాద్ తీసుకు వచ్చి నేనే దగ్గర ఉండి వైద్యం చేయించా. నా డబ్బు తోనే దీర్ఘ కాలిక చికిత్స కోసం న్యూ లైఫ్ హోమియో క్లినిక్ లో డాక్టర్ గద్దె సుభాష్ చందర్ వద్ద ఓ ఆర్నెళ్ల కు సరిపడా మందులు ఇచ్చి పంపా. థాంక్స్ చెప్తుంటే వద్గురా నీ కల్మొక్త గానీ ఈ గుట్కా అలవాటు మానురా అని బ్రతిమాలా .. సరే అన్నాడు. కానీ ఓ ఆర్నెల్ల తర్వాత అతని భార్య సామాజిక మాధ్యమాల్లో ప్రవీణ్ ఇక లేరు అని పోస్ట్ చేసింది.

ఆమెను పలకరిస్త్తే.. ఏమ్ చెయ్యాలి అన్నయ్యా..మీరు మందులు ఇప్పించిర్రు.కానీ రోజూ పది గుట్కాలు తిన్నాడు. పోయే నాడు కడుపులో ఎట్లనో ఉంది అన్నాడట.స్థానిక వైద్యుని వద్దకు వెళ్తే ..లాభం లేదు హైదరాబాద్ తీసుకు వెళ్ళండి అని చెప్తే..తీసుకు వస్తుంటే మధ్యలో నే పోయాడట. పొగాకు నా కుటుంబం పై కూడా పగ బట్టింది అన్నా అని ఏడ్వవట్టింది. ఎడవకమ్మ అని ఊరడించి పిల్లలు యుక్త వయసు లో పిల్లలు.కూడా సిగరెట్ కో గుట్కా కో అలవాటయ్యేరు జాగ్రత్త రా అని చెప్తూనే ఉన్నా.

నా పెళ్లి అయ్యేటపుడు కూడా మధ్య వర్తి గా ఉన్న మా మామ అంబటి లక్ష్మీ నారాయణ ఓ స్లో గన్ తో నన్ను ప్రమోట్ చేసే వారు. అబ్బాయికి ఏ అలవాట్లు లేవు.వాడికి మీ పిల్ల నచ్చడమే గొప్ప అని చెప్పే పెళ్లి కుదిర్చాడు. ఏంది.. ఏ అలవాట్లు లేవు అనేది అది నీ క్వాలి ఫికేషన్ లా.. ఉందే అంటే అవును..నేను ఇంతే అని చెప్పా. వెడ్టింగ్ కార్డు లో కూడా మాచన సూచన అని ఓ.మాట ను అచ్చు వేయించా. నా పెళ్లికి వచ్చే వాళ్లకు పొగాకు ధూమపానం అలవాటు ఉంటే రావద్దు అని.

అదేంటి అని నాకు కాబోయే శ్రీ మతి అడిగింది.
మతి ఉన్నొడు దమ్ము కొట్టడు.
ధూమపానం కు ప్రాణం బలి పెట్టడు.
అమ్మా నాన్న ,లకు పుత్ర శోకం పెట్టడు అన్నా. నా అభిప్రాయం తప్పు అని భావిస్తే ..వీడు నాకు కరెక్ట్ కాదు అనుకుంటే .. నా బదులు వెరోకర్ని పెళ్లి చేసుకో అని చెప్పా.. జనం కోసం నువ్వు ఆలోచించడమే నాకు బాగా నచ్చింది అని మూడు ముళ్లు వేయించుకుంది.

మీ ఆయన ఏమ్..చేస్తారమ్మ అని వారి తరపు చుట్టాలు అడిగితే ..పొగాకు పై పోరాటం చేస్తాడు అని గర్వంగా చెప్పింది. అమెరికా కు చెందిన పల్మనరీ మెడిసీన్ అనే వైద్య విజ్ఞాన పత్రిక ఓ వ్యక్తి ఇరవై ఏళ్ల పొగాకు నియంత్రణ కృషి అమోఘం అని పేర్కొంటూ.. ప్రథమం గా నాకు అవకాశం ఇచ్చి , ఎ ఇండియన్ ఆన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టుబాకో కoట్రోల్ మిషన్ అంటూ పేర్కొంది.అలాగే “వెల్ డన్..రఘునందన్ అంటూ అభినందించింది.దీంతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వారికి చండీగఢ్ కేంద్రంగా పని చేసే రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ వారు రాష్ట్ర స్థాయి పొగాకు నియంత్రణ సదస్సు కు ప్రత్యేక
అహ్వా నితుడిగా సిఫారసు చేశారు. తిరుపతి లో ఉన్న ఓ స్నేహితుడు రఘు..సిగరెట్టు మానేసే ఉపాయం ఉంటే చెప్పరా..అని అడిగితే..

నువ్వు మంచి ఆట గాడివి కదా.. మధ్యలో నే ఓదిపోతే ఎంతగా భాధ పడతావో గెలవ లేక ‘” పొయానే” అని మరి..నీకు జన్మ నిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసి గొప్ప వాడివి అవుతావు అని అనుకుంటే అఫ్ట్రాల్ సిగరెట్ కు బానిసై కన్న వాళ్ళకు పుత్ర శోకం కలిగించే వాడిగా మిగలకు అని చెప్పా. “నీలా ఇంతవరకు ఎవరూ చెప్పలేదు రా.

ఈ రోజే సిగరెట్ మానేస్తా” అని చెప్పాడు. మాచన నీ సూచన కు ఓ కానుక ఇస్తా అంటే..
నువ్వు పోగాకు. మానెయ్యడమే నీ జీవితానికి, నీ జీవితం బాగుండాలి అనుకునే నాకు కూడా కానుకే రా మిత్రమా అని చెప్పా..
రియల్లీ నువ్వు సమాజానికి ఓ గాడ్ గిఫ్ట్ రా..అన్నాడు.
ప్రతీ వ్యక్తి కి మనిషి జీవితమే గాడ్ గిఫ్ట్.. దాన్నీ తృణ ప్రాయ మైన ధూమపానం , పొగాకు అలవాట్ల కు బలి చెయ్యడం భావ్యం కాదు అని స్నేహితుడిగా హితవు చెప్పా.

మాచన రఘునందన్
అంతర్జాతీయ “పొగాకు నియంత్రణ” అవార్డు గ్రహీత
ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్
పౌర సరఫరాల శాఖ.
9441252121

Leave a Reply