ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 261 మంది మృతి చెందగా మరో 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. బోగీల్లో అనేక మంది చిక్కుకుని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఒక గూడ్స్ రైలు రాత్రి 7 గంటల సమయంలో ఢీకొన్న విషయం తెలిసిందే. తొలుత బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పడంతో పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఎదురుగా వస్తున్న షాలీమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టింది. ఆ తరువాత మరో గూడ్స్ రైలు కూడా వీటిని ఢీకొట్టింది. ఇలా మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కాగా, ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికార ప్రతినిధి మరో వివరణ ఇచ్చారు. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో పలు బోగీలు ఒకదానిపై మరొకటి పడ్డాయి. కొన్ని నుజ్జునుజ్జయ్యాయి. బోగీల్లో మరో 600-700 మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలు బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
#WATCH | Latest aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/kTFOLuKDrd
— ANI (@ANI) June 3, 2023