Suryaa.co.in

Andhra Pradesh

రేషన్ వాహనాల పేరుతో వైసిపి పెద్దలు రూ.700 కోట్లు కొట్టేశారు

– ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం
– పేదల ఇళ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం
– నారా లోకేష్

నారా లోకేష్ ను కలిసిన వరిగొండ గ్రామస్తులు
• సర్వేపల్లి నియోజకవర్గం వరిగొండ గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• రేషన్ సరుకుల సరఫరా విధానం సరిగా లేదు. రేషన్ వాహనం ఎప్పుడో వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది.
• రేషన్ వాహనాలకోసం పనులు మానుకొని ఇళ్లవద్ద ఉండాల్సి వస్తోంది.
• మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాసుకున్నారు, స్థలం ఎక్కుడుందో చెప్పడం లేదు.
• అదికారులను అడిగితే డబ్బులు కడితే ఇల్లు నిర్మించి ఇస్తామంటున్నారు.
• పశుపోషణకు నిర్మించుకున్న మినీగోకులాల బిల్లులు చెల్లించడం లేదు.
• గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు నిలిపేశారు..
• అధికారులను అడిగితే మాకు సంబంధం లేదని అంటున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
• కేవలం కమీషన్ల కోసం రేషన్ వాహనాల వ్యవస్థను ప్రవేశపెట్టారు. రేషన్ వాహనాల పేరుతో వైసిపి పెద్దలు రూ.700 కోట్లు కొట్టేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి, ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం.
• రాజకీయ కారణాలతో పేదలకు ఇళ్ల బిల్లులు నిలిపివేయడం దుర్మార్గం.
• టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా అంతకుముందు మంజూరైన 2లక్షల ఇందిరమ్మ గృహాలకు అదనంగా ఆర్థికసాయం అందించి ఇళ్లు పూర్తిచేసుకునేలా చర్యలు తీసుకున్నాం.
• అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఇళ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం.
• ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తాం.

LEAVE A RESPONSE