Suryaa.co.in

Andhra Pradesh

ప్రసన్నకుమార్ రెడ్డి ప్రజలసొమ్ముని దిగమింగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు

-రేసులకోసం విమానాల్లో తిరుగుతూ, ప్రజల సొమ్ముని కొల్లగొడుతున్నావు
-ప్రసన్నకుమార్ రెడ్డికి రాజకీయభిక్ష పెట్టింది చంద్రబాబు
-యువగళం పాదయాత్ర ప్రదేశంలో (కోవూరు) కోవూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డి, మాజీఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

2019కి ముందు బీద అరుపులు అరిచిన ప్రసన్నకుమార్ రెడ్డికి నేడు వేలకోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? : పోలంరెడ్డి దినేశ్ రెడ్డి
చంద్రబాబు రాజకీయభిక్షపెడితే, ఎమ్మెల్యే అయ్యావని గుర్తుంచుకో ప్రసన్నకుమార్ రెడ్డి. లోకేశ్ నీ అవినీతికి సంబంధించిన వాస్తవాలు బయటపెట్టాడుకాబట్టే ఉలిక్కిపడుతున్నావు.తనఆస్తిపత్రాలు బయటపెడతానంటున్న ప్రసన్నకుమార్ రెడ్డి, నెలనెలా తనకు ఏఏ మార్గాల్లో ఎంత నల్లధనం వస్తుందో చెప్పగలడా? 2019కి ముందు బీదఅరుపులు అరిచిన వ్యక్తి, నేడు హైదరాబాద్ లో పెద్దప్యాలెస్ ఎలా కడుతున్నాడు?

“కోవూరు వైసీపీఎమ్మెల్యే అవినీతిగురించి రూ.1500కోట్ల దోపిడీగురించి నియోజ కవర్గంలో చిన్నపిల్లలు కూడా చెబుతారు. నియోజకవర్గంలోని నాలుగు ఇసుక రీచ్ లనుంచి రోజూ వందలాదిలారీల ఇసుక తరలిపోతోంది. అదంతా ఎటుపోతోం దో ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు ప్రజలకు చెప్పుడు? కోడిగుడ్లు కాకులు ఎత్తుకు పోయాయని చెప్పినట్టే ఇసుకలారీలు కూడా కాకులు ఎత్తుకెళ్లాయంటారా? బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు మండలాలనుంచి రోజూ వందలాది గ్రావెల్ లారీలు ఎటుపోతున్నాయో సమాధానంచెప్పు ప్రసన్నకుమార్ రెడ్డి? నీ గ్రావెల్ దోపిడీపై తాము లోకాయుక్తలో ఫిర్యాదుచేస్తే, విజిలెన్స్ విభాగం విచారణజరిపి, రూ.100 కోట్లకుపైగా విలువైన గ్రావెల్ ను కనిగిరి రిజర్వాయర్ నుంచి మాయం చేశారని తేల్చింది. మైనింగ్ శాఖకు, కలెక్టర్ కు ఫిర్యాదుచేశాకే గ్రావెల్ దోపిడీ ఆగింది. 2019వరకు ఉన్న పాలతిప్ప ఏమైంది? గ్రావెల్ తవ్వకాలు జరిపినప్రాంతాలకు ఎమ్మెల్యే వస్తే, ఆయన ఏస్థాయిలో తవ్వకాలు జరిపించారో కళ్లకుకట్టినట్టు చూపి స్తాం.

నియోజకవర్గంలో ఏనాడూలేని విధంగా ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చాకే గంజాయి, కల్తీమద్యం అమ్మకాలు పెరిగాయి
ఇందుకూరుపేట మండలంలో రెండుట్రాక్టర్లలో దొరికిన కల్తీమద్యం, కోవూరులోని కొన్ని కళాశాలల్లో గంజాయి ఎక్కడినుంచి వచ్చాయో ఎమ్మెల్యే సమాధానం చె ప్పాలి. నియోజకవర్గం ఆవిర్భవించినప్పటినుంచీ ఏనాడూలేని గంజాయి, ప్రస న్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే ఎక్కడపడితే అక్కడ దొరుకుతోంది. క్రికెట్ బెట్టింగులు, పేకాటకేంద్రాలు, పోలీస్ స్టేషన్లనుంచి నెలానెలా వసూళ్లు.. ఇవన్నీ ఎవరికోసం ఎవరు చేస్తున్నారో సమాధానంచెప్పు ప్రసన్నకుమార్ రెడ్డి?

నీ దోపిడీ గురించి లోకేశ్ చెప్పింది నూటికినూరుశాతం నిజం. నీతండ్రిని లోకేశ్ ఏమీ అనలేదు. అలాంటివ్యక్తి కొడుకువని చెప్పడానికే సిగ్గేస్తోంది. నీతండ్రి విగ్రహం ప్రారంభోత్సవానికి వెళ్లని నువ్వు, నీతండ్రిగురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది ప్రసన్నకుమార్ రెడ్డి. లోకేశ్ తాను ఎప్పుడు, ఎక్కడ చదివింది.. చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనచదువుకునే వయసులో విహారయాత్రలో దిగిన ఫోటోల్ని ఇంక ఎంతకాలం చూపించి మాట్లాడతారు నువ్వు, నీ నాయకుడు జగన్ రెడ్డి?

2019కి ముందు బీదఅరుపులు అరిచిన ప్రసన్నకుమార్ రెడ్డి, నేడు హైదరాబాద్ లో పెద్దప్యాలెస్ కట్టేస్థాయికి ఎలావచ్చాడు?
2019వరకు బీదఅరుపులు అరిచిన ప్రసన్నకుమార్ రెడ్డి జేబులు నేడు గలగల లాడటంలోని ఆంతర్యంఏమిటి? హైదరాబాద్ లో పెద్దప్యాలెస్ నిర్మించే అంత సొమ్ము ప్రసన్నకుమార్ రెడ్డికి ఎక్కడినుంచి వచ్చిందని వైసీపీనేతలే ప్రశ్నిస్తు న్నారు. ఆస్తిపత్రాలన్నీ లోకేశ్ ముందు పెడతానంటున్న ప్రసన్నకుమార్ రెడ్డి, తనకు వచ్చే నల్లధనం వివరాల్ని కూడా బహిర్గతపరచాలి. ఏఏ మార్గాల్లో నెలనె లా తనకు ఎంతవస్తుందో చెప్పాలి.

క్రికెట్ బెట్టింగ్, గంజాయి, కల్తీమద్యం అమ్మకా లతో కొల్లగొట్టిన వేలకోట్లసొమ్ము ఎటుపోయిందో చెప్పాలి. మైపాడుబీచ్ లో కట్టిన రిసార్ట్స్, విడవలూరు మండలం రామతీర్థంలో కట్టిన బీచ్ రిసార్ట్స్ ఎవరి హాయాం లో నిర్మించారో తెలియని నువ్వు ఎమ్మెల్యేవా ప్రసన్నకుమార్ రెడ్డి?

కేంద్రప్రభు త్వ సహకారంతో రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తే, అది చంద్రబాబు హాయాంలోకట్టినట్టు కా దా? కేంద్రప్రభుత్వం పర్యాటకశాఖకు ఇచ్చిననిధులకు కొన్ని, చంద్రబాబు హా యాంలో మరికొంత జోడించి పర్యాటకులకోసం నిర్మించిన రిసార్ట్స్ ను, జగన్ రెడ్డి వచ్చాక పూర్తిగా ఎందుకూ పనికిరాకుండాచేశాడు.
లోకేశ్ వాస్తవాలు మాట్లాడినందునే ప్రసన్నకుమార్ రెడ్డి ఉలిక్కిపడుతున్నాడు. అతని దోపిడీ, ట్రస్ట్ ముసుగులో అతనుచేసే అవినీతి అన్నీ ప్రజలముందు పెడతాం.

లోకేశ్ వాస్తవాలు మాట్లాడాడు కాబట్టే, ప్రసన్నకుమార్ రెడ్డి ఉలిక్కిపడుతు న్నాడు. 2019కి ముందు ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బందిపడిన నువ్వు, ఇప్పు డు ఎక్కడపడితే అక్కడ రూ.10వేలు, రూ.15వేలు ఇస్తున్నావు. ఆ సొమ్మంతా ఎక్కడనుంచి వచ్చింది? నాయకులనుంచి, ప్రజలనుంచి కొల్లగొట్టిందికాదా? ఎన్.ఎస్.ఆర్ ట్రస్ట్ చిట్టా బయటపెడితే, దానివెనుక జరిగే అక్రమాలు బయటపెడతాం.

బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీని నగరపంచాయతీగా మార్చింది మాజీఎమ్మె ల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. కోవూరుని కూడా అలానే నగరపంచాయతీగా మార్చాలని ప్రపోజల్ పెట్టారు. టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడే సైడ్ కాలువలు ని ర్మించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేశాము. నువ్వు ఎమ్మెల్యే అయ్యాక టీడీపీ ప్రభుత్వం 4అడుగులవెడల్పుతో నిర్మించిన సైడ్ కాలువల్ని రెండున్నర అడుగు లకు కుదించావు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేయకుండా కమీషన్లు ఇస్తేనే పను చేస్తామని మెలికపెడుతున్నావు.

తండ్రి ఇచ్చిన ఆస్తిని తనవ్యసనాలకు తగలేసిన ప్రసన్నకుమార్ రెడ్డి, ఇప్పుడు ప్రజలసొమ్ముని దిగమింగుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు
ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి చంద్రబాబుని, టీడీపీని అంటే నీ సంగతి ఏంటో ప్రజలసమక్షంలోనే తేలుస్తాం. ముఖ్యమంత్రిని కలిసి సీబీఐ విచారణ కోరతాను అంటున్న ప్రసన్నకుమార్ రెడ్డి ముందు నియోజకవర్గంలోని 10 ఇసుకరీచ్ లలో నాలుగేళ్లలో జరిగినదోపిడీపై మాట్లాడాలి. క్రికెట్ బెట్టింగులు, గంజాయి, కల్తీమద్యం, గ్రావెల్ అమ్మకాలపై కూడా ముఖ్యమంత్రికి చెప్పాలి. కనిగిరి రిజర్వాయర్ లోనే 100కోట్ల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తేల్చింది. ఇవన్నీ ముఖ్యమంత్రికి చెప్పి, తనపై ప్రసన్నకుమార్ రెడ్డి విచారణకోరాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రసన్నకుమార్ రెడ్డికి రాజకీయభిక్ష పెట్టింది చంద్రబాబు. నువ్వు ఈనాడు ఎమ్మెల్యే అయ్యావంటే దానికికారణం టీడీపీనే. రాజకీయఓనమాలు నేర్పినపార్టీని, వ్యక్తిని దుర్భాషలాడితే నీబతుకంతా బట్టబయలుచేస్తాం. చంద్ర బాబు కష్టపడి పైకొచ్చారుగానీ, నీలాగా మీనాయకుడిలా ప్రజల్ని దోచుకొని రాత్రి కి రాత్రి కోట్లకు పడగలెత్తలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి చాలామంచివాడు. ఆయనఇచ్చిన భూములు, ఆస్తిని తనవ్యసనాలకు పూర్తిగా ఖర్చుచేసి, ఇప్పు డు ప్రజలసొమ్ము దోచుకుంటున్నాడు. మట్టి, ఇసుక, కల్తీమద్యం, గంజాయి, క్రికె ట్ బెట్టింగులతో నియోజకవర్గాన్ని మాఫియాలకు అడ్డాగామార్చాడు. ప్రసన్నకు మార్ రెడ్డికి దమ్ము, ధైర్యముంటే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకురావాలి. అది చేతగాక, నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే, చూస్తూఊరుకోము.”

రేసులు, ఇతర వ్యసనాలకోసం ప్రజల్ని దోచుకుంటున్న ప్రసన్నకుమార్ రెడ్డికి, లోకేశ్ ని అనేంత స్థాయి లేదు : పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ప్రసన్నకుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుండా, సంస్కారం మర్చిపోయి లోకేశ్ ని అంటే, అతనికి ఎలాచెప్పాలో అలానే సమాధానం చెబుతాం. “ ప్రసన్నకుమార్ రెడ్డి నువ్వు మాట్లాడినదానికంటే మేము ఎక్కువే మాట్లాడగలం. లోకేశ్ ను అనేంతటి వాడివి అయ్యావా? దుర్మార్గంగా, దురాగతాలతో, అక్ర మంగా సంపాదిస్తూ, కోవూరునియోజకవర్గాన్ని మాఫియాలకు అడ్డాగా మార్చిం ది నువ్వుకాదా? నీసంపాదనకోసం నియోజకవర్గంలో ఎన్నడూలేని గంజాయిని తీసుకొచ్చి, విద్యార్థులు, యువతజీవితాల్ని నాశనంచేస్తున్నావు.

ఐటీ, పంచా యతీ రాజ్ శాఖమంత్రిగాఉన్నప్పుడు లోకేశ్ కోవూరు నియోజకవర్గ తాగునీటి సమస్యను పరిష్కరించాడు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాడు. నీతండ్రి కోట్లరూపాయల విలువచేసే ఇంటిని నీకుఇస్తే, దాన్ని నీ వ్యసనాలకోసం సినిమాతారలకు ఇచ్చిన నువ్వు, లోకేశ్ ని అంటావా?

అసలు నీ బతుకేంటో చెప్పు ప్రసన్నకుమార్ రెడ్డి? రేసులకోసం విమానాల్లో తిరుగుతూ, ప్రజల సొమ్ముని కొల్లగొడుతున్నావు. లోకేశ్ నీ గురించి చెప్పినదానిలో ఎక్కడా అక్షరం తప్పులేదు. నారాయణ మంత్రిగాఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి కోవూరు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధిచేశామో ప్రజలకు తెలుసు. నువ్వు వచ్చాక ఏంచేశావో కూడా వారు బాగాచెప్పగలరు?

రాజశేఖర్ రెడ్డికి అమ్ముడుపోయి, అక్రమాలు అన్యాయాలతో నియోజకవర్గాన్ని దోచేసిన నువ్వు లోకేశ్ ని అంటావా? ముందు నీబతుకేంటో తెలుసుకో ప్రసన్న కుమార్ రెడ్డి
2019కి ముందు కనిపించినవాడినల్లా డబ్బులు అడిగితీసుకొని, ఇప్పుడు వారి నోట్లో మట్టికొట్టి, ముఖంచూపించకుండా తిరుగుతున్నావు. నీచాతినీచమైన బ తుకు బతికిన ప్రసన్నకుమార్ రెడ్డి మాఫియాలసాయంతో రియల్ ఎస్టేట్ వ్యాపా రుల్ని బెదిరించి, ప్రకృతివనరుల్ని అమ్ముకుంటూ, వేలకోట్లు దోచేశాడు. లోకేశ్ ను నువ్వు బూతులుతిడితే, మేం తిట్టలేమా? నిన్నుతిట్టడానికి మాకు సంస్కా రం, సభ్యత అడ్డువస్తున్నాయి.

రాజశేఖర్ రెడ్డికి అమ్ముడుపోయి, అన్యాయాలు, అక్రమాలతో కోవూరునియోజకవర్గాన్ని దోచేశావు. నీ బాగోతం, నీ దుర్మార్గాలు, నీ అక్రమాలు, అవినీతి తెలియనివారు ఎవరూలేరు. ప్రసన్నకుమార్ రెడ్డి.. నీ బతుకేంటో మీపార్టీవారికి, మాపార్టీలోని వారికి బాగాతెలుసు. డెల్టాప్రాంతమైన కోవూరు రైతాంగానికి నాలుగేళ్లలో ఏంచేశావో సమాధానంచెప్పు.

ఇఫ్ కో వద్ద గమేశా ఫ్యాక్టరీ టీడీపీప్రభుత్వంలో వచ్చింది. బళ్లారి-బాంబే హైవేని కేంద్రప్రభుత్వ సహకారంతో చంద్రబాబు అభివృద్ధిచేశారు. కోవూరునియోజకవర్గానికి ఇదిగో ఈ పనిచేశానని చెప్పగలవా ప్రసన్నకుమార్ రెడ్డి? సంస్కారం మర్చిపోయి మాట్లాడి తే, నీకు ఎలా సమాధానంచెప్పాలో బాగాతెలుసు ప్రసన్నకుమార్ రెడ్డి. లోకేశ్ పై మరోసారి నోరెత్తితే భారీమూల్యం చెల్లించు కుంటావు జాగ్రత్త! ”

LEAVE A RESPONSE