Suryaa.co.in

Andhra Pradesh

టైమ్స్ నౌ సర్వే ఖరీదు.. రూ.8.కోట్ల 15 లక్షలు

– ఏపీ గవర్నమెంట్ ఇమేజ్ పెరిగేందుకు టౌమ్స్ నవ్‌కు రూ.8.కోట్ల 15 లక్షలు ఇస్తే.. 24-25 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని సర్వే ఇచ్చింది
– 6 మంది మంత్రులే గెలుస్తారని పీకే టీమ్ రిపోర్ట్ ఇచ్చింది
– మంత్రి కాకాణి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
– రూ.20కోట్లు నెల్లూరు జిల్లాలో రైతులకు ట్రాన్స్ పోర్ట్, గోనె సంచులకు చెల్లించాలి
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

యువగళం పాదయాత్ర బహిరంగసభకు స్వచ్ఛందంగా 25 వేల మంది వచ్చారు. మంత్రి కాకాణి పెట్టిన సభకు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది మాత్రమే వచ్చారు. మంత్రి కాకాణికి.. కళ్లు కనిపించకపోతే ఆస్పత్రికి వెళ్లి చూపించుకో. ఏపీ గవర్నమెంట్ ఇమేజ్ పెరిగేందుకు టౌమ్స్ నౌ కు రూ.8.కోట్ల 15 లక్షలు ఇస్తే.. 24 నుండి 25 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని సర్వే ఇచ్చింది.

6 మంది మంత్రులే గెలుస్తారని పీకే టీమ్ రిపోర్ట్ ఇచ్చింది. 10 నెలల క్రితం 3,500 ఓట్ల తేడాతో మంత్రి కాకాణి ఓడిపోతారని రిపోర్టు ఇచ్చింది. సింహపురి యూనివర్సిటీ మంత్రి కాకాణికి పీహెచ్‌డీ ఎలా ఇచ్చింది?. రాష్ట్రంలో ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయి అంటే లోకేశ్ బాబు, ఐటీ పెట్టుబడులు వచ్చాయంటే దానికి కారణం లోకేశ్ బాబు.

కేంద్రం ఇచ్చే నిధులు వెనక్కి వెళ్తున్నాయి. మంత్రి కాకాణి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. గూగుల్ లో కోర్టు తెఫ్ట్ అని కొడితే నీ బతుకు అంతా వస్తుంది. యువగళం పాదయాత్ర చూసి కాకాణికి రాత్రుళ్లు నిద్ర పట్టే పరిస్థితి లేదు. మీకులా మేము ఎస్సీ సబ్ ప్లాన్ ఎత్తేయలేదు, ఎస్సీ కార్పొరేషన్ లు మూసేయలేదు, రూ.10 లక్షల కోట్లు అప్పు చేయలేదు, లక్షా 80 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టలేదు. కరోనా సమయంలో 200కేజీలు పుట్టికి ఎక్కువ తీసుకున్నారు. ఎకరాకు తవెడు ఒడ్లు తీసుకుని ఇళ్లు కట్టుకున్నావు.

2004లో రాజశేఖర్ రెడ్డికి సింగిల్ గా వచ్చే దమ్ము లేక టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో పొత్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి.. మాకు దమ్ములేక జనసేనతో పొత్తుపెట్టుకుంటున్నామని చెబుతాం. ఇప్పటికీ రూ.20కోట్లు నెల్లూరు జిల్లాలో రైతులకు ట్రాన్స్ పోర్ట్, గోనె సంచులకు చెల్లించాలి. మంత్రి కాకాణి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.

యువగళం బహిరంగ సభను సక్సెస్ చేసిన సర్వేపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను. నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజ్ 43వేలు నేను తీసుకొస్తే.. దాన్ని మండలం అంతా ఇస్తానని ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకుని రూ.25వేలు ఇచ్చావు.. 18వేలు ఎగ్గొట్టావు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడితే సమాధానం చెబుతాం.. నోరు పారేసుకోకు.. మేము మాట్లాడగలం.

LEAVE A RESPONSE