Suryaa.co.in

Telangana

తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి

– సిద్దిపేట లో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా..వచ్చేదా?
– సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్

సిద్దిపేట ను చూసి అసూయపడేలా మంత్రి హరీష్ రావు అభివృద్ధి చేస్తున్నారు.తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి.ఓ వైపు పంచాయతీ అవార్డులు..మరోవైపు పట్టణ ప్రగతి అవార్డులు జాతీయ స్థాయిలో మనకు వస్తున్నాయి.చాలా మంది సిద్దిపేట మీద ప్రత్యేక ప్రేమ ఎందుకు అని అడుగుతున్నారు.

ఉద్యమ నాయకుణ్ణి అందించిన జిల్లా సిద్ధిపేట గడ్డ.సిద్దిపేట లో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేదా..వచ్చేదా?నేను సిరిసిల్ల కి వెళ్ళేటప్పుడు సిద్దిపేట కి వచ్చినప్పుడు మా బావకి ఫోన్ చేసి మళ్ళీ కొత్తది ఏం కట్టినవ్ అని చెబుతా.అలా సిద్దిపేట ని అభివృద్ధి చేస్తున్నాడు హరీశ్ రావు.స్వచబడి సిద్దిపేట స్పూర్తితో ప్రతి జిల్లాలో స్వచబడి ఏర్పాటు చేస్తాం.

1980 లో సిద్దిపేట అభివృద్ధి మొదలైంది.దళిత బంధు కొత్త పథకం అని అంటున్నారు…సిద్దిపేట లో ఆనాడే దళిత చైతన్య జ్యోతి అని కేసీఆర్ పెట్టారు.మిషన్ భగీరథకు పునాది పడ్డది కూడా సిద్దిపేటలోనే.మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ జల్ అని కాపీ కొట్టింది.హరీష్ రావు నాకు బావ కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తా.

ప్రతి నియోజకవర్గం సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తాం.సిద్దిపేట ని ఆదర్శంగా తీసుకుని మేమందరం పని చేస్తాం.ఈ సారి హరీష్ రావుని లక్ష 50 వేల మెజార్టీ తో గెలిపించాలి.

ఐటీ హబ్ ని ఇంకా విస్తరిస్తాం.టాస్క్ తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాం.టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతుంది.2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు.ఈ 9 ఎల్లల్లో ఐటీ ఎగుమతులు రెండు లక్షల 41 వేల కోట్లు.ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు.

మన తెలంగాణ లో 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.తెలంగాణలో యువత ఎక్కువగా ఉంది..వారికి ప్రయివేట్ ఉద్యోగం సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. KCR కి హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి.

 

LEAVE A RESPONSE