Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడలో స్వర్గీయ రంగా జయంతి వేడుక

స్వర్గీయ రంగా జయంతి సందర్భంగా కాపు బలిజ తెలగ ఒంటరి సంఘాల కార్యాచరణ ఐక్యవేదిక విజయవాడలోని శేషసాయి కల్యాణమండపం లో స్వర్గీయ మిరియాల వెంకట్రావు కి సతీమణి ప్రమీలమ్మ ఆశీస్సులతో పోరుమామిళ్ల ఈశ్వర్ రాయల్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సభలో నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చిన శ్రీ సేవా సమితి వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థపక అధ్యక్షులు సింగంశెట్టి పద్మావతీశ్రీదేవి మాట్లాడుతూ కులానికి ప్రాంతాలవారీగా ఇరు మారిన అందరం కాపు బలి ఒంటరి తెలగ అన్ని ఒకే కులం మన వంశవృక్షం శ్రీకృష్ణదేవరైసలు వారు. వారి ఆశయ సాధనలో కీర్తిశేషులు వంగవీటి రంగా కులామతాలకు అతీతంగా అందరిని ఆడుకుని అన్నా అని పిలిపించుకుంటున్నారు.

నేటికీ అదే స్ఫూర్తితో ఎన్ని సంఘాలు పెట్టిన ఆ సంఘాల నాయకులందరు ఒక అధ్యక్షుని ఎన్నుకుని ఆయన సూచనలతో అందరూ నడవాలి, ప్రతి ఒక్కరూ ప్రతిభవున్నవారిని ప్రోత్సాహించాలి అప్పుడే రాజ్యాధికారం సాధించగలం. ముఖ్యంగా అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకువచ్చి ప్రోత్సహించి రాజకీయంగా బలోపేతం చేయాలి.అన్నారు.అనంతరం మహిళలందరితో కలసి వంగవీటి రంగా పఠం ముందు కేక్ కట్ చేశారు.

ఈ సభకు రాయలసీమ, చిత్తూరు, కడప కర్నూలు , అనంతపురం, నెల్లూరు, ప్రకాశం బాపట్ల, గుంటూరు విజయవాడ, గోదావరిజిల్లాలు, విశాఖ విజయనగరం, శ్రీకాకుళం నుంచి పెద్దసంఖ్యలో సమావేశమై ఉదయం 10నుంచి సాయంత్రం 5 వరకు ప్రసంగించారు.

LEAVE A RESPONSE