-చేనేతలంటే నీకంత చులకనా?
-వివాదాలకు దూరంగా ఉండే చేనేతల వర్గంపై ఒక్క పోలీస్ కేసూ లేదు
-అవినాష్ గుప్తాను ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి
-టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
బాకీ తీర్చమన్న చేనేత వ్యాపారిని బట్టలూడదీసి కొట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం. బడుగు, బలహీనల వర్గాలంటే జగన్ రెడ్డికి చులకన భావం. విజయవాడ నడిబొడ్డున చేనేత వర్గానికి వైసీపీ ప్రభుత్వం తీవ్ర అవమానం చేసింది. జగన్ రెడ్డి అండ చూసుకునే అవినాష్ గుప్తా వంటి రౌడీ మూక పేట్రేగుతున్నారు. ఎంత దారుణమైన ఘటన ఇది.
వైసీపీ నేత అవినాష్ గుప్తా తన వస్త్ర షోరూం ఆలయ సిల్క్స్ ను బతికించుకోడానికి ఎంతటి దారుణాలకైనా వెకకాడబోడని అర్ధమవుతోంది. సరఫరా చేసిన సరుక్కి డబ్బు అడగటమే చేనేత వ్యాపారి శశి చేసిన నేరమా? డబ్బు చెల్లించమన్న శశి, కోటం ఆనంద్ ని అవినాష్ గుప్తా బట్టలూడదీసి నగ్నంగా కూర్చోబెట్టాడు. నీచంగా బూతులు తిడుతూ చితకబాదాడు. వైసీపీ పెద్దల అండ చూసుకొనే అవినాష్ గుప్తా ఇంతలా చెలరేగాడు.
చేనేతలు ఎక్కువగా ఉండే మంగళగిరి ప్రాంతంలోనే జగన్ రెడ్డి కూడా నివాసం ఉంటున్న విషయం గుర్తుంచుకోవాలి. చేనేతలంటే నీకంత చులకనా? సున్నితంగా వెళ్లి బకాయి అడిగితే అవమానిస్తారా? ఖబడ్దార్ జగన్ రెడ్డీ?
రాష్ట్రంలో 47 లక్షలమంది చేనేతలు ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉండే చేనేతల వర్గంపై ఒక్క పోలీస్ కేసూ లేదు. కదిరి, ధర్మవరం, వెంకటగిరి, ప్రొద్దుటూరు, మంగళగిరి, భీమిలి, గాజువాక వంటి ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువగా ఉన్నారు.
చేనేతల అభ్యున్నతికి చంద్రబాబు , లోకేష్ ఎంతో చేశారు. రుణమాఫీ, సబ్సిడీ లోన్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలతో చంద్రన్న చేనేతలను ఆదుకుంటే జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ విధానాలతో చేనేత రంగం కుదేలైంది. నేతన్న నేస్తం పేరుతో మోసం చేస్తున్నారు.
వైసీపీ పాలనలో ఉపాధి లేక ధర్మవరంలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే కనీసం జగన్ పట్టించుకోలేదు. 20 రోజుల క్రితమే విజయవాడ ఘటన జరిగింది. అవమానభారంతో శశి కుటుంబం ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత?
అవినాష్ గుప్తాకు ఊరంతా అప్పులేనని తెలుస్తోంది. అతడి మొహానికి ఆడి కారు ఉందంట. దొరికిన చోటల్లా అప్పులు చేయడం, బాకీ కట్టమంటే చెలరేగి వ్యవహరించడమే అవినాష్ నీచ చరిత్ర. సన్నాసి అవినాష్ గుప్తా సంగతి తెలుగుదేశం పార్టీ తేలుస్తుంది. చేనేతలను తీవ్రంగా అవమానించిన అవినాష్ గుప్తాను ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి.