Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర

” తెలుగుదేశం పార్టీ “భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర” ఆదివారం జోన్-2 పరిధిలోని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించారు. రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, జగ్గంపేట టిడిపి ఇంఛార్జి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జగ్గంపేట మోడల్ డిగ్రీ కాలేజి నుండి చైతన్య రథయాత్ర ప్రారంభమైంది.

జగ్గంపేటలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం, కాపు కళ్యాణ మండపాలను సందర్శించి అసంపూర్తి నిర్మాణాలపై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. జే. కొత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి, రాజపూడి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవిందపురంలో సచివాలయం, భూపతిపాలెం గురుకుల పాఠశాల సందర్శించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అర్ధాంతరంగా ఆగిపోయిన మల్లవరం ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు. మధ్యాహ్నం మల్లిశాల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి వెంగయమ్మపురం, సీతారామపురంల మీదుగా చైతన్య రథయాత్ర తాళ్లూరు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుంది. అనంతరం పరిణయ ఫంక్షన్ హాలులో జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభ నిర్వహించారు.

ఈ సభలో ముఖ్య అతిధిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైనది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ అన్నారు. అందులో వ్యవసాయానిది కీలకపాత్ర అని చెప్పారు. రైతు పంటలు బాగా పండించి ఆదాయం పొందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో నేడు రైతు నిలువుదోపిడీకి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు టిడిపి కృషి చేసిందన్నారు. నేడు జగన్ అరాచక పాలన వల్ల రైతాంగం అనేక కష్టాలు పడుతోందన్నారు. రైతు పండించిన పంట గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితి ఉందన్నారు. ఆక్వా కల్చర్ ను జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. గుజరాత్ అమూల్ డైరీకి అమ్ముడుపోయిన జగన్ మన డైరీలను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రైతును ఆదుకునేందుకే టిడిపి అన్నదాత పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడం కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల ప్రజల కోసం మినీ మేనిఫెస్టోలో ఆరు పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. టిడిపి హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను వైసీపీ పాలనలో రద్దు చేశారని విమర్శించారు. జగన్ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాడని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నాడని ఆరోపించారు.

ఇప్పుడు టిడిపి మినీ మేనిఫెస్టో రాగానే ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారని, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయగల సత్తా టిడిపికి ఉందన్నారు. జగన్ దోచుకున్న అక్రమ ఆస్తులను వెనక్కు తెచ్చి, ప్రభుత్వ నిధుల దుబారాను అరికట్టి, సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తామని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ మినీ మేనిఫెస్టోలో హామీలిచ్చామని చెప్పారు.

ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని యనమల ప్రకటించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, తిరిగి రాష్ట్రం ప్రగతిపథంలో పయనించాలంటే చంద్రబాబును సిఎం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్ లను ద్రోణాచార్యుడు, అర్జునుడులతో పోల్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని, నెహ్రూని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని యనమల పిలుపునిచ్చారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. పరిపాలనలో ఘోరంగా విఫలమైన జగన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. టిడిపి మద్దతుదారుల ఓట్లు తొలగించే కుట్ర నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి బూలింగ్ బూతులో మన ఓట్లు మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

టిడిపి పథకాలకు వైసీపీ రంగులు వేసుకోవడం మినహా జగన్ హయాంలో సాధించింది ఏమీ లేదని విమర్శించారు. సంపూర్ణ మద్యనిషేధం చేయిస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పటికి లక్ష కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డూ అదుపు లేదన్నారు. అందుకే చంద్రబాబు మినీ మేనిఫెస్టోతో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారని చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, అభివృద్ది, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టిడిపిని గెలిపించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వైసీపీ దురాగతాలను ప్రజలకు వివరించేందుకు టిడిపి చేపట్టిన చైతన్య రథయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న జగన్ ఇప్పుడు సిఎంగా ఎంత దోపిడీకి పాల్పడ్డాడో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఛార్జీలు, పన్నులు ఆకాశాన్నంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ సభలకు జనం లక్షలాదిగా తరలి వస్తున్నారంటే ప్రజల్లో మార్పు వచ్చిందని స్పష్టమవుతోందన్నారు.

రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, మహిళల సాధికారతకు, ఆత్మ గౌరవ పరిరక్షణకు టిడిపి ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందని చెప్పారు. నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు, లోకేష్ బాబు మహిళలను ఆడబడుచుల్లా ఆదరించి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

వైసీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగాలంటే మళ్ళీ మనం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని సుజాత పిలుపునిచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ దళితులు నా మేనమామలని చెప్పి మభ్యపెట్టి ఓట్లేయించుకున్న జగన్ అధికారంలోకి రాగానే దళితుల పైనే వేధింపులు మొదలు పెట్టారని మండిపడ్డారు. మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుబ్రహ్మణ్యంను పిచ్చి వాడని ముద్రవేసి చంపేశారని, అక్రమ ఇసుక రవాణా గురించి ప్రశ్నించిన పాపానికి వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేశారని, ఇలా చెప్పుకుంటూపోతే దళితులపై వైసీపీ పాలకుల హత్యలు, అత్యాచారాలకు అంతు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికలలో దళితులు గుణపాఠం చెప్పాలని జవహర్ కోరారు.

కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఈ దేశంలో శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అన్న ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అందిస్తే, చంద్రబాబు సంపద సృష్టించి సంక్షేమం పంచారని చెప్పారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని, జ్యోతుల నెహ్రూని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.

ఈ సభలో మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, గొల్లపల్లి సూర్యారావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వంతల రాజేశ్వరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బూరుగుపల్లి శేషారావు, ఆరిమిల్లి రాధాకృష్ణమూర్తి, గోపాలపురం టిడిపి ఇంఛార్జి మద్దిపాటి వెంకటరాజు, ప్రత్తిపాడు టిడిపి ఇంఛార్జి వరుపుల సత్యప్రభ, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సుంకర పావని, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శులు మెట్ల రమణబాబు, డొక్కా నాధబాబు, కార్యదర్శులు ఎస్.వి.ఎస్. అప్పలరాజు, విఎస్ఎన్ రాజు, నల్లమిల్లి వీరారెడ్డి, వాసిరెడ్డి ఏసుదాసు, కోర్పు లచ్చయ్యదొర, సుంకర తిరుమల కుమార్, టిడిపి జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, తూర్పుగోదావరి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుయువత అధ్యక్షులు కందుల రాయుడు, కాకినాడ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కాకినాడ జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజు, కాకినాడ జిల్లా టిడిపి దివ్యాంగుల కమిటీ అధ్యక్షులు మండపాక అప్పన్నదొర, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, జిల్లా టిడిపి క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు కన్నబాబు, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షులు అడపా భరత్ బాబు, రాష్ట్ర తెలుగురైతు అధికార ప్రతినిధి ఉంగరాల రాము, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కొత్త కొండబాబు, జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు.

Zone – 3
ప్రత్తిపాడు నియోజకవర్గం బస్సు యాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండవ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మాకినేని పెదరత్తయ్య ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గం, గోరంట్ల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. సుమారు 500 మందికి పైగా కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఉదయం 11 గంటలకు గోరంట్ల లోని కొండపైన నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులను చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు…
ఉదయం 11:30 గంటలకు ఫేజ్ 2లో టీడీపీ హయాంలో నిర్మాణం చేపట్టిన UGD కలెక్షన్ పాయింట్ ని చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు…
మధ్యాహ్నం 12 గంటలకు ఫేజ్ 2లో తెదేపా హయాంలో శంకుస్థాపన చేసిన కాపు భవన్ చూపిస్తూ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు..
మధ్యాహ్నం 12:30 గంటలకు అడవి తక్కెళ్లపాడులో తెదేపా హయాంలో నిర్మించిన క్రిస్టియన్ భవన్ ని చూపించి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.
మధ్యాహ్నం 1 గంటకు అడవి తక్కెళ్లపాడులో తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను చూపించి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.
సాయంత్రం 4 గంటలకు మౌర్య ఫంక్షన్ హాలులో తెనాలి శ్రావణ్ కుమార్, మాకినేని పెదరత్తయ్య, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
సాయంత్రం 5 గంటల నుండి 1000 మంది కార్యకర్తలతో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లారు…
రచ్చబండ కార్యక్రమానికి వెళ్లుచుండగా ప్రతీ గ్రామంలోనూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు..
పల్లపాడు గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సుమారు 2000 మంది ప్రజలు పాల్గొన్నారు…

మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య మాట్లాడుతూ..
గుంటూరు నగరo లోని మానస సరోవరం, టిడ్కో ఇల్లు, గుంటూరు ఛానల్ కు 600కోట్లు నిధులు ఇస్తే ఇంతవరకు పనులు ప్రారంభం చేయకుండా సర్వనాశనం చేశారు. కనీస సౌకర్యాలు పేరున కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ నేతలు. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏమి లేకుండా చేసిన మాజీ హోంమంత్రి సుచరిత. ప్రకృతి సంపద, మైనింగ్, దోపిడీలతో వైసీపీ నేతలు ప్రత్తిపాడు నియోజకవర్గన్ని సర్వం దోచుకు పోయారని విమర్శించారు.

రైతులకు అన్నదాత పథకం కింద డబ్బులు గత ప్రభుత్వం హయాంలో ఇస్తే నేడు వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకొని కూర్చున్నారు. టీడీపీ భవిష్యత్ హామీ… బస్ యాత్ర పేరుతో టీడీపీ మ్యానిఫెస్టోలో నూతనంగా 6సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ
వైసీపీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పధకాలను తుంగలో తొక్కింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా టీడీపీ మినీ మేనిఫెస్టో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిన పెట్టాలన్నా.. అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం. మహా శక్తి పధకం ఎంతో అద్భుతంగా ఉంది.. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది.

మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ
ప్రజల కోసం గత ప్రభుత్వం హయాంలో అనేక అభివృద్ధి పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలిక పోవడం విడ్డురంగా ఉంది. వైసీపీ అధినేతవారి అనుయాయులు సంక్షేమం ముసుకులో దోపిడీకి తెరలేపరనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు కోట్ల రూపాయల దండుకున్నారు.

1902 నెంబర్ కి చెబుతామని పెట్టిన కార్యక్రమం పనిచేయదు మరల జగనన్న సురక్ష పధకం పేరుతో నయా మోసానికి తెరలేపారు. పేదలు సొంత డబ్బుతో ఇల్లు కట్టుకుండామని మొదలు పెట్టిన వెంటనే రాబందుల మాదిరిగా పీడించుకుంటానికి సిద్ధంగా వుంటారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జి.వి ఆంజనేయులు, మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, యరపతినేని శ్రీనివాసరావు, గుంటూరు తూర్పు ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్, గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకురాలు భీమినేని వందనాదేవి, గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిట్టాబత్తిన చిట్టిబాబు, దాసరి రాజమాష్టారు, మద్దిరాల ఇమ్మానుయేల్, యం. ధారు నాయక్, కూచిపూడి విజయ, మానుకొండ శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు, రాష్ట్ర టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుంటుపల్లి శేషగిరిరావు, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివ సాంబిరెడ్డి, నిమ్మల శేషయ్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీ కృష్ణ, జిల్లా బిసి విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, జిల్లా రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, జంపని హనుమంతరావు, కార్పొరేటర్లు నూకవరపు బాలాజీ, యల్లావుల అశోక్ యాదవ్, వేములపల్లి శ్రీరాంప్రసాద్, ముప్పవరపు భారతి, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.

Zone 4

తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ..
-నగరి నియోజకవర్గ.టీడీపీ ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో నగరిలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రలో చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం
నగరి నియోజకవర్గ కేంద్రంలో విజయవంతంగా జరిగింది. ఓంశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా టవర్ క్లాక్ సర్కిల్ కు చేరుకుని.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
అనంతరం నగరి రూరల్ మండలం క్రిష్ణరామాపురం గ్రామం నందు రచ్చబండ మరియు పల్లెనిద్ర నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహయాదవ్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ ఇంఛార్జులు చల్లా బాబు(పుంగనూరు), హెలెన్(సత్యవేడు), వి.ఎం.థామస్(జీడీనెల్లూరు), నరసింహ ప్రసాద్(రైల్వే కోడూరు), మాజీ మంత్రి పరసారత్నం, మురళీమోహన్(పూతలపట్టు) నియోజకవర్గ పరిశీలకులు డా.చెన్నూరు సుధాకర్.

ZONE-5
శింగనమల నియోజవకర్గంలో బస్సుయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట జోన్-5 బస్సు యాత్ర కార్యక్రమం నాల్గవ రోజు (02-07-2023, ఆదివారం) శింగనమల నియోజకవర్గంలో నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు మరియు ముంటిమడుగు కేశవరెడ్డి గార్ల ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం, ఇల్లూరు గ్రామం నుంచి ప్రారంభమైనది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఉదయం 11.40 గంటలకు ఇల్లూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో గ్రామంలో వీధివీధినా తిరుగుతూ నాయకుల బృందం పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు పంచి వివరించడం జరిగింది. అనంతరం గ్రామంలో ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజల నుండి మంచి స్పందన లభించింది.

మధ్యాహ్నం 12.45 లకు ఇల్లూరు గ్రామం నుంచి యాత్ర బృందం బయలుదేరి కల్లూరు గ్రామానికి చేరకుంది. అక్కడ ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. మధ్యాహ్నం 01.10 లకు కల్లూరులో తెదేపా ప్రభుత్వహయాంలో నిర్మించిన షాదీఖానా వద్ద సెల్ఫీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మధ్యాహ్నం 01.40 గంటలకు కల్లూరు గ్రామం నుండి ఎగువపల్లి గ్రామానికి యాత్ర బృందం చేరుకుంది. అక్కడ హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నిలుపుదల చేయడంతో అక్కడ నాయకులు సెల్ఫీ దిగారు.
మధ్యాహ్నం 01.55 గంటలకు ఎగువపల్లి గ్రామంలో వైఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో యాత్ర బృందం పాల్గొంది. రైతులకు రాబోయే రోజుల్లో తెదేపా మ్యానిఫెస్టోను తెలియజేయడం జరిగింది.

సాయంత్రం 05.20 గంటలకు యాత్ర బృందం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సమీపంలో ఉన్న వైసిపి ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి ఇసుక డంప్ వద్ద నాయకుల బృందం సెల్ఫీ దిగారు.
సాయంత్రం 06.10 గంటలకు యాత్ర బృందం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమం పాల్గొనేందుకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులకు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ నిర్వహించి సభాప్రాంగణానికి చేరుకొని నాయకులు ప్రసంగిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు మరియు ముంటిమడుగు కేశవరెడ్డి గార్లతోపాటు అనంతపురము పార్లమెంటు అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు బికె పార్థసారధి, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఏపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కరణం రామమోహన్ మరియు జి. ఆదెన్న, ఏపి రాష్ట్ర ఎస్‌సి సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు, ఏపి రాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల విజయ్‌కుమర్, జి. వెంకటశివుడు యాదవ్, బి. బుగ్గయ్య చౌదరి, జెఎల్ మురళి, కురుబ శివబాల, అనంతపురము పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జి. శ్రీధర్ చౌదరి, పార్లమెంటు అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు, బుక్కరాయసముద్రం మాజీ జడ్పిటిసి రామలింగారెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జె. గౌస్ మోద్దీన్, మాజీ మేయర్ స్వరూప, తెలుగయువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, వందల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE