Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రలో ఈ ఏడాదే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యం
చంద్రబాబు దోచుకో, పంచుకో, తినుకో విధానంతో ఏపీ అభివృద్ధికి తూట్లు
మంత్రి విడదల రజిని

రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, నంద్యాల ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని,వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన వైద్య కళాశాలల్లో ఈ ఐదు కాలేజీలకు ఎస్ఎంసీ నుంచి అనుమతి వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్లే కాకుండా, 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తీసుకువచినట్లు వివరించారు. రాష్ట్రంలో వందేళ్ల క్రితం 1923లో విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైందని. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.

మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనేదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఏస్సార్ సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వమూ భర్తీ చేయలేదని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.

చంద్రబాబు హయంలో దోచుకో, పంచుకో, తినుకో పాలన జరిగింది
టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో దోచుకో, పంచుకో, తినుకో పాలనా విధానం జరిగిందని మంత్రి రజని ఆరోపించారు. చంద్రబాబు హయంలో రాష్ట్రానికి ఒక్క ప్రభుత్వం మెడికాల్ కాలేజీ కూడా రాలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో సెల్ ఫోన్ వెలుతురులో డాక్టర్లు ఆపరేషన్లు చేసిన రోజులు ఉన్నాయని గుర్తుచేశారు.

LEAVE A RESPONSE