Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో పెరిగిన పేదరికం

సెంటు పట్టా పేరుతో దళితుల నుండి 12 వేల ఎకరాల భూమిని దోచుకున్నాడు
పేదరిక నిర్మూలనకే టిడిపి మినీ మేనిఫెస్టో

వైసీపీ నాలుగేళ్ల పాలనలో పేదలు నిరు పేదలుగా మారిపోయారని టీడీపీ నేతలన్నారు. పేదలను ధనికుల్ని చేయాలన్నదే చంద్రబాబు నాయడు లక్ష్యమని, టీడీపీ మినిమ్యానిఫెస్టోతో ప్రజల జీవితాల్లో మార్పులు ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రజా చైతన్య బస్సు యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలకు వివరించారు. బుధవారం నాడు టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి

జోన్:-1 పరిధిలో:
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్ర లో భాగంగా గురువారం దక్షిణ నియోజకవర్గం జ్ఞానపురం ఎర్ని మాంబ ఆలయం వద్దనుండి ప్రారంభమైంది. బీచ్ రోడ్డు జాలారిపేట వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర మత్స్యకారుల యొక్క సమస్యలను తెలుసుకున్నారు.
శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు ప్రారంభించిన భవిష్యత్తుకి గ్యారెంటీ బస్సు యాత్ర లో భాగంగా గురువారం

దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జి నేతృత్వంలో
జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి యాత్ర ప్రారంభించారు ఆలయం వద్ద నుండి వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సెంట్ పీటర్ ఎయిడెడ్ పాఠశాల వద్దకు వెళ్లి స్వీయ చిత్రం తీసుకున్నారు అక్కడి నుండి చెత్త పేరుకుపోయిన ఎర్రి గెడ్డ వద్దకి వెళ్లి స్వీయ చిత్రం తీసుకొవటం జరిగింది అక్కడి నుండి బయలుదేరి పూర్ణ మార్కెట్ చేరుకొని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని జగదాంబ కూడలి మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సంక్షేమం కుంటుపడిందని రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్ గ్యారంటీ బస్సు అతన్ని చంద్రబాబునాయుడు ప్రారంభించారని చెప్పారు.

బస్సు యాత్రలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తి జిల్లా కొండ్రు మురళీ మోహన్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు వేపాడ చిరంజీవి రావు, శాసనసభ మాజీ సభ్యురాలు కోళ్ల లలిత కుమారి ఇన్చార్జిలు పి వి జి కుమార్, కోరాడ రాజబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ రాష్ట్ర నాయకులు ఎంవీ వి ప్రసాదు, విఎస్ఎన్ మూర్తి యాదవ్ కార్పొరేటర్ గొల్లగాని వీరారావు బుజ్జి, గోడి నరసింహ చారి కేదారి లక్ష్మి రాజమండ్రి నారాయణ గాడు అప్పలనాయుడు చిక్కాల విజయబాబు గండి రవికుమార్ విల్లూరి చక్రవర్తి,పి వి రమణరావు వలిశెట్టి తాతాజీ ఉరుకూటి డెవిడ్ నక్క లక్ష్మణ్ రావు గనగళ్ల సత్య,పుక్కల రాజేశ్వరి పంపని రాజ్యలక్ష్మి మజ్జి త్రినాధరావు ఇరోతి చినకుమార్ పొడుగు కుమార్ అనసూరి మధు పెద్దపన కార్యకర్తల అభిమానులు మహిళలు పాల్గొన్నారు.

జోన్ :-2 పరిధిలో
చైతన్య రథయాత్ర సభలో శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ…. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయిందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని నిలువునా దోచేశారని ఆరోపించారు. వైసీపీ చేతగాని పాలన మూలంగా ధనికులు మరింత ధనికులవుతుంటే, పేదలు నిరుపేదలుగా మారిపోయారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టో ప్రచారంలో భాగంగా చైతన్య రథయాత్ర రాజమహేంద్రవరం నగరంలో గురువారం నాడు నిర్వహించారు.

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో పుష్కరాల రేవులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేవీచౌక్, గణేష్ చౌక్, వై. జంక్షన్, స్వతంత్ర హాస్పిటల్స్ మీదుగా మూలగొయ్యి ఎన్టీఆర్ కాలనీ వరకూ చైతన్యరథ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో

ముఖ్య అతిధిగా పాల్గొన్న యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం నాడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారని, నేడు తెలుగువారి భవిష్యత్ తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు శ్రమిస్తున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఆర్ధిక మంత్రి బుగ్గన చెబుతున్నారని, ఆదాయం పెరిగితే అప్పులెందుకు చేస్తున్నారని యనమల ప్రశ్నించారు. జగన్ సర్కారు గద్దె దిగువగా మన రాష్ట్రానికి 12.5 లక్షల కోట్ల అప్పులుంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ వర్గాలకు ఇచ్చే పెన్షన్లలో కోతలతో ఒక్కొక్కరికి రూ.18 వేలు నష్టం వాటిల్లిందన్నారు. పేదరిక నిర్మూలన కోసమే టిడిపి సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో ప్రకటించిందన్నారు. సమాజంలో ప్రధాన వర్గాలైన యువత, మహిళలు, రైతుల ఆర్థిక ప్రగతి కోసం ఈ మినీ మేనిఫెస్టోలో పెద్దపీట వేశామని తెలిపారు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు, కంపెనీలు రాక, ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల యువత నిరుద్యోగంతో అల్లాడిపోతోందని అన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస పోవాల్సిన దుస్థితిని మన రాష్ట్ర యువత ఎదుర్కొంటున్నారని యనమల విచారం వ్యక్తం చేశారు.

టిడిపి పాలనలో నిరుద్యోగ యువతకు రూ.2500 భృతి ఇచ్చామని, దాదాపు 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. వైసీపీ పాలనలో ఫిష్ స్టాళ్ళు, మటన్ షాపుల ఉద్యోగాలే దక్కాయన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ.3000 భృతి ఇస్తామని, రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు మహాశక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాల గురించి యనమల వివరించారు.

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం అన్నదాత పథకంలో రూ.20 వేలు ఇస్తామన్నారు. బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్నారు. ఇది శాంపిల్ మేనిఫెస్టో మాత్రమేనని, దసరా నాటికి అన్ని వర్గాల సంక్షేమానికి హామీలతో పూర్తిస్థాయి మేనిఫెస్టోను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో దోచుకున్న సంపదంతా జగన్ ఇడుపులపాయలో దాచుకున్నాడని, అందుకే రెండు వేల రూపాయల నోట్ల రద్దుకు టిడిపి ప్రతిపాదించిందని తెలిపారు. ఎన్నికలలో ధన ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే పేదలు ఇంకా పేదలయిపోతారని హెచ్చరించారు. పేదలు ధనికులుగా మారాలంటే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిన తరుణంలో మన భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ రూ.30 ఇచ్చే కార్యక్రమానికి ఈ మూలగొయ్యిలోనే ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి కట్టిన టిడ్కో ఇళ్ళకు వైసీపీ రంగులు వేసుకోవడం మినహా జగన్ రెడ్డి సాధించింది ఏమీ లేదన్నారు.
ఆవ భూముల్లో ఇళ్ళ పట్టాలు ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. విద్యుత్ వినియోగం సాకుగా చూపి పెన్షన్, రేషన్ కార్డులు రద్దు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏడుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. జగన్ మాదిరి అప్పులు తెచ్చి కాకుండా సంపద సృష్టించి చంద్రబాబు సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పారు.

మినీ మేనిఫెస్టోలోని ఆరు అంశాల గురించి గోరంట్ల స్పష్టంగా వివరించారు. సొంత బాబాయినే గొడ్డలితో చంపి గుండెపోటు అని చెప్పిన జగన్ ఆ తర్వాత చంద్రబాబే చంపించారని తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కోడికత్తి డ్రామా గురించీ వివరించారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ పాలనలో అక్రమాలు, అరాచకాలు అడ్డూ, అదుపూ లేకుండా ఉందని మండిపడ్డారు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అందరం సమిష్టిగా పని చేద్దామన్నారు. టిడిపి మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో వైసీపీ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని అన్నారు. సూపర్ సిక్స్ లాంటి పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. బటన్ నొక్కడాలు తప్ప జగన్ పాలనలో ప్రగతి లేదన్నారు. ఇసుక, మద్యం మాఫియాలు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్న సిఎం జగన్ అని మండిపడ్డారు. చంద్రబాబు జగన్ పాలనపై రాజీ లేని పోరాటం చేస్తున్నారని, లోకేష్ యువగళంతో ప్రజలలో చైతన్యం తెస్తున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వచ్చి వైసీపీ అక్రమాలను ఎండగడుతున్నారని అన్నారు. అబద్ధాల మంత్రులు రోజుకొకరు రోడ్డెక్కి చంద్రబాబును, లోకేష్ బాబును, పవన్ కళ్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని, వీళ్ళందరికీ సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మార్గదర్శకత్వం చేస్తున్నారని విమర్శించారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన చరిత్ర టిడిపికే దక్కిందన్నారు. పేదలకు పక్కా ఇళ్ళు ఇచ్చేందుకు టిడిపి హయాంలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు 90 శాతం పూర్తి చేశామని, వైసీపీ నాలుగేళ్ల పాలనలో 10 శాతం టిడ్కో ఇళ్ళు పూర్తి చేయలేకపోయారని ఆయన విమర్శించారు. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారుల మీద మూడు లక్షల చొప్పున జగన్ అప్పు తీసుకున్నాడని మండిపడ్డారు. జగనన్న కాలనీలంటూ ఇళ్ళ స్థలాలిచ్చిన చోట ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు.

రాజమండ్రి వాసులకు ఆవభూముల్లో పట్టాలివ్వడాన్ని, ఆ భూములలో కోట్లాది రూపాయల దోపిడీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నించినందుకే ఆదిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు అక్కడ పార్టీ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోందని, అదే మాదిరి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోనూ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని పిలుపునిచ్చారు.

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ…. వైసీపీ ప్రజా వ్యతిరేక విధ్వంసక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. వ్యవస్థలను జగన్ రెడ్డి తన చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ ఆస్థులు దోచుకుంటున్నారని, ప్రైవేటు ఆస్తులను కబ్జా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. దళిత డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయనను పిచ్చివాడిని చేసి చంపేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం చేశారని ఆయన మండిపడ్డారు. దుర్మార్గమైన వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ.. దళితులు, బిసిలకు సంక్షేమ పథకాలు రద్దు చేసి వేధింపులకు గురి చేస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ రెడ్డిని ఈ ప్రజలు నమ్మి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్ల వెనక్కు తీసుకుపోయారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్నదాత రైతన్న అనేక ఇబ్బందులు పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంట అమ్ముకోవడానికి కూడా రైతుకు అవకాశం లేదన్నారు. రైతన్నను ఆదుకోవడానికే అన్నదాత పథకాన్ని టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించారని తెలిపారు. సూపర్ సిక్స్ కొట్టినట్టు చంద్రన్న ప్రకటించిన పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని, ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇద్దామని చెప్పారు.

ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, బండారు సత్యానందరావు, బూరుగుపల్లి శేషారావు, ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, ఆరుమిల్లి రాధాకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి వరుపుల సత్యప్రభ, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శులు శిష్ట్లా లోహిత్, యర్రా వేణుగోపాలరాయుడు, డొక్కా నాథ్ బాబు, రాష్ట్ర కార్యదర్శులు కాశి నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, పెచ్చెట్టి బాబు, బిసి ఫెడరేషన్ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, రాష్ట్ర తెలుగుమహిళ ప్రధానకార్యదర్శి మజ్జి పద్మ, నగర టిడిపి అధ్యక్షులు రెడ్డి మణి, కొవ్వూరు నియోజకవర్గ టిడిపి నాయకులు జొన్నలగడ్డ చౌదరి, కంఠమాల రామకృష్ణ, ఆరుమిల్లి వీరరాఘవులు, జోన్-2 టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు కందుల రాయుడు, నర్సాపురం పార్లమెంట్ తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి, నగర తెలుగుమహిళ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, టిడిపి నాయకులు కోనేరు వివేక్, తదితరులు పాల్గొన్నారు.

జోన్: – 3 పరిధిలో
“భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి , టిడిపి సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కొండమోడు గ్రామం నుంచి బస్సు యాత్ర కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు మొదలైన బస్సు యాత్ర కొండమొడు గ్రామం నుంచి నేకరికల్లు లో గత టిడిపి హయాంలో వివిధ మొదలుపెట్టిన అభివృద్ధి పనులు గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 79 మండలాల్లో లక్షలాది ఎకరాలకు గోదావరి జలాలను అందించటం, రాజుపాలెంలో నిరుపయోగంగా మారిన పైప్ లైన్ల సామాగ్రిని పరిశీలించారు.

అనంతరం నెమలిపురిలోని వృక్షాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నకరికల్లులో భారీ గజమాలతో తెదేపా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు, అనంతరం నకరికల్లు వద్ద గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు పైలాన్ ను, సత్తెనపల్లి పట్టణం లోని టిడ్కో ఇళ్లు, క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సత్తెనపల్లి పట్టణం లోని ఓ ఫక్షన్ హాల్ నందు మేధావుల సదస్సు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు సత్తెనపల్లి పట్టణం నుంచి ఫనిధం గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ సభా స్థలానికి ర్యాలీగా చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు , మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, నక్కా ఆనందబాబు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు గారు, కొమ్మాలపాటి శ్రీధర్ గారు, ఇంచార్జి లు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, చదలవాడ అరవింద్ బాబు గారు, రాష్ట్ర నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, దారు నాయక్, దాసరి రాజా మాష్టర్, భీమినేని వందనా దేవి, కనుమూరి బాజీ, చోట శ్రీను, తాత జయప్రకాష్ నారాయణ, సలగల రాజశేఖర్, మానుకొండ శివ ప్రసాద్, చిట్టా బత్తిన చిట్టి బాబు, మన్నెం శివనాగ మల్లేశ్వరరావు, భిమవరపు సుబ్బారావు, సీనియర్ నాయకులు నాగోతు సౌరయ్య, ఎలినేడి రామస్వామి, గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణా, పల్నాడు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కుమ్మేత కోటిరెడ్డి, టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు సత్తెనపల్లి రూరల్ ఫనిధం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ… గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులకు 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగిందని, గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు 9.61 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. తెదేపా హయాంలో ప్రాజెక్టు నిర్మాణానికి తరలించిన సామగ్రి కూడా తుప్పుపడుతొందని, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గంలోనే ప్రాజెక్టు ఉందనే విషయం మరచిపోయారన్నారు. తక్షణమే పైలట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టాలని తెదేపా తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… దార్శనికుడు చంద్రబాబు సారధ్యంలో టీడీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రేమతో నియోజకవర్గంలో టిడ్కో గృహాలను నిర్మిస్తే, ఈ సైకో జగన్ సారధ్యంలో వైసీపీ ప్రభుత్వం ఆ టిడ్కో ఇళ్లు నాలుగేళ్లుగా పేదలకు చేరకుండా పైశాచిక ఆనందం పొందుతున్నాడని, అధినేత ప్రకటించిన మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారని, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని, ఈ జగన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి మహిళలను మోసం చేశాడని, ఇప్పటికీ 4 సార్లు కరెంట్ బిల్లులు పెంచాడాని, రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, ఈ వైసిపి ప్రభుత్వం నిలిపి వేసిన అభివృద్ధి పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం అన్నారు..

పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జీవి. ఆంజనేయులు మాట్లాడుతూ… ఈ వైసిపి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అరాచకాలకు అడ్డులేకుండ పోయిందని, భవిష్యత్తుకు గ్యారంటీ లో భాగంగా ప్రకటించిన పెనిఫెస్తో ద్వారా తెదేపా అధికారం లోకి రాగానే ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుదని, గత టిడిపి ప్రభుత్వ హయాంలో దివంగత నేత కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ ని మీరు అందరూ ఆదరించి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.

LEAVE A RESPONSE