– సీఎం కేసీఆర్ ఆదేశాలు
హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని.. వెంటనే వారిపై నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు.