Suryaa.co.in

Andhra Pradesh

తేదేపాది మాయాఫెస్టో, మోసఫెస్టో

ఎంపీ విజయసాయి రెడ్డి

జూన్ 2: తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల కోసం ముందుగా ప్రకటించినది మేనిఫెస్టో కాదని అది మోసఫెస్టో, మాయాఫెస్టో అని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు! డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీలే ఎగ్గొట్టి, కాల్ మనీ గ్యాంగ్స్ తో వేధించిన వాళ్ళు, 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ 15 వందల ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

వైద్య విద్యలో నూతన అధ్యాయం
రాష్ట్ర వైద్య విద్యా రంగంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని,ఈ ఏడాది ఏకంగా 5 ప్రభుత్వ  మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం, ఏలూరు,  నంద్యాల, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీలకు ఎంసీఐ అనుమతి లభించిందని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభంతో రాష్ట్రంలో ఒకే సారి 750 మెడికల్ సీట్లు పెరగనున్నట్లు తెలిపారు. అలాగే  రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్దికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 16 వేల కోట్లు పైగా ఖర్చు చేసిందని విజయసాయి రెడ్డి తెలిపారు.

వైఎస్సార్ యంత్రసేవా పథకంతో రైతులకు మరింత ప్రోత్సాహం
వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ. 361.29 కోట్లు విలువ గల 2562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు అందించడంతో రైతులకు మరింత ప్రోత్సాహం లభించిందని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరులో జెండా ఊపి ప్రారంభించారని అన్నారు. అలాగే రూ.125.48 కోట్లు సబ్సీడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE