Suryaa.co.in

Andhra Pradesh

కొండేపి ఎమ్మెల్యే స్వామిపై దాడి, అరెస్టు ..జగన్ రెడ్డి పతనానికి నాంది

– రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి
– దళిత ఎమ్మెల్యేపై దాడిచేయించిన సైకోరెడ్డికి బుద్ది చెప్పడానికి దళితులు సిద్దంగా ఉన్నారు
– ముఖ్యమంత్రి బేషరతుగా దళితజాతికి క్షమాపణ చెప్పాలి
– టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు

సైకో రెడ్డి దళిత నాయకత్వాన్ని అణచివేయాలనే కుట్ర చేస్తున్నాడు. అందులో భాగంగానే కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై వైసీపీ గూండాలతో దాడి చేయించాడు. జగన్ రెడ్డిలోని సైకోయిజం రోజు రోజుకు ఎవరెస్టులా పతాకస్థాయికి చేరుకుంటోంది. దళితులతో పెట్టుకున్న ఏ నాయకుడు చరిత్రలో బాగుపడినట్లు లేదు. దళితులతో ఆటలాడుతున్న జగన్ రెడ్డికి కూడా తొందరలో పతనం తప్పదు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆయనను ఏ విధంగా అరెస్టు చేస్తారు?

టాయిలెట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన వైసీపీ నాయకులు నాలుగేళ్లు గడ్డిపీకారా? టాయిలెట్ల నిర్మాణం ఎటువంటి అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత రాజకీయం చేయడానికి దళిత ఎమ్మెల్యేకు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తారా? మీలా కరోన సమయంలో బ్లీచింగ్ పేరుతో ముగ్గుపిండి చల్లి దోచుకున్న చరిత్ర బాలవీరాంజనేయ స్వామిది కాదు. అవినీతి, అక్రమాలకు పేటెంట్ హక్కుదారులు వైసీపీ నాయకులే.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. డా. అంబేడ్కర్ రాజ్యాంగంలో పౌరులకు ప్రసాదించిన ప్రాధమిక హక్కులు ఏపీలో దళితులకు నిరాకరించబడుతున్నాయి. దళితులను సాధారణ పౌరులుగా కూడా చూడటం లేదు. దళిత ఎమ్మెల్యే పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి సామాన్య దళితుల పరిస్థితి ఏంటి? దళిత ఎమ్మెల్యేపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి బేషరతుగా దళితజాతికి క్షమాపణ చెప్పాలి. దళితులపై నిత్యం దాడులు చేయిస్తున్న జగన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి దళితులు సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE