-కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాల
-జాతీయ రహదారులు దేశ ఆర్థిక గమనాన్ని మర్చుతున్నాయి: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప
-జహీరాబాద్ లో జన్ సంపర్క్ అభియాన్ లో పాల్గొన్న బిజెపి నేతలు
భారత దేశపు సరిహద్దు గ్రామాల్లో కూడా అభివృద్ధి ఫలాలు అందేలా మోడీ చూశారని కేంద్ర పాడి, పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి పర్షోత్తం రూపాల అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల సేవా, సురక్ష, సుపరిపాలన సందర్భంగా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా కేంద్ర మంత్రి వర్యులు పర్షోత్తం రూపాల గారు జహీరాబాద్ పర్యటించారు. కార్యక్రమం లో భాగంగా రైల్వే స్టేషన్ ను సందర్శించారు. కార్యక్రమం లో ప్రముఖ సామాజికవేత్త అల్లాడి వీరేశం ఇంట్లో కేంద్ర మంత్రి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
ఈ పర్యటనలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప పాల్గొని మాట్లాడారు. మోడీ గారి హయాం లో దేశం లో మౌళిక వసతులపై భారీగా నిధులు వెచ్చించారు అని సంగప్ప చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 1.10 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ 102 వ బూత్ లో మన్ కీ బాత్ ను BJYM జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నరేష్ ఇంట్లో వీక్షించారు.